![DAHINI THE WITCH FILM WINS BEST FEATURE FILM IN AUSTRALIA - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/22/dahini.gif.webp?itok=LyNGL6X4)
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రాజేష్ టచ్ రివర్ తెరకెక్కించిన మరో విలక్షణ చిత్రం ‘దహిణి - మంత్రగత్తె’. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వేదికలపై ఈ సినిమా సత్తా చాటుతోంది. తాజాగా ఈ చిత్రం.. ఆస్ట్రేలియాలో జరిగిన టైటాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు దక్కించుకుంది. ఈ అవార్డుతో రాజేష్ టచ్ రివర్ కీర్తి కిరీటంలో మరో వజ్రం చేరింది. ఈ ఏడాది ప్రారంభంలో పసిఫిక్ బీచ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ వేడుకల్లో బెస్ట్ ఫీచల్ ఫిల్మ్‌గా నిలిచిన చిత్ర మరో అవార్డును సొంతం చేసుకుంది. స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకల్లో బెస్ట్ ఫీచర్ మూవీగా నామినేట్ అయ్యింది.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న జాతీయ అవార్డు గెలుగుచుకున్న యాక్టర్ తన్నిష్ట చటర్జీ ఇందులో ప్రధాన పాత్రలో నటించారు. జేడీ చక్రవర్తి ఇప్పటి వరకు ఎప్పుడూ చేయనటువంటి ఓ వైవిధ్యమైన పాత్రను పోషించటం విశేషం. ఇంకా అషికీ హుస్సేన్, బద్రూల్ ఇస్లామ్, అంగనా రాయ్, రిజ్జు బజాజ్, జగన్నాథ్ సేత్, శ్రుతీ జయన్, దిలీప్ దాస్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.
అసలు కథేంటంటే.. దహిణి - మంత్రగత్తె మూవీ సోషల్ థ్రిల్లర్. భారతదేశం 17 రాష్ట్రాల అన్వేషణలో ఉన్న మంత్రగత్తె కథే ఈ సినిమా. ఇదొక క్రూరమైన వాస్తవికత. అంతర్జాతీయంగా పలు ప్రశంసలను అందుకున్న దర్శకుడు రాజేష్ టచ్ రివర్ మంత్రగత్తె అన్వేషణ అనే విలక్షణమైన కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించారు. దీంతో ఇండియా సహా పలు దేశాలను పీడిస్తున్న మానవ హక్కులకు సంబంధించిన ఆందోళనను ప్రస్తావించారు. లింగ భేదమైన హింసకు సంబంధించిన రూపాల్లో మంత్రగత్తె అన్వేషణ అనేది ఒకటి. సాధారణ లింగ నిబంధనలకు అనుగుణంగా లేని వేలాది మంది మహిళలను చంపడానికి లేదా వ్యక్తుల మధ్య వివాదాలను పరిష్కరించడానికి ఇందులో కారణంగా చూపించారు.ఈ సినిమాతో అసలు ఎవరూ బహిరంగంగా మాట్లాడని విషయాలను స్క్రీన్‌పై చూపించే ప్రయత్నం చేశారు. ఈ చిత్రాన్ని పూర్తిగా ఒరిస్సాలో మంత్రగత్తెల అన్వేషణ ఎక్కువగా ఉండే మయూర్ భంజ్ జిల్లాలో చిత్రీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment