అస్ట్రేలియాలో రామ్ చరణ్ దంపతులు సందడి చేస్తున్నారు. మెల్‌బోర్న్ వేదికగా 'ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్' 15వ ఎడిషన్‌కు గౌరవ అతిథిగా రామ్‌చరణ్ హజరయ్యారు. మెల్‌బోర్న్‌లోని ఫెడరేషన్ స్క్వేర్ కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయిన ఈ కార్యక్రమంలో ఉపాసనతో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు రామ్ చరణ్ చేసిన సేవలకుగాను ‘ఆర్ట్ అండ్ కల్చర్ బ్రాండ్ అంబాసిడర్’ గా ఆ వేదికపై అవార్డును అందుకున్నారు.
ఆగస్టు 15 నుంచి 25 వరకు జరిగే ఈ కార్యక్రమంలో ‘ఆర్ట్ అండ్ కల్చరల్ బ్రాండ్ అంబాసిడర్’గా ఎంపికైనవారు ఈ అంతర్జాతీయ వేదకపై గౌరవ అతిథిగా పాల్గొంటారు. ఈ క్రమంలో ఆ అదృష్టం రామ్‌చరణ్‌ని వరించింది. దీంతో ఆయన అభిమానులు కూడా సంతోషిస్తున్నారు. అవార్డ్ అందుకున్న అనంతరం రామ్‌చరణ్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
సుమారు 14 ఏళ్ల క్రితం విడుదలైన తన ఆరెంజ్ సినిమా విషయాలను అక్కడి అభిమానులతో చరణ్ మరోసారి పంచుకున్నారు. మెల్‌బోర్న్‌లో 30రోజుల పాటు తన ఆరెంజ్ షూటింగ్ జరిగిందని ఆయన తెలిపారు. అది తన మూడో సినిమా అని కూడా చరణ్ గుర్తుచూసుకున్నారు. అయితే, సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఇండియాకు తిరిగి వెళ్లాల్సిన సమయంలో చాలా బాధ అనిపించిందని అన్నారు.
ఇక్కడి ప్రజలు చూపించిన ప్రేమను తాను ఇప్పటికీ మర్చిపోలేకున్నానని చరణ్ చెప్పారు. మెల్‌బోర్న్‌లో ఇంతమంది భారతీయులను చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. భారతీయ చిత్రపరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అనేదే ఎన్‌ఆర్‌ఐల వల్లే అని ఆయన అన్నారు. అలా 14 ఏళ్ల క్రితం మెల్‌బోర్న్‌లో జరిగిన పలు ఆసక్తికరమైన విషయాలను చరణ్ పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment