'ఇది నాకు చాలా ప్రత్యేకం'.. జేడీ చక్రవర్తి ఆసక్తికర కామెంట్స్! | JD Chakravarthy Comments On Crime Web Series Dayaa | Sakshi
Sakshi News home page

JD Chakravarthy: 'నాకు సవాళ్లు అంటే చాలా ఇష్టం'.. ఫ్యాన్స్‌తో జేడీ చక్రవర్తి!

Published Sat, Aug 5 2023 9:27 PM | Last Updated on Sat, Aug 5 2023 9:38 PM

JD Chakravarthy Comments On Crime Web Series Dayaa - Sakshi

సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య , విష్ణుప్రియ,  కమల్ కామరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ దయా. ఉత్కంఠ భరితమైన ఈ క్రైమ్ థ్రిల్లర్  ఆగస్ట్ 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌తో ఓటీటీ అరంగేట్రం చేసిన జేడీ చక్రవర్తి వైజాగ్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా డిస్నీ+ హాట్‌స్టార్ నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ అభిమానులతో సరదాగా ముచ్చటించారు.  

(ఇది చదవండి: 'ఆరు నెలల పాటు సినిమాలు వదిలేశా '.. నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్!)

జేడీ మాట్లాడుతూ.. 'డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కుటుంబంలో భాగమైనందుకు నేను చాలా ఆనందంగా ఉన్నా. ఈ క్రైమ్ థ్రిల్లర్ నాకు చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే నాకు సవాళ్లు అంటే చాలా ఇష్టం.  ప్రతి పాత్రతో నన్ను సవాలు చేసుకోవడం, తిరిగి ఆవిష్కరించుకోవడం చేస్తుంటాను. ఈ సిరీస్‌లో నాకు అది దక్కింది.'  అని అన్నారు. ఈ కార్యక్రమంలో, జేడీ చక్రవర్తి ప్రేక్షకులతో ఆప్యాయంగా పలకరించారు.  తన పాత్రపై అభిమానుల్లో ఉన్నా సందేహాలను సమాధానాలిచ్చారు. ఆ తర్వాత అభిమానులతో సెల్ఫీలు దిగారు.

(ఇది చదవండి: 'ఎవరితోనైనా కమిట్ అయితేనే అలా..' బుల్లితెర నటిపై దారుణ కామెంట్స్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement