ముంబై: బాలీవుడ్ నటి తాప్సీ పన్ను నటించిన హిట్ సినిమా ‘థప్పడ్’కు అరుదైన గౌరవం దక్కింది. 2020లో జరిగే 14వ ప్రతిష్టాత్మక ఆసియా ఫిల్మ్ అవార్డ్‌కు గాను అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన థప్ఫడ్ రెండు ఆవార్డులకు ఎంపికైంది. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ ఎడిటింగ్ విభాగాలలో థప్పడ్ నామినేట్ బరిలో నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు అనుభవ్ సిన్హా సోమవారం ట్విట్టర్‌లో పంచుకుంటూ ఆనందం వ్యక్తి చేశారు. దీంతో అనుభావ్ సిన్హాకు బాలీవుడ్ నటీనటులు, దర్శకుల నుంచి అభినందనలు వెల్లువెత్తున్నాయి. నిర్మాత రీమా కాగ్టీ, దర్శకుడు అలకృత శ్రీవాస్తవ ట్వీట్ చేస్తూ అనుభవ్, తాప్పీలకు, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: భారత సినీ చరిత్రలో ‘థప్పడ్’ మైలురాయి)
అదే విధంగా ఈ ఆవార్డుకు థప్పుడ్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ‘కేయ్ ఇషికవా, సో లాంగ్, మై సన్ బై వాంగ్ జియాషువాయ్, ఎ సన్ బై చుంగ్ మోంగ్-హాంగ్, మొహమ్మద్ రసౌలోఫ్‌తో పాటు బాంగ్ జూన్ హోలు, ఆస్కార్ గెలిచుకున్న పరాన్నజీవి’ సినిమాలు కూడా ఉత్తమ చిత్రాలకు ఈ ఆవార్డుకు నామినేట్ అయ్యాయి. అదే విధంగా ఉత్తమ ఎడిటింగ్ గాను ‘‘జాంగ్ యేబో ఫర్ బెటర్ డేస్, యంగ్ జిన్ మో ఫర్ ప్యారడైస్, లీ చట్‌చేటీకూల్ ఫర్ సో లాంగ్, మై సన్’’లతో పాటు పలు సినిమాలు కూడా పోటి పడుతున్నాయి. అయితే భర్త విక్రమ్ (పావైల్ గులాటి)తో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్న అమృత (తాప్సీ) వైవాహిక బంధాన్ని ఒక్క చెంప దెబ్బ ఎలా ప్రభావితం చేసిందో దర్శకుడు ఈ సినిమా ద్వారా చూపించాడు. ఈ సినిమాలో తాప్సి అమృతగా ప్రేక్షకులను మెప్పించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. (చదవండి: వేరే సంబంధాలు ఉన్నాయా.. ఒక్క చెంపదెబ్బే కదా!)
Comments
Please login to add a commentAdd a comment