బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ నేత రబ్రీ దేవి బీజేపీని టార్గెట్ చేశారు. ‘ప్రధాని మోదీ ఇప్పుడు వచ్చారు. పాకిస్తాన్-పాకిస్తాన్ అంటున్నారు. అద్వానీ పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి. అతను భారత్‌కు వచ్చి స్థిరపడ్డారు. దేశంలో ఇండియా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతోంది’ అని రబ్రీ వ్యాఖ్యానించారు.
పాకిస్తాన్ జిహాదీలు ఇండియా కూటమి నేతలకు మద్దతిస్తున్నారని ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై రబ్రీ ఎదురుదాడి చేశారు. ‘మోదీ ప్రకటనల మాదిరిగా పరిస్థితులు ఉంటే భారత ప్రభుత్వ ఏజెన్సీలు ఏం చేస్తున్నాయి? అంటే ప్రధాని మోదీ విఫలమయ్యారా? దేశంలో మహా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది. బీహార్‌లో మహాకూటమి ప్రకంపనలు రేపుతోంది’ అని రబ్రీదేవి వ్యాఖ్యానించారు. కాగా ఎన్డీఏ ప్రభుత్వం మనల్ని లాంతరు యుగానికి తీసుకెళ్లింది. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 200 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా ఇస్తామని రబ్రీదేవి కుమార్తె, పాటలీపుత్ర అభ్యర్థి మిసా భారతి హామీనిచ్చారు.
గ్రామాలకు వెళితే కరెంటు బిల్లులు అధికంగా వస్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష నేతలందరినీ జైల్లో పెడుతున్నారని మిసా భారతి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత పదేళ్లుగా ప్రజలు మోసపోతున్నారు. ద్రవ్యోల్బణం తగ్గలేదు. నిరుద్యోగం పోలేదు అని ఆమె బీజేపీపై మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment