ఏంటి బాబాయ్‌..! ఏకంగా విమానంలోనే ఇలా చేస్తావా..? | Older Man Eating Tobacco In Flight, Video Viral - Sakshi
Sakshi News home page

ఏంటి బాబాయ్‌..! ఏకంగా విమానంలోనే ఇలా చేస్తావా..?

Published Sun, Aug 27 2023 7:48 PM | Last Updated on Mon, Aug 28 2023 10:55 AM

Older Man Eating Tobacco In Flight Video Viral - Sakshi

ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నా కొందరు తంబాకు అలవాటును మానుకోరు. దాన్ని నోట్లో పెట్టుకుంటే గానీ కొందరికి బుర్ర పనిచేయదు. ఇంట్లో, ఆఫీసుల్లో, ప్రయాణాల్లో ఇలా.. ఎక్కడ ఉన్నా సరే వదిలే ప్రసక్తే లేదు అన్నట్లు వ్యవహరిస్తుంటారు. ఇక గోడ కనిపిస్తే చాలు ఉమ్మివేస్తుంటారు. ఇలాంటి ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కానీ అది ఏ ట్రైనో, బస్సో కాదండీ.. ఏకంగా విమానంలోనే..

వీడియోలో చూసిన విధంగా ఓ వృద్ధుడు విమానంలో ప్రయాణిస్తున్నాడు. నాలుక లాగేసిందో.. ఏమో..! గానీ విమానంలో ప్రయాణిస్తుండగానే తంబాకును జేబులో నుంచి తీశాడు. దాన్ని చేతిలో వేసుకునే నలిపి.. అమాంతం పెదవి కింది భాగంలో పెట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్కరోజులోనే రెండు లక్షల వ్యూస్ వచ్చాయి.

వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. 'విమానంలోనే తంబాకు వేశావ్‌.. సరేగానీ ఎక్కడ ఉమ్మివేస్తావ్ బాబాయ్‌..!' అంటూ ఫన్నీగా కామెంట్ పెట్టారు. వీరు మారరురా బాబు.. అంటూ మరో నెటిజన్ స్పందించాడు. నాలుక లాగేస్తుందా..? తాత అంటూ మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు.''నాకూ కొంచం పెట్టవా..' అంటూ మరో నెటిజన్ స్పందించాడు.   

ఇదీ చదవండి: గంజాయి తాగితే వింతగా ఎందుకు ప్రవర్తిస్తారంటే..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement