Anchor Vishnu Priya Open About Her First Crush - Sakshi
Sakshi News home page

Vishnupriya: అతనంటే నాకు పిచ్చి.. విష్ణుప్రియ విషయం చెప్పేసిందిగా!

Published Tue, May 2 2023 4:41 PM | Last Updated on Tue, May 2 2023 5:27 PM

Anchor Vishnu Priya Open About Her First Crush - Sakshi

బుల్లితెర నటి, యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు పొందిన భామ.. సుడిగాలి సుధీర్‌తో కలిసి ఓ షోకు యాంకర్‌గా బుల్లితెరపై రాణించింది.  విష్ణుప్రియ పోవే పోరా షోతో ఫుల్‌ క్రేజ్‌ తెచ్చుకుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన లేటెస్ట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది.

(ఇది చదవండి: ఫోక్ సాంగ్‌.. స్టెప్పులతో అదరగొట్టిన విష్ణుప్రియ)

ఇటీవలే 'గంగులు' అనే సాంగ్‌తో అభిమానులను పలకరించింది. ఈ సాంగ్‌లో బిగ్ బాస్‌ ఫేమ్ మానస్‌తో కలిసి తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. తాజాగా ఓ టీవీ షో పాల్గొన్న విష్ణుప్రియ యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. మీరు ఎవరైనా సెలబ్రిటీతో క్రష్‌లో ఉన్నారా? అని యాంకర్ ప్రశ్నించారు. 

విష్ణుప్రియ మాట్లాడుతూ.. 'ఇటీవలే జేడీ చక్రవర్తితో ప్రేమలో పడ్డా. ఓ వెబ్ సిరీస్ కోసం మంగళూరులో ఆయనతో జర్నీ చేశా. పది రోజులకే ఆయనపై మనసు పారేసుకున్నా. అయితే ఆయన వయసులో నాకంటే పెద్దవారు. ఆంటీ ఓకే చెబితే వాళ్లింటికి కోడలిగా వెళ్తా. జేడీ చక్రవర్తిని పిచ్చిగా ప్రేమిస్తున్నా' అంటూ తన మనసులో మాటను బయట పెట్టేసింది.  మీ ప్రేమ పెళ్లిగా మారే ఛాన్స్ ఉందా? అని మళ్లీ అడిగేసరికి.. 'నేనైతే నా మనసులో మాట చెప్పాను.  ఆయన రెస్పాండ్ అవలేదు' అంటూ చెప్పుకొచ్చింది. కాగా జేడీ చక్రవర్తి.. నటి  అనుకృతిని 2016లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

(ఇది చదవండి: 
  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement