adwani
-
అద్వానీది పాకిస్తాన్.. ఇక్కడ సెటిలయ్యారు: మాజీ సీఎం రబ్రీదేవి
బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ నేత రబ్రీ దేవి బీజేపీని టార్గెట్ చేశారు. ‘ప్రధాని మోదీ ఇప్పుడు వచ్చారు. పాకిస్తాన్-పాకిస్తాన్ అంటున్నారు. అద్వానీ పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి. అతను భారత్‌కు వచ్చి స్థిరపడ్డారు. దేశంలో ఇండియా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతోంది’ అని రబ్రీ వ్యాఖ్యానించారు.పాకిస్తాన్ జిహాదీలు ఇండియా కూటమి నేతలకు మద్దతిస్తున్నారని ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై రబ్రీ ఎదురుదాడి చేశారు. ‘మోదీ ప్రకటనల మాదిరిగా పరిస్థితులు ఉంటే భారత ప్రభుత్వ ఏజెన్సీలు ఏం చేస్తున్నాయి? అంటే ప్రధాని మోదీ విఫలమయ్యారా? దేశంలో మహా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది. బీహార్‌లో మహాకూటమి ప్రకంపనలు రేపుతోంది’ అని రబ్రీదేవి వ్యాఖ్యానించారు. కాగా ఎన్డీఏ ప్రభుత్వం మనల్ని లాంతరు యుగానికి తీసుకెళ్లింది. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 200 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా ఇస్తామని రబ్రీదేవి కుమార్తె, పాటలీపుత్ర అభ్యర్థి మిసా భారతి హామీనిచ్చారు.గ్రామాలకు వెళితే కరెంటు బిల్లులు అధికంగా వస్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష నేతలందరినీ జైల్లో పెడుతున్నారని మిసా భారతి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత పదేళ్లుగా ప్రజలు మోసపోతున్నారు. ద్రవ్యోల్బణం తగ్గలేదు. నిరుద్యోగం పోలేదు అని ఆమె బీజేపీపై మండిపడ్డారు. -
బీజేపీ ‘రథ యాత్రికుడు’ అద్వానీ!
భారత అత్యన్నత పౌర పురస్కారమైన భారతరత్నను మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ(96)కి అందజేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ నేపధ్యంలో అద్వానీ జీవితంలో చోటుచేసుకున్న ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం. లాల్ కృష్ణ అద్వానీ అసలు పేరు లాల్ కిషన్‌చంద్ అద్వానీ. అతని ప్రారంభ విద్య కరాచీలో సాగింది. తరువాత లాహోర్‌లో చదువుకున్నారు. అనంతరం ముంబైలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యారు. బీజేపీని ఇప్పడున్న ఉన్నత స్థాయికి తీసుకువచ్చిన ఘనత లాల్ కృష్ణ అద్వానీకే దక్కుతుంది. ఇద్దరు ఎంపీల స్థాయి కలిగిన బీజేపీని 150 మంది ఎంపీలు ఉన్న పార్టీగా రూపొందించిన ఘనత అద్వానీకే దక్కుతుంది. అద్వానీ చదువుకునే సమయంలో ఆర్ఎస్ఎస్లో చేరారు. 1947లో కరాచీలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యదర్శిగా నియమితులయ్యారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 1951లో జన్ సంఘ్‌ను స్థాపించినప్పుడు, ప్రారంభ సభ్యులలో అద్వానీ కూడా ఒకరు. 1957 వరకు అద్వానీ సంఘ్ కార్యదర్శిగా కొనసాగారు. జన్ సంఘ్‌లో ముఖ్యమైన పదవుల్లో పనిచేసిన తర్వాత 1972లో అద్వానీ సంఘ్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. తరువాత ఆ పార్టీ జన్ సంఘ్ నుండి బీజేపీగా మారినప్పుడు.. అంటే 1980లో పార్టీ స్థాపించినప్పటి నుండి 1986 వరకు లాల్ కృష్ణ అద్వానీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అనంతరం 1986 నుంచి 1991 వరకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. 90వ దశకంలో లాల్ కృష్ణ అద్వానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి ద్వయం భారత రాజకీయాలలో కీలక వ్యక్తులుగా మారారు. రామాలయ ఉద్యమాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లారు. ఒకదాని తర్వాత ఒకటిగా అద్వానీ చేపట్టిన యాత్రల ఫలితం అతి తక్కువ వ్యవధిలోనే భారతీయ జనతా పార్టీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. అలాగే పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అద్వానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి జంట 1996 లోక్‌సభ ఎన్నికలలో భిన్నమైన చరిత్రను సృష్టించింది. 1996లో తొలిసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాజ్‌పేయి ప్రధానమంత్రిగా, అద్వానీ హోంమంత్రిగా పదవులు చేపట్టారు. ఆలయ ఉద్యమం తర్వాత, అద్వానీకి ప్రజాదరణ తారాస్థాయికి చేరింది. దీంతో అద్వానీని ప్రధానిని చేయాలనే ఆలోచన నాటి బీజేపీ నేతలలో కలిగింది. అయితే అద్వానీ స్వయంగా అటల్ బిహారీ వాజ్‌పేయి పేరును ప్రధాని పదవికి సూచించారని చెబుతారు. కాగా అద్వానీ అరడజనుకు పైగా రథయాత్రలు చేపట్టారు. వాటిలో ‘రామ రథ యాత్ర’, ‘జనదేశ్ యాత్ర’, ‘స్వర్ణ జయంతి రథయాత్ర’, ‘భారత్ ఉదయ్ యాత్ర’,‘భారత్ సురక్ష యాత్ర’ ముఖ్యమైనవి. -
ప్రాణప్రతిష్ఠకు అద్వానీ, జోషి దూరం?
అయోధ్యలో నేడు జరిగే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి హాజరకావడంలేదంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. తీవ్రమైన చలి వాతావరణం కారణంగా అద్వాని అయోధ్యకు వెళ్లడం లేదని సమాచారం. రామమందిర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన లాల్ కృష్ణ అద్వానీతో పాటు బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి కూడా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకావడం లేదని తెలుస్తోంది. పెరుగుతున్న వయస్సు, ఆరోగ్య సంబంధిత సమస్యల దృష్ట్యా ఈ సీనియర్ నేతలిద్దరూ బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి లాల్ కృష్ణ అద్వానీ 90వ దశకంలో రామమందిర ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన నేతృత్వంలో 1990లో గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి బీజేపీ రథయాత్రను ప్రారంభించింది. ‘మందిర్ వహీ బనాయేంగే’ నినాదంతో లాల్ కృష్ణ అద్వానీ రామమందిర ఉద్యమాన్ని సామాన్య ప్రజలలోకి తీసుకెళ్లారు. విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్‌తో పాటు ఇతర ప్రముఖులు స్వయంగా ఎల్‌కె అద్వానీ ఇంటికివెళ్లి, శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇది కూడా చదవండి: మారిషస్ నుంచి డెన్మార్క్ ... అంతా రామమయం! రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ‘96 ఏళ్ల వయస్సులో ఉన్న లాల్‌కృష్ణ అద్వానీ,90 ఏళ్ల వయస్సు కలిగిన మురళీ మనోహర్ జోషిలను ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించాం. అయితే వారు వయస్సు, అనారోగ్య కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమానికి హాజరుకాలేని స్థితిలో ఉన్నారని’ తెలిపారు. -
నాలుగు స్తంభాలు!
అయోధ్యలో 1528లో మొఘల్ చక్రవర్తి బాబర్ హయాంలో బాబ్రీ మసీదు నిర్మాణం జరిగితే 1992 డిసెంబర్ 6న కరసేవకులు దాన్ని కూల్చేశారు. అప్పట్లో కీలక స్థానాల్లో ఉండి ఈ ఘటనలో ప్రమేయం ఉన్న నేతలు చాలామంది బీజేపీ నేతలు ఇపుడు అంతగా ప్రాధాన్యం లేని స్థితిలో ఉన్నారు. వారిలో సీనియర్ నాయకులు అద్వానీ, మురళీ మనోహర్జోషి, ఉమాభారతి క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. బాబ్రీ కూల్చివేత కేసులో వీరి ప్రమేయం, అప్పట్లో ఏం చేశారు? ఇప్పుడెలా ఉన్నారో చూద్దాం... న్యూఢిల్లీ: ఎల్.కె.అద్వానీ 1989లో బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక పార్టీ బలోపేతానికి రథయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర రెండు ఘటనలకు దారితీసింది. ఒకటి... 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చివేయటం. రెండోది బీజేపీని అధికార పీఠంపై కూర్చోబెట్టడం. గుజరాత్‌లోని సోమ్‌నాథ్‌లో మొదలైన అద్వానీ రథయాత్ర ఒక్కో రాష్ట్రం దాటుతూ యూపీలోని అయోధ్య చేరుకోవాలి. దారి పొడవునా జనం బ్రహ్మరథం పట్టారు. అంతా బాబ్రీ మసీదు వద్దకు చేరుకోవాలంటూ అద్వానీ ఉద్రిక్త పూరిత ప్రసంగాలు చేశారు. యాత్ర బిహార్‌లో ప్రవేశించినప్పుడు అప్పటి సీఎం లాలూప్రసాద్ యాదవ్ అడ్డుకుని సమస్తిపూర్‌లో అద్వానీని అరెస్ట్ చేయించారు. అదే బీజేపీకి కలిసొచ్చింది. 1991 ఎన్నికల్లో బీజేపీకి 100 సీట్లు దాటిపోయాయి. అద్వానీ లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయ్యారు. 1992 డిసెంబర్ 6న దేశవ్యాప్తంగా తరలివచ్చిన కరసేవకులు బాబ్రీ మసీదుని కూల్చివేశారు. బీజేపీ 1996లో అతిపెద్ద పార్టీగా అవతరించినా వాజ్‌పేయి నేతృత్వంలో 13 రోజులే సాగింది. 1998లో మిత్రపక్షాలతో కలిసి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటై అద్వానీ హోంమంత్రిగా.. తర్వాత ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టినా 13 నెలలే కొనసాగారు. 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోవడంతో అద్వానీ ప్రభ తగ్గింది. 2014లో మోదీ ప్రధాని అయ్యాక ఆయన ప్రాధాన్యం మరింత తగ్గింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి, మార్కదర్శక్ మండలి నుంచి తప్పించారు. చివరికి గాంధీ నగర్ సీటు కూడా దక్కలేదు. ప్రస్తుతం బీజేపీకి దూరంగా ఇంచుమించు విశ్రాంత జీవితాన్నే గడుపుతున్నారు. బాబ్రీ కూల్చివేతకు కుట్ర పన్నారంటూ ఆయనపై క్రిమినల్ అభియోగాలు నమోదైనా... వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావటంపై మాత్రం మినహాయింపునిచ్చారు. ఉమాభారతి ఫైర్ బ్రాండ్ ఉమాభారతి బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. మసీదు కూల్చేయండి, మందిరం నిర్మించండి అంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలున్నాయి. అనంతరం రేగిన ఘర్షణలు, అల్లరిమూకల్ని రెచ్చగొట్టడంలో ఆమె ప్రమేయం ఉందంటూ జస్టిస్ లిబర్హాన్ కమిషన్ ఉమాభారతిని బోనులోకి లాగింది. ఆ ఘటనలో తన నైతిక బాధ్యత ఉందని అంగీకరించిన ఉమా... మసీదును కూలగొట్టంలో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తున్నారు. తర్వాత ఆమె రాజకీయ జీవితం ఎన్నో కుదుపులకు లోనయింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2003–04లో పనిచేసిన ఆమెను తర్వాత పార్టీ నుంచి బహిష్కరించారు. మళ్లీ సొంత గూటికి చేరుకుని మోదీ తొలి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఈ ఏడాది ఎన్నికల్లో పోటీకి విముఖత చూపటంతో పార్టీ ఉపాధ్యక్షురాలిని చేశారు. పార్టీలో ఆమె పాత్ర ఇప్పుడు నామమాత్రమేనన్న అభిప్రాయం ఉంది. మసీదు కూల్చివేత కేసులో వ్యక్తిగత హాజరు నుంచి ఆమెను కోర్టు మినహాయించింది. మురళీ మనోహర్ జోషి వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నపుడు మురళీ మనోహర్ జోషి కేంద్ర మంత్రి. ఇప్పుడు మోదీ, అమిత్ షా మధ్య ఉన్నట్టుగా అప్పట్లో ఉప ప్రధానిగా ఉన్న అద్వానీ, కేంద్ర మంత్రిగా ఉన్న జోషి మధ్య సన్నిహిత సంబంధాలుండేవి. యువకుడిగా ఉన్నప్పుడే ఆరెస్సెస్‌లో చేరిన జోషి గోరక్షణ ఉద్యమంలో పాల్గొన్నారు. అద్వానీ రథయాత్రకు అండగా నిలిచారు. అద్వానీ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడయ్యాక 1991లో జోషి బీజేపీ పగ్గాలు చేపట్టారు. మసీదు ప్రాంతం రాముడి జన్మభూమి అని ఆయన గట్టిగా వాదించేవారు. కూల్చివేత సమయంలో పార్టీ అధ్యక్ష హోదాలో ఆయన అయోధ్యకు వెళ్లారు. మందిర నిర్మాణాన్ని ఆపడం ఎవరి తరం కాదంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న ఆరోపణలున్నాయి. క్రిమినల్ కేసుల్లోనూ ఉన్నారు. ఈ ఏడాది ఎన్నికల్లో వయోభారం ∙వల్ల పార్టీ ఆయనకు కాన్పూర్ టికెట్ ఇవ్వలేదు. పార్లమెంటరీ బోర్డు నుంచి, మార్గదర్శక మండలి నుంచి తొలగించింది. అప్పట్నుంచి ఆయన పార్టీకి దూరమైనా అడపాదడపా సమావేశాల్లో పాల్గొంటూ మోదీకి వ్యతిరేకంగా తన గళం వినిపిస్తూనే ఉన్నారు. కల్యాణ్ సింగ్ బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న కల్యాణ్ సింగ్ అదే రోజు సాయంత్రం నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేశారు. గతంలో రాజస్తాన్ గవర్నర్‌గా ఉన్నారు. కానీ ఆయనపై క్రిమినల్ కేసుల్ని తిరగతోడడంతో రాజ్యాంగపరమైన పదవులు చేపట్టకూడదన్న నిబంధనలు అమల య్యాయి. గవర్నర్ పదవిని వదులుకున్నారు. ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సుదీర్ఘ పోరాటానికి ఫలితం: అద్వానీ అయోధ్యలో రామమందిరం కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.రామ జన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అద్వానీ.. ఈ విషయంలో తాను నిర్దోషిగా నిలిచానని చెప్పారు. ‘దేశ స్వాతంత్య్ర పోరాటం తర్వాత సుదీర్ఘ కాలం సాగిన ఉద్యమం ఇదే. ఇందులో పాల్గొనే మహోన్నత అవకాశాన్ని దేవుడు నాకు కల్పించాడు. సుదీర్ఘ పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పుతో ఫలితం దక్కింది. ఏళ్లుగా సాగుతున్న వివాదం కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఈ విషయంలో ఇప్పటివరకు జరిగిన హింస, వివాదా లు అన్నింటినీ వదిలేయండి. శాంతి, సమైక్యతతో ముందుకు సాగండి’అని ప్రజలకు సూచించారు. కరసేవకుల మాట.. సుప్రీంకోర్టు తీర్పుతో ఎట్టకేలకు న్యాయం గెలిచింది. వందల ఏళ్ల నుంచి ప్రజలు పెట్టుకున్న నమ్మకం, విశ్వాసం నిజమైంది. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత ప్రజల విజయమే. కరసేవకు వెళ్లినపుడు నేను అక్కడి పరిస్థితులను స్వయంగా చూశా. రెండు రోజుల ముందే వెళ్లడంతో అయోధ్యలోని ముస్లింలతో మాట్లాడా. వారు సోదర భావంతో వ్యవహరించారు. కూల్చివేత సమయంలో నాతో పాటు వచ్చిన వారంతా సాధారణ భక్తులే. అప్పుడు కిలోమీటర్ దూరంలో అద్వానీ, ఉమాభారతి, అశోక్ సింఘాల్, ధర్మేంద ప్రధాన్ వంటి నేతలు ఉన్నారు. వారి ప్రసంగాలను కూడా విన్నాం. – డాక్టర్ సంగెం శ్రీనివాస్, వరంగల్ అయోధ్యలో ఉన్నది రామమందిరమే అన్న వాస్తవాన్ని సుప్రీంకోర్టు తేల్చింది. కరసేవ సమయంలో నేను అక్కడకు వెళ్లినప్పుడు చిన్న చిన్న విగ్రహాలు, దేవాలయానికి సంబంధించిన çస్తంభాలు బయటపడటం చూశాను. వాటిని ఇప్పుడు మీడియాలో చూపించారు. సాధువులు ఆ స్తంభాలను పక్కన పెట్టి డేరా వేశారు. 11 మెట్లు కట్టి విగ్రహాలను అందులో ప్రతిష్టించారు. ఆ రోజు కరసేవను ప్రజలు చేశారు. ఈ రోజు ప్రజల విశ్వాసం గెలిచింది. – రంగరాజు రుక్మారావు, సూర్యాపేట్ పీవీ మౌనం..ఎందుకని? నాటి ప్రధాని పాత్రపై భిన్న వాదనలు అయోధ్యలో బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చేసిన రోజు నాటి ప్రధాని పీవీ నరసింçహారావు జీవితంలో మాత్రం మాయని మచ్చగానే మిగిలింది. అద్వానీ రథయాత్ర తర్వాత 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చివేస్తుంటే పీవీ చేష్టలుడిగి ఎందుకున్నారు? అన్న ప్రశ్న ఆయన జీవితంపై చెరగని ముద్రను వేసింది. ఒక హిందువుగా పీవీకి సైతం బాబ్రీ మసీదు స్థానంలో రామాలయం నిర్మించాలని ఉందా? అన్న సంశయం ఇప్పటికీ చాలా మందిలో కొనసాగుతూనే ఉంది. హిందూత్వ వాదులైన బీజేపీని ఇరుకున పెట్టడానికే ఆయన మౌనం వహించారనే వాదనలూ ఉన్నాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించినా 1992 నవంబర్ 19–22 తేదీల్లో జరిగిన పొలిటికల్ అఫైర్స్ క్యాబినెట్ కమిటీ సమావేశాల్లో... బాబ్రీని కూల్చివేసే పరిస్థితులున్నట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో పీవీ దృష్టికి తెచ్చింది. కళ్యాణ్ సింగ్‌ని తొలగించాలని కూడా సూచించింది. అయినా పీవీ మిన్నకుండడంలో అంతరార్థం విమర్శలకు తావిచ్చింది. అంతేకాక మసీదు ధ్వంసం సమయంలో పీవీ నరసింహారావు పూజలో కూర్చున్నారని, కరసేవకులు పూర్తిగా కూల్చివేశాకే ఆయన పూజలో నుంచి లేచారని ఓ బుక్‌లో ఆరోపించారు. అయితే బాబ్రీ అంశంలో యూపీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్‌పై పూర్తి విశ్వాసం ఉంచాననీ, ఆయన తన నమ్మకాన్ని వమ్ముచేశారని పీవీ వ్యాఖ్యానించారు. నిజానికి బాబ్రీ కూల్చివేత సమయంలో కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో నిండి ఉంది. పీవీకీ సోనియాకు మధ్య అంతర్గత కలహాలు.. ఆ తరవాత పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులకు దారితీశాయి. పీవీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు..! విధ్వసం విషయంలో ఎస్బీ చవాన్ నేతృత్వంలోని హోం శాఖ ఏమీ చేయలేదన్న విమర్శలను నాటి హోం సెక్రటరీ మాధవ్ గాడ్బే ఆ తరవాత ఖండించారు. జరుగబోతోన్న విధ్వంసాన్ని ఆపటానికి ప్రణాళికను రూపొందించినప్పటికీ పీవీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెప్పారాయన. ఆ రోజు హోం శాఖకీ, ప్రధాని పీవీకీ మధ్య అయోధ్యలో చేపట్టాల్సిన రక్షణాంశాలపై వివాదం ఉన్నట్లు కూడా చెప్పారు. తాను స్వయంగా పీవీని అనేక సార్లు కలిశాననీ, ప్రతిసారీ ఆయన వేచి ఉండమనే చెప్పారనీ వెల్లడిం చారు. ఈ విషయాల్ని 1993 మార్చి 23న తన రిటైర్మెంట్ అనంతరం రాసిన ‘‘అన్ ఫినిష్డ్ ఇన్నింగ్స్’’ (1996లో పబ్లిష్ అయ్యింది)లో గాడ్బే రాసుకున్నారు. -
మీరు లేని ఎన్ని‘కళా’?
సాక్షి, సెంట్రల్ డెస్క్ : ఎక్కడో పుట్టారు. ఎక్కడో పెరిగారు.. రాజకీయాల చెట్టు నీడలో కలిశారు.. ఒకే పార్టీలో ఉంటూ కరచాలనం చేసుకున్నారు.. వేర్వేరు పార్టీల్లో కత్తులూ దూసుకున్నారు.. రాజకీయ రణక్షేత్రంలో ఎత్తుకు పై ఎత్తులతో ఓటర్లను ఫిదా చేసింది కొందరైతే, నిండు సభలో కవిత్వపు జల్లులతో పన్నీరులా పలకరించినవారు మరొకరు.. ఎన్నికల సభల్లో హాస్య చతురతతో ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు విసిరి టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులు ఫక్కున నవ్వేలా చేసిన నేతలు కొందరైతే.. మహిళలైనా మహారాణుల్లా వెలిగిపోయి సంక్షేమానికి మరో రూపంలా మారింది కొందరు. కాల చక్రంలో గిర్రున అయిదేళ్లు తిరిగిపోయాయ్. జీవిత కాలం చివరి మలుపులో వీడలేమంటూ వీడుకోలంటూ ఒకనాటి రాజకీయ యోధులు ఈసారి ఎన్నికల రణక్షేత్రానికి దూరమయ్యారు. మరణం కొందరినీ, వయోభారం, అనారోగ్యం మరికొందరిని ఈ సార్వత్రిక ఎన్నికలకు దూరం చేశాయి. తమ వ్యక్తిత్వాలతో ఓటర్ల మదిలో మరపురాని తిరిగిరాని గుర్తులను వేసిన రాజకీయ దిగ్గజాలు వాజ్‌పేయి, కరుణానిధి, జయలలిత, మనోహర్ పరికార్ వంటి నేతలు లేకుండా జరుగుతున్న ఎన్నికలివి. మై డియర్ సర్స్, మేడమ్స్, రాజకీయ ఉద్ధండుల్లారా.. రియల్లీ వి మిస్ యూ.. వాజ్‌పేయి: జోహారోయి రాజకీయానికి – భావ కవిత్వానికి అవినాభావ సంబంధం ఉందని ఎవరైనా అనుకోగలరా? మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి సభలోకి అడుగుపెట్టాక ఆ విషయం ప్రపంచానికి తెలిసింది. ఆయన మాటే ఒక మంత్రం.. ఆయన ఉపన్యాసం స్వరరాగ కవితా ప్రవాహం. 12 సార్లు పార్లమెంటేరియన్‌గా వాజ్‌పేయి ప్రదర్శించిన రాజనీతిజ్ఞత భావితరాలకు ఆదర్శం. బీజేపీలో వాజ్‌పేయి దళం ఉంది. అద్వానీ దళం ఉంది అని విపక్షాలు విమర్శిస్తే, వాజ్‌పేయి ‘నేను దళ్‌దళ్ (బురద)లో లేను. కానీ బురదలో కమలదళాన్ని వికసింపజేయగలను‘ అంటూ ఎదురుదాడికి దిగిన ఘనత ఆయనది. గత ఏడాది ఆగస్టు 16న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వాజ్‌పేయి వ్యక్తిత్వం చరిత్ర పుటల్లో ఒక పేజీగా మిగిలిపోయింది. రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీగా పేరు సంపాదించిన ఈ అజాతశత్రువు ఇక లేరని తలచుకుంటే అభిమానుల మనుసులు భారమైపోతాయి. వి మిస్ యూ అటల్జీ అంటూ మౌనంగా రోదిస్తాయి. పురుచ్చితలైవి: సంచలనాలేవీ? ఆమెను చూస్తే అమ్మ గుర్తుకు వస్తుంది. ప్రజల ఆకలి తెలుసుకొని కడుపు నింపే అమ్మ. నడిచొచ్చే సంక్షేమానికి నిలువెత్తు రూపం. కుట్రలు, కుతంత్రాలకు నిలయమైన ద్రవిడ నాట ఉక్కు మహిళ దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. ఆమె మరణం ఒక మిస్టరీ. ఆమె సృష్టించారు ఒక హిస్టరీ. రాజకీయాల్లో జయలలిత ప్రభావం, పార్టీపై ఆమె సాధించిన పట్టు ఎంత అంటే 2016లో అనుమానాస్పదంగా జయ మరణించిన తర్వాత ఏఐఏడీఎంకేకి సమర్థుడైన నాయకుడు లేక పార్టీ ‘ఆకులు’ ఆకులుగా విడిపోయి ఛిన్నాభిన్నమైంది. జయ లేకుండా తొలిసారిగా జరుగుతున్న ఎన్నికల్లో ఆ పార్టీ జయకేతనం ఎగురవేయగలదా అన్న సందేహాలతో ఆమె అనుచరగణం కంటతడి పెడుతున్నారు. కరుణానిధి: జ్ఞాపకాల నిధి ద్రవిడ భాషా ఉద్యమ సూరీడు కరుణానిధి. తమిళ రాజకీయాల్లో ఈయనదీ ఒక చరిత్ర. డీఎంకే పార్టీ అధినేతగానే కాదు, పదునైన మాటలతో ఒక సినీ కవిగా ఆయన వేసిన ముద్ర తిరుగులేనిది. స్నేహానికి ప్రాణమిచ్చే కరుణ మనస్తత్వానికి ఎవరైనా తలవంచి జోహార్ అనాల్సిందే. ప్రాణమిత్రుడు ఎంజీఆర్ తన పక్కనే ఆయనకి ఒక పడక సిద్ధం చేశారేమో మరి వయోభారంతోనే నింగికెగిశారు. నిండు జీవితాన్ని గడిపినప్పటికీ కరుణానిధి ఇక లేరన్న వార్త తమిళ తంబిల మనసుల్లో అగ్నిపర్వతాల్ని బద్దలు చేసింది. అందులోంచి లావా ఎప్పటికీ ఎగజిమ్ముతూనే ఉంటుంది. ఆయన జ్ఞాపకాల కన్నీరు ఉబికి వస్తూనే ఉంటుంది. పారికర్: ఎక్స్ట్రార్డినరీ.. రాజకీయాల్లో అతి సామాన్యుడిగా బతికిన అసామాన్యుడు ఎవరైనా ఉన్నారంటే ఠక్కుమని మనోహర్ పారికర్ పేరు చెప్పొచ్చు. గోవా ముఖ్యమంత్రిగా సైకిల్‌పై అసెంబ్లీకి వెళ్లగలరు. జనంతో మనోహరంగా కలిసిపోగలరు. రక్షణ మంత్రిగా సరిహద్దుల్ని సమర్థవంతంగా కాపలా కాయగలరు. అత్యంత కష్టపడే మనస్తత్వంతో పొలిటికల్ బరిలో విజేతగా నిలిచిన ఆయన కేన్సర్ వ్యాధిని జయించలేక ఈ ఏడాది మార్చిలో కన్నుమూశారు. మనోహర్ లేకపోవడం నిజంగా బీజేపీకి తీరని లోటే. అడ్వాణీ నుంచి పవార్ వరకు రేసులో లేనివారెందరో.. తన రథయాత్రలతో పెరిగి పెద్దదైన భారతీయ జనతా పార్టీ దేశాన్ని ఏలుతూ కూడా అడ్వాణీని సాధారణ ఓటరుగా మార్చేసింది. 75 ఏళ్ల వయసు దాటిందని సాకుగా చూపించి మురళీ మనోహర్ జోషి వంటి నేతని ఎన్నికలకి దూరం చేసింది. ఎన్నికల్లో మాటల తూటాలు పేల్చే సుష్మా స్వరాజ్ అనారోగ్యం వేధిస్తుంటే తనకు తానుగా ఈ రాజకీయ ప్రహసనం నుంచి తప్పుకున్నారు. దళిత పతాకం మాయావతి తన లక్ష్యమైన మోదీని ఓడించడానికి పోటీకి దూరంగా ఉంటూ ప్రచారానికే పరిమితమయ్యారు.రాజకీయాలను ఓ ఆటాడుకుని, క్రీడల్లోకి రాజకీయాల్ని దట్టించిన మరాఠా యోధుడు శరద్ పవార్ వయోభారం చేతో, వారసుడిని బరిలో నిలపడం వల్లో.. రేసు నుంచి తప్పుకున్నారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే కూడా ఈ స్వార్వత్రిక ఎన్నికల బరిలో లేనని ప్రకటించి అభిమానుల్ని విస్మయానికి గురి చేశారు. బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి గంగా ప్రక్షాళన చేయడం కోసం ఎన్నికలనే విడిచి పెట్టేశారు. భారతీయ జీవన వేదమైన గంగానదిని కాపాడుకోవడం కోసం ఆమె ఏడాదిన్నర పాటు యాత్ర చేయనున్నారు. లోక్‌జనశక్తి నేత రామ్‌విలాస్ పాశ్వాన్‌ని అనారోగ్యం వేధిస్తోంది. ఎన్నికల్లో పోటీచేసే శక్తి లేక ఆయన కూడా దూరంగా ఉన్నారు.ఇలా అరుదైన రాజకీయ నేతలు బరిలో లేని ఎన్నికలు ఎందరో అభిమానుల్ని నిరాశపరుస్తున్నాయి. ప్చ్.. అని నిట్టూర్చడం తప్ప ఎవరైనా ఏం చేయగలరు?. -
కళ్లనీళ్లు పెట్టుకున్న అద్వానీ
న్యూఢిల్లీ: లలిత్‌మోదీ వ్యవహారంపై లోక్‌సభలో కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ సమాధానం ఇచ్చిన తీరుకు బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ ముగ్ధుడైపోయారట. దాదాపు అరగంట సేపు అనర్గళంగా ఆమె చేసిన ప్రసంగానికి ఆయన ఒక దశలో కన్నీరు పెట్టుకున్నారు. ఆమెను శభాష్ అంటూ అభినందించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటినుంచి కాంగ్రెస్ సహా, ఇతర విపక్షాలు చేసిన దాడిని సుష్మా తిప్పికొట్టిన తీరు బీజేపీ అగ్రనేతను ఆకట్టుకుంది. ప్రతిపక్షాల నిరసనల మధ్య ఎక్కడా చలించకుండా తన వాగ్ధాటితో సభ్యులను కట్టడి చేసేందుకు సుష్మా శతవిధాలా ప్రయత్నించారు. సభలో ఆమె ప్రసంగం కొనసాగుతున్నపుడు అద్వానీ పక్కనే ఆశీనులయ్యారు. సీనియర్ పార్లమెంటు సభ్యుడుగా లోక్‌సభలో ఎన్నో వివాదాలకు, వేడివాడి చర్చలకు, చారిత్రక నిర్ణయాలకు సాక్ష్యంగా నిలిచిన ఆయన.. సుష్మ వాదించిన తీరుకు చలించిపోయారు. తన వాదన ద్వారా పార్టీని, తనను తాను సమర్ధించుకున్న మహిళా ఎంపీని అభినందించారు. కాగా బుధవారం లలిత్ గేట్ వివాదంతో లోక్‌సభలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మాటల యుద్ధం నడించింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభను హోరెత్తించారు. అరుపులు కేకలతో సభ దద్దరిలిపోయింది. -
మోడీ, అద్వానీ, సోనియా ప్రమాణం స్వీకారం
న్యూఢిల్లీ : 16వ లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది. ప్రోటెం స్పీకర్ కమల్‌నాథ్ గురువారంలోక్సభకు ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎల్.కె అద్వానీ, సోనియాగాంధీ లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అద్వానీ లోక్ సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సభ్యుల వద్దకు స్వయంగా వెళ్లి అభివాదం చేశారు. సుష్మా స్వరాజ్ సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు ప్రోటెం స్పీకర్ కమల్ నాథ్ మూడు లోక్‌సభ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ, సమాజ్‌వాదీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ రాజీనామాలను ఆమోదించినట్లు ఆయన తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు జూన్ 2 నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. సభ్యుల ప్రమాణ స్వీకారం శుక్రవారం కూడా కొనసాగనుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి 315 మంది కొత్తగా ఎన్నికయ్యారు. -
మోడీ రాజ్యంలో చిన్న పార్టీల జోరు
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పాలనలో ఉన్న గుజరాత్లో ఇదివరకు ఎన్నడూ లేని రీతిలో చిన్నాచితక పార్టీల జోరు కనిపిస్తోంది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో 21 చిల్లర పార్టీలు 48 మంది అభ్యర్థులను గుజరాత్‌లోని వివిధ నియోజకవర్గాల నుంచి బరిలోకి దించాయి. ఆప్నా దేశ్ పార్టీ, యువ సర్కార్, నేషనల్ యూత్ పార్టీ, ఆదివాసీ సేన పార్టీ, భారతీయ నేషనల్ జనతాదళ్, బహుజన ముక్తి పార్టీ, బహుజన సురక్షాదళ్, బహుజన ముక్తిదళ్, విశ్వహిందూ సంఘటన్, లోకతాంత్రిక్ సమాజ్‌వాదీ పార్టీ, హిందుస్తాన్ నిర్మాణ్ దళ్, హిందుస్తాన్ జనతా పార్టీ వంటి పార్టీల పేరు ఇదివరకు ఎవరికీ తెలియకపోయినా, ఈ ఎన్నికల్లో ఈ పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దించి, యథాశక్తి ప్రచారం సాగిస్తున్నాయి. ఈ పార్టీలన్నీ ఓటర్లను ఆకట్టుకునేందుకు చిత్రవిచిత్రమైన హామీలతో మేనిఫెస్టోలు విడుదల చేశాయి. తాము అధికారంలోకి వస్తే ఆదాయపు పన్ను, రోడ్డు సుంకం రద్దు చేసేస్తామని, వ్యాట్‌ను, విద్యుత్ చార్జీలను భారీగా తగ్గిస్తామని భారతీయ నేషనల్ జనతాదళ్ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. యువకులకే పదవులు నినాదంలోకి రంగంలోకి దిగిన నేషనల్ యూత్ పార్టీ గాంధీనగర్ నుంచి బీజేపీ కురువృద్ధుడు అద్వానీపై పీయూష్ పటేల్ అనే కాలేజీ విద్యార్థిని పోటీకి నిలిపింది. -
బీజేపీపై బుసలు కొడుతున్న 'కోబ్రా పోస్ట్'
-
బీజేపీలో ఊపందుకున్న నామినేషన్ల పర్వం
-
బీజేపీలో సీటు తెచ్చిన తంటా..!
-
లోక్‌సభ అభ్యర్థుల జాబితాపై బీజేపీ కసరత్తులు
-
చరిత్రలో కలిసిన 15వ లోక్‌సభ
-
లోక్‌సభకు పోటీచేస్తా: అద్వానీ
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేయబోతున్నారని వస్తున్న వార్తలకు బీజేపీ సీనియర్ నేత అద్వానీ ఫుల్స్టాప్ పెట్టారు. తాను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. అదే తన మదిలో ఉన్న ఆలోచన అని తేల్చి చెప్పారు. ‘‘నేను ఏమీ చెప్పలేదు (రాజ్యసభకు పోటీపై). నాకెవరైనా ఆ సూచన చేస్తే ఆలోచిస్తాను. అది సర్వసాధారణం కూడా. నాకు ఆ ఆలోచన ఉంటే ముందే ఆచరించి ఉండేవాడిని’’ అని ఇక్కడ ఆయన నివాసంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చెప్పారు. తాను లోక్‌సభకు పోటీ చేసే ఆలోచనలో మాత్రమే ఉన్నానని సమాధానమిచ్చారు. అయితే ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి పోటీ లేకుండా చేసేందుకు అద్వానీకి రాజ్యసభ సీటు ఇచ్చేందుకు బీజేపీ నాయకత్వం ఆలోచిస్తోందని వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్రపతి గణతంత్ర సందేశంపై అద్వానీ మాట్లాడుతూ.. స్థిరమైన ప్రభుత్వ అవసరాన్ని రాష్ట్రపతి నొక్కి చెప్పారన్నారు.