
యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు పొందిన ఈ భామ ఆ తర్వాత యాంకరింగ్‌తో క్రేజ్ సంపాదించుకుంది. సుడిగాలి సుధీర్‌తో చేసిన 'పోవే పోరా' షోతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్‌తో అలరిస్తుంది.
రీసెంట్‌గా వాంటెడ్ పండుగాడ్ చిత్రంతో హీరోయిన్‌గానూ మారింది. ఇక నెట్టింట ఆమె చేసే రచ్చ అంతాఇంత కాదు. తరచూ హాట్‌హాట్ ఫొటోలు, డ్యాన్స్ వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సైతం ఫాలోవర్స్‌ను అలరిస్తూ ఉంటుంది. ఇలా ఎప్పుడూ చలాకీగా ఉండే విష్ణుప్రియ జీవితంలో ఇటీవలె తీరని విషాదం చోటుచేసుకుంది.
ఇటీవలె ఆమె తల్లి మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా మథర్స్‌డే సందర్భంగా నిర్వహించిన ఓ షోలో తన తల్లిని గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది విష్ణుప్రియ. 'మళ్లీ జన్మంటూ ఉంటే నీ కూతురిగానే పుడతానమ్మా. ఐలవ్ యూ' అంటూ ఎమోషనల్ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment