తల్లి వర్ధంతి.. యాంకర్‌ విష్ణుప్రియకు డైమండ్‌ గిఫ్ట్‌! | Anchor Vishnu Priya Bhimeneni Sister Buy Diamond Jewellery For Her Sister, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Vishnu Priya Diamond Jewellery Gift: ఓ రోజు నా చెల్లిని తరిమేశా.. తనేమో అమ్మ మొదటి వర్ధంతికి..

Published Wed, Jan 31 2024 1:43 PM | Last Updated on Wed, Jan 31 2024 3:22 PM

Anchor Vishnu Priya Bhimeneni Sister Buy Diamond for Her Sister - Sakshi

యూట్యూబ్‌ నుంచి వచ్చి బుల్లితెర సెలబ్రిటీగా మారింది యాంకర్‌ విష్ణుప్రియ. యాంకర్‌గా, నటిగా అలరించిన బ్యూటీ ఈ మధ్య షోలలో ఎక్కువగా కనిపించడం లేదు. ఆ మధ్య బిగ్‌బాస్‌ మానస్‌తో కలిసి జరీ జరీ పంచెకట్టి అనే ప్రైవేట్‌ సాంగ్‌లో ఆడిపాడింది. యూట్యూబ్‌లో మార్మోగిపోయిన ఈ పాట ఏకంగా 61 మిలియన్ల వ్యూస్‌ రాబట్టింది. సిల్వర్‌ స్క్రీన్‌పై హవా తగ్గించేసిన ఈ బ్యూటీ తరచూ తన ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్‌కు చెక్కేస్తోంది. 

చెల్లి గిఫ్ట్‌.. అక్క ఫుల్‌ ఖుషీ
ఆ ఫోటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అప్పుడప్పుడూ యూట్యూబ్‌లోనూ వీడియోలు రిలీజ్‌ చేస్తూ ఉంది. తాజాగా తనకు చెల్లి డైమండ్‌ నగలు బహుమతిగా ఇచ్చిందోచ్‌ అంటూ ఓ వీడియో రిలీజ్‌ చేసింది. అందులో విష్ణుప్రియ మాట్లాడుతూ.. 'ఒకరోజు నేను నా చెల్లి పావనిని ఇంటినుంచి తరిమేశాను. ఆమె ఈ రోజు ఏ స్థాయికి ఎదిగిందంటే తన సొంతకారులో ఏఎమ్‌బీకి తీసుకెళ్లి వజ్రాభరణాలు కొనిచ్చింది.

అమ్మ మొదటి వర్ధంతి..
తను కష్టజీవి. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది. చిన్నప్పటినుంచి తనకు నేను ఎటువంటి లగ్జరీలు ఇవ్వలేదు. తను మాత్రం నాకు ఈ రోజు డైమండ్‌ కొనిచ్చింది. ఇక్కడో విషయం చెప్పాలి. గతేడాది జనవరి 26న అమ్మ చనిపోయింది. అమ్మ వర్ధంతికి ఒకరోజు ముందు తన రూపంలో ఈ గిఫ్ట్స్‌ నాకు వచ్చాయనుకుంటాను' అని చెప్తూ సంతోషపడిపోయింది.

చదవండి: 12 ఏళ్ల కష్టం.. పొలం పని చేసుకుందాం, వెళ్లిపోదామన్నా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement