సాక్షి, ఏపీ సచివాలయం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వమే పొగాకు కొనుగోళ్లు చేపట్టనుంది. ఇందకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. బుధవారం నుంచి రాష్ట్రంలో పొగాకు కొనుగోళ్లు చేపడుతున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రైతుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వమే పొగాకు కొనుగోళ్లు చేపడుతుందని చెప్పారు. ('వైద్య, ఆరోగ్య చరిత్రలో రేపు నూతనధ్యాయం')
ఒంగోలులోని 1, 2 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు ప్రారంభిస్తామని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. క్రమంగా అన్ని ప్రాంతాల్లో పొగాకు కొనుగోళ్లు చేపడతామని చెప్పారు. ఎఫ్3, ఎఫ్4, ఎఫ్5, ఎఫ్8, ఎఫ్9, లో గ్రేడు పొగాకు కొనుగోళ్లను ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. పొగాకు బోర్డు చెప్పిన దానికంటే అధిక మొత్తానికి కొనుగోళ్లు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment