పొగాకుతో కేన్సర్ ముప్పు
పొగాకుతో కేన్సర్ ముప్పు
Published Fri, Aug 26 2016 11:56 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM
నెల్లూరు(అర్బన్): పొగాకు ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా నోటి, గొంతు, ఊపిరితిత్తులు, జీర్ణాశయం, తదితర రకాల కేన్సర్లు సోకుతాయని వైద్యశాఖ శిక్షణా మండలి అధికారి పెద్దిశెట్టి రమాదేవి తెలిపారు. జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా గాంధీ నగర్ మహిళా ప్రాంగణం నుంచి వేదాయపాళెం సెంటర్ వరకు ఆశ కార్యకర్తలు, వైద్యసిబ్బందితో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం వేదాయపాళెం సెంటర్‌లో మానవహారం నిర్మించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమాదేవి మాట్లాడారు. పొగాకు ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా ఊబకాయం, గుండె, ఊపిరితిత్తుల జబ్బులు, పక్షవాతం, తదితర సమస్యలు వస్తాయన్నారు. పొగాకు తీసుకోవడం ద్వారా ప్రతి సెకనుకు ఇద్దరు చొప్పున, ఏటా 10లక్షల మందికిపైగా మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఈఓ లక్ష్మీనారాయణ, హెల్త్ ఎడ్యుకేటర్ సుధాకర్, డీసీఎం సునీత, సిబ్బంది శ్రీనివాసులు, జ్యోతి, ఉష, శిరీష, సక్కుబాయి, ఇందిరమ్మ తదితరులు పాల్గొన్నారు.
Advertisement