Dahini Movie
-
అంతర్జాతీయ వేదికలపై సత్తా.. 'దహిణి' చిత్రానికి అరుదైన పురస్కారం..
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రాజేష్ టచ్ రివర్ తెరకెక్కించిన మరో విలక్షణ చిత్రం ‘దహిణి - మంత్రగత్తె’. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వేదికలపై ఈ సినిమా సత్తా చాటుతోంది. తాజాగా ఈ చిత్రం.. ఆస్ట్రేలియాలో జరిగిన టైటాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు దక్కించుకుంది. ఈ అవార్డుతో రాజేష్ టచ్ రివర్ కీర్తి కిరీటంలో మరో వజ్రం చేరింది. ఈ ఏడాది ప్రారంభంలో పసిఫిక్ బీచ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ వేడుకల్లో బెస్ట్ ఫీచల్ ఫిల్మ్‌గా నిలిచిన చిత్ర మరో అవార్డును సొంతం చేసుకుంది. స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకల్లో బెస్ట్ ఫీచర్ మూవీగా నామినేట్ అయ్యింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న జాతీయ అవార్డు గెలుగుచుకున్న యాక్టర్ తన్నిష్ట చటర్జీ ఇందులో ప్రధాన పాత్రలో నటించారు. జేడీ చక్రవర్తి ఇప్పటి వరకు ఎప్పుడూ చేయనటువంటి ఓ వైవిధ్యమైన పాత్రను పోషించటం విశేషం. ఇంకా అషికీ హుస్సేన్, బద్రూల్ ఇస్లామ్, అంగనా రాయ్, రిజ్జు బజాజ్, జగన్నాథ్ సేత్, శ్రుతీ జయన్, దిలీప్ దాస్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. అసలు కథేంటంటే.. దహిణి - మంత్రగత్తె మూవీ సోషల్ థ్రిల్లర్. భారతదేశం 17 రాష్ట్రాల అన్వేషణలో ఉన్న మంత్రగత్తె కథే ఈ సినిమా. ఇదొక క్రూరమైన వాస్తవికత. అంతర్జాతీయంగా పలు ప్రశంసలను అందుకున్న దర్శకుడు రాజేష్ టచ్ రివర్ మంత్రగత్తె అన్వేషణ అనే విలక్షణమైన కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించారు. దీంతో ఇండియా సహా పలు దేశాలను పీడిస్తున్న మానవ హక్కులకు సంబంధించిన ఆందోళనను ప్రస్తావించారు. లింగ భేదమైన హింసకు సంబంధించిన రూపాల్లో మంత్రగత్తె అన్వేషణ అనేది ఒకటి. సాధారణ లింగ నిబంధనలకు అనుగుణంగా లేని వేలాది మంది మహిళలను చంపడానికి లేదా వ్యక్తుల మధ్య వివాదాలను పరిష్కరించడానికి ఇందులో కారణంగా చూపించారు.ఈ సినిమాతో అసలు ఎవరూ బహిరంగంగా మాట్లాడని విషయాలను స్క్రీన్‌పై చూపించే ప్రయత్నం చేశారు. ఈ చిత్రాన్ని పూర్తిగా ఒరిస్సాలో మంత్రగత్తెల అన్వేషణ ఎక్కువగా ఉండే మయూర్ భంజ్ జిల్లాలో చిత్రీకరించారు. -
స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో 'దహిణి'
తన్నిష్ఠ ఛటర్జీ, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో జాతీయ పురస్కార గ్రహీత, ప్రముఖ దర్శకుడు రాజేష్ టచ్‌రివర్ తెరకెక్కించిన సినిమా 'దహిణి'. ఓరియన్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, సన్‌టచ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పద్మశ్రీ అవార్డు గ్రహీత, మానవతావాది సునీత కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్రం స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపిక అయ్యింది. ఈ సినిమాకు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో గౌరవం దక్కడం ఇది రెండోసారి. ఇప్పటికే ఈ చిత్రానికి పసిఫిక్ బీచ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' అవార్డు లభించింది. వాస్తవ ఘటనలు ఆధారంగా రాజేష్ టచ్‌రివర్ సినిమాలు తీస్తుంటారు. దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించినప్పటి నుండి ఆయనది అదే పంథా. గతంలో ఎన్నో సమస్యలను సినిమాల ద్వారా ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు 'విచ్ హంటింగ్' పేరుతో పలు రాష్ట్రాలలో జరుగుతున్న దారుణాలను వెలుగులోకి తీసుకురావాలనే ప్రయత్నంతో... వివాదాస్పద అంశాలను స్పృశిస్తూ 'దహిణి' తెరకెక్కించారు. ఒరిస్సాలోని మయూర్ బంజ్ జిల్లా, పరిసర ప్రాంతాల్లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా, వాస్తవికతకు దగ్గరగా 'దహిణి' చిత్రాన్ని రూపొందించారు. ఆధునిక కాలంలో కూడా లింగ ఆధారిత హింసతో, ఇప్పటికీ అనాగరిక చర్యలను కొంత మంది పాటిస్తున్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అయినప్పటికీ ఎవ్వరూ ఈ దారుణాల గురించి మాట్లాడకపోవడం దురదృష్టం. ఈ వాస్తవాలను అందరికీ తెలియజేయడానికి మేం చేసిన ప్రయత్నం ఈ సినిమా అని మానవ హక్కుల కార్యకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత సునీత కృష్ణన్ అన్నారు. ‘నేటి భారతంలో వేలాది మంది మహిళలను మంత్రగత్తెల పేరుతో ఎలా వేటాడుతున్నారు? మా సినిమాలో ఈ అంశం గురించి చాలా ఓపెన్‌గా ఈ ఇష్యూ గురించి చర్చిస్తున్నాం. దీని తర్వాత ప్రేక్షకులు మాట్లాడతారని ఆశిస్తున్నాం’అని నిర్మాత ప్రదీప్ నారాయణన్ అన్నారు.