ముంబై : కరోనా టెస్ట్ కిట్ల కొనుగోలు కోసం విరాళాలు సేకరించేందుకు కొందరు బాలీవుడ్ ప్రముఖులు సిద్దమయ్యారు. ఇందుకోసం వారు పొందిన అవార్డులను వేలం వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్, గేయ రచయిత వరుణ్ గ్రోవర్, కమెడియన్ కునాల్ కామ్రా ఉన్నారు. ఈ వేలం ద్వారా 10 టెస్టింగ్ కిట్లు కొనుగోలు చేసేందుకు రూ. 13,44,000 సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కిట్ల ద్వారా దాదాపు వెయ్యి మందికి కరోనా పరీక్షలు నిర్వహించవచ్చు.
ఈ మేరకు గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ చిత్రానికి గానూ తాను సొంతం చేసుకున్న ఫిల్మ్ ఫేర్ ట్రోపిని వేలం వేస్తున్నట్టు అనురాగ్ కశ్యప్ ప్రకటించారు. ఎక్కువ ధర కోట్ చేసినవారికి ఈ ట్రోపిని అందజేయనున్నట్టు తెలిపారు. మరోవైపు దమ్ లగా కే హైషా చిత్రంలోని తను రాసిన పాటకు అందుకున్న టీవోఐఎఫ్‌ఏ ట్రోఫిని వేలానికి ఉంచనున్నట్టు వరుణ్ గ్రోవర్ వెల్లడించారు. అలాగే కునాల్ కూడా తన యూట్యూబ్ బటన్ అవార్డును వేలం వేయనున్నట్టు తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ క్యాంపెయిన్ ద్వారా సేకరించిన మొత్తాన్ని నేరుగా మై ల్యాబ్ డిస్కవరీ సోల్యూషన్ బదిలీ చేయబతుందని మిలాప్ క్రౌండ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ పేర్కొంది. తద్వారా ఆస్పత్రులకు, ప్రయోగశాలలకు కరోనా టెస్టింగ్ కిట్లను అందజేయనున్నట్టు తెలిపింది.
While each ruppee counts I appreciate the hell out of Comrade @anuragkashyap72 who is giving away his 2013 gangs of Wasseypur critics award to the highest donor of this charity with my YouTube button
— Kunal Kamra (@kunalkamra88) May 20, 2020
Link - https://t.co/xm5mNd2qDZ
I urge other artists to help in their own way! https://t.co/izrv9CaxQT
Comments
Please login to add a commentAdd a comment