
ఐటీసీ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం
నడింపాలెం(ప్రత్తిపాడు) ఐటీసీ పొగాకు నిల్వలు ఉన్న గోడౌన్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నడింపాలెంలో 16వ నంబరు జాతీయ రహదారికి సమీపంలో ఐటీసీ పొగాకు బేళ్ల గోడౌన్ ఉంది.
నడింపాలెం(ప్రత్తిపాడు)
ఐటీసీ పొగాకు నిల్వలు ఉన్న గోడౌన్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నడింపాలెంలో 16వ నంబరు జాతీయ రహదారికి సమీపంలో ఐటీసీ పొగాకు బేళ్ల గోడౌన్ ఉంది. ఉదయం ప్రమాదవశాత్తూ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని భారీఎత్తున పొగాకు బేళ్లు దగ్ధమయ్యాయి. భారీఎత్తున చెలరేగిన అగ్నికీలలను అదుపు చేసేందుకు ఏడీఎఫ్‌వో కె.రత్నబాబు ఆధ్వర్యంలో నాలుగు అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగాయి. ఉదయం నుంచి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి. రాత్రి వరకు మంటలను అదుపుచేసే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ప్రమాదం ఎలా జరిగింది? ఎంత మేర నష్టం వాటిల్లింది? అన్న విషయాలు తెలియరాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ సీహెచ్ ప్రతాప్‌కుమార్ సిబ్బందితో కలిసి పరిస్థితిని పరిశీలించారు.