నట్టేట ముంచారు
జంగారెడ్డిగూడెం : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) అధికారులు తమను నట్టేముంచారని వర్జీనియా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం స్థానిక ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్ వద్ద వర్జీనియా పొగాకు రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్దెత్తున ధర్నా నిర్వహించారు. ఏటా రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలు వర్జీనియా రైతులకు బ్యాంకులు రుణాలుగా ఇచ్చేవని అయితే ఈ ఏడాది రూ.3 లక్షలు ఇచ్చి మిగిలిన రుణాన్ని తర్వాత ఇస్తామని చెప్పి పంట చేతికి వచ్చే సమయంలో మోసం చేశారని ఆరోపించారు.
రెండు నెలలుగా తిరుగుతున్నా..
గతేడాది బ్యార¯ŒSకు 25 క్వింటాళ్లు పంట అనుమతి ఇవ్వగా బ్యాంకులు ఐదు నుం చి ఆరు లక్షల రూపాయలు రుణాలు ఇచ్చాయని, ఈ ఏడాది బ్యార¯ŒSకు 30 క్వింటాళ్లు అనుమతి ఉన్నా మూడు లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రెండు నెలలుగా బ్యాంకు ఉన్నతాధికారులతో చర్చించినా ఫలితం లేదన్నారు. అదనపు రుణం వస్తుందని ఎదురుచూస్తున్న రైతులకు బ్యాంకు అధికారుల నిర్ణయం శరాఘాతంగా తగిలిందన్నారు. 30 ఏళ్లుగా లేని నిబంధనలు పెట్టి రైతులను నట్టేట ముంచారని ఆందోళన చెందుతున్నారు.
బకాయిలకు జమ
రైతులకు మంజూరు చేసిన రూ.3 లక్షలూ గత బకాయిలకు బ్యాంకులు జ మచేసుకున్నాయని, దీంతో రైతు చేతికి కనీసం రూ.25 వేలు కూడా అందలేదని అన్నారు. పంట చేతికి వచ్చే సమయం లో ఎక్కువ ఖర్చులు ఉంటాయని కూ లీలకు పండుగ అడ్వాన్సులు ఇవ్వాల్సి ఉంటుందని, ఇటువంటి సమయంలో బ్యాంకర్లు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ధర్నా అనంతరం ఎస్‌బీహెచ్ చీఫ్ మేనేజర్ ఎంవీ సీతారామన్, ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ శ్రీరాములుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని అక్కడ ఏవో పి.సత్యనారాయణకు తమకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. పొగాకు బోర్డు సభ్యులు గడ్డమణుగు సత్యనారాయణ, గంటశాల గాంధీ, జి.రవికుమార్, చెరుకూరి సందరరావు, వేగేశ్న రాధాకృష్ణరాజు, తెల్లం వెంకటేశ్వరరావు, గద్దే వీరకృష్ణ తది తరులు పాల్గొన్నారు.
మభ్యపెట్టి మోసం చేశారు
ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్ బ్యాంకులు వర్జీనియా రైతులను నట్టేట ముంచాయి. రుణాలు పెంచి ఇస్తామని మభ్యపెడుతూ ఇప్పుడు అకస్మాత్తుగా రుణం పెంచేది లేదని చేతులెత్తేశాయి. వర్జీనియా తోటలు మధ్యరకంగా ఉండటంతో రైతులకు ఇబ్బందులు తప్పవు. మధ్యస్థంగా ఉన్న, చేతికి వచ్చే పంట దశలో ఉన్న రైతులు నష్టపోతారు. –గడ్డమణుగు సత్యనారాయణ, పొగాకుబోర్డు సభ్యుడు
ఆత్మహత్యలే శరణ్యం
వర్జీనియా రైతులకు ఆత్మహత్యలే శరణ్యం. ఇప్పటివరకు రుణాలు పెంచి ఇస్తామని నమ్మించి మోసం చేశారు. ఇప్పుడు ఇవ్వలేమని ప్రకటించారు. దీంతో వర్జీనియా రైతులంతా తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఇప్పటికే లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాం. అదంతా కోల్పోవాల్సి వస్తోంది.
–గంటశాల గాంధీ, వర్జీనియా పొగాకు రైతు