J D Chakravarthy Clarity About Marriage With Anchor Vishnu Priya - Sakshi
Sakshi News home page

J. D. Chakravarthy: పెళ్లి చేసుకుంటానన్న విష్ణుప్రియ.. జేడీ చక్రవర్తి ఆన్సర్ ఇదే!

Published Sun, Jun 18 2023 10:27 AM | Last Updated on Sun, Jun 18 2023 10:45 AM

J D Chakravarthy Clarity About Marriage With Anchor Vishnu Priya - Sakshi

హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి జేడీ చక్రవర్తి. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే  జేడీ ప్రస్తుతం ఓటీటీలో అలరిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అంతేకాకుండా ఇటీవల ఓషోలో యాంకర్ విష్ణుప్రియ జేడీ చక్రవర్తి అంటే తనకిష్టమని.. పెళ్లి చేసుకుంటానని చేసిన కామెంట్స్‌పై స్పందించారు. విష్ణుప్రియ అలా చెప్పడానికి గల కారణాన్ని వెల్లడించారు. ఇంతకీ పెళ్లి వార్తలపై జేడీ ఏమన్నారో చూద్దాం. 

(ఇది చదవండి: నా ఫస్ట్ క్రష్ అతనే.. యాంకర్ విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!)

జేడీ చక్రవర్తి మాట్లాడుతూ..'తమ మధ్య మంచి అనుబంధం ఉంది. కానీ అది ప్రేమ కాదు. విష్ణుప్రియ చాలా మంచి అమ్మాయి. మేమిద్దరం కలిసి ఇటీవలే ఓ సిరీస్‌లో నటించాం.  ఆ సిరీస్‌ కోసం దాదాపు 40 రోజులు కలిసి పని‌ చేశాం. ఆ సిరీస్‌ దర్శకుడు ప్రతిరోజూ నేను నటించిన ఒక సినిమా చూడమని విష్ణుప్రియకు సూచించాడు.' అని అన్నారు. 

ఆ తర్వాత జేడీ  ఆమె నేను నటించిన చిత్రాల్లోని పాత్రలతో మాత్రమే ప్రేమలో పడ్డారని తెలిపారు. అంతే తప్ప నాతో కాదు.. మాది గురు శిష్యుల అనుబంధంమని అన్నారు. కాగా.. ఇటీవల ఓషోలో పాల్గొన్న విష్ణుప్రియ జేడీ చక్రవర్తి ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానన్న  వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలైన సంగతి తెలిసిందే. ఇటీవలే 'గంగులు' అనే సాంగ్‌తో అభిమానులను పలకరించింది విష్ణుప్రియ. ఈ సాంగ్‌లో బిగ్ బాస్‌ ఫేమ్ మానస్‌తో కలిసి తన డ్యాన్స్‌తో అదరగొట్టింది.

(ఇది చదవండి: తల్లిని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న విష్ణుప్రియ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement