కేన్సర్‌ రిస్క్‌ : ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలా మేలు! | Avoidable risk factors may lower your risk of developing certain cancers | Sakshi
Sakshi News home page

కేన్సర్‌ రిస్క్‌ : ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలా మేలు!

Published Tue, Feb 27 2024 5:36 PM | Last Updated on Tue, Feb 27 2024 5:43 PM

Avoidable risk factors may lower your risk of developing certain cancers - Sakshi

ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటి కేన్సర్‌.ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న మరణాలకు రెండో  ప్రధాన కారణం కేన్సర్‌. కేన్సర్‌ చాలా రకాలు ఉన్నాయి. వంశపారంపర్యం, కాలుష్యం, జీవనశైలి ఇలా కేన్సర్‌కు చాలా కారణాలున్నాయి. కానీ దీన్ని తొలి దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుంది. ఈ వ్యాధి మొదటి దశలో గుర్తించడం తోపాటు,  కొన్ని దురలవాట్లకు దూరంగా ఉండాలని  వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు.

కేన్సర్‌ శరీరంలోని ఏ భాగంలోనైనా క్యాన్సర్ రావచ్చు.  మగవారిలో ఎక్కువగా ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, కొలొరెక్టల్, కడుపు, లివర్‌ కేన్సర్లు వ్యాప్తిస్తుండగా,  మహిళలు  బ్రెస్ట్‌, కొలొరెక్టల్, ఊపిరితిత్తులు, గర్భాశయ, థైరాయిడ్  కేన్సర్‌ బారిన పడుతున్నారు. వయస్సు , మద్యం, పొగాకు, ఎక్కువ కాలం ఇన్‌ఫెక్షన్లు,  రసాయన సహిత ఆహారం, హార్మోన్లు, ఇమ్యునోసప్రెషన్, రేడియేషన్‌, సన్‌ రేస్‌, ఊబకాయం  లాంటివి రిస్క్‌ ఫ్యాక్టర్లుగా ఉన్నాయి.  (ఎన్‌ఆర్‌ఐ మహిళకు బ్యాంకు మేనేజర్‌ టోకరా)

 ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు
♦ పొగాకు, పొగాకు ఉత్పత్తులకు  పూర్తిగా ఉండటం ఆరోగ్య కరమైన ఆహారం 
♦ బిడ్డకు పాలివ్వడం ద్వారా కొన్ని కేన్సర్లకు దూరంగా ఉండొచ్చు.
♦ పిల్లలకు హెపటైటిస్‌ బీ, హెచ్‌పీవీ వ్యాక్సిన్లు అందించడం
♦ ఎక్కువగా సూర్యకాంతికి గురి కాకుండా ఉండటం.  హానికరమై సూర్యకిరణాల బారిన పడకుండా రక్షణ పద్ధతులు పాటించాలి. 
♦ ఇంటా, బయటా గాలి కాలుష్యానికి దూరంగా ఉండటం
♦ మద్యపానానికి దూరంగా ఉండటం. ఒక వేళ అలవాటు ఉన్నా  దాన్ని పరిమితం చేసుకోవడం
♦ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం
♦ అనుమానం వచ్చినా, ఫ్యామిలీలో ఎవరికైనా కేన్సర్‌ సోకి వున్నా,  వయసురీత్యా, సమయానుకూలంగా మిగిలినవారు కూడా  కేన్సర్‌  నిర్ధారిత పరీక్షలు చేయించుకోవడం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement