Anchor Vishnu Priya shares Alia Bhatt and Ranbir Kapoor video goes viral - Sakshi
Sakshi News home page

Vishnu Priya: ఓరి దేవుడా.. నేనెప్పుడు ముద్దు పెట్టుకోవాలి: విష్ణుప్రియ

Published Sat, Apr 15 2023 5:02 PM | Last Updated on Sat, Apr 15 2023 5:15 PM

Anchor Vishnu Priya Shares Alia Bhatt and Ranbir kapoor Video goes Viral - Sakshi

యాంకర్‌ విష్ణుప్రియ.. బుల్లితెర ప్రేక్షక్షులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. షార్ట్స్‌ ఫిలింస్‌తో కెరీర్‌ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత యాంకర్‌గా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. అంతే కాకుండా వాంటెడ్ పండుగాడ్ చిత్రంలో హీరోయిన్‌గా కూడా నటించింది. అయితే ఇటీవలే 'గంగులు' అంటూ సాంగ్‌తో అభిమానులను పలకరించింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తరచుగా తన ఫొటోలు, డ్యాన్స్‌ వీడియోలను షేర్‌ చేస్తూ అలరిస్తోంది. 

అయితే తాజాగా విష్ణు ప్రియ తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేసింది.ఏప్రిల్ 14న బాలీవుడ్ కపుల్స్ ఆలియా భట్, రణ్‌బీర్‌ కపూర్‌ మొదటి వివాహా వార్షికోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా కారులో వెళ్తున్న ఆలియా భట్, రణ్‌బీర్‌ కపూర్‌ జంట ఫ్యాన్స్‌ను పలకరించారు. అందరూ చూస్తుండగానే ఆలియా.. తన భర్తకు ముద్దుపెట్టింది. ఈ వీడియో చూసిన విష్ణుప్రియ క్రేజీ కామెంట్స్ చేసింది. 'ఓ దేవుడా! ఇలా ముద్దు పెట్టుకునే అవకాశం నాకెప్పుడొస్తుంది' పోస్ట్ చేసింది.  అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement