న్యూఢిల్లీ: ప్రస్తుతం అమల్లో ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో ప్రభుత్వం మార్పులు తీసుకురాబోతుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సోమవారం మార్కెట్లలో పొగాకు షేర్లు భారీగా పడిపోవడమే ఇందుకు ముఖ్యకారణమని తెలుస్తోంది.
ఎఫ్డీఐ(ఒక దేశానికి చెందిన కంపెనీలు వేరొక దేశంలో పెట్టుబడులు పెట్టడం). దేశంలోని పొగాకు సెక్టారుకు సంబంధించి ఫ్రాంచైజీ, ట్రేడ్ మార్క్, బ్రాండ్ నేమ్, మేనేజ్మెంట్ కాంట్రాక్ట్లలో ఎఫ్డీఐలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయంతో ఏ విదేశీ కంపెనీ పొగాకు రంగంలో ఎటువంటి పెట్టుబడులు చేయడానికి వీలు కాదని నిపుణులు చెబుతున్నారు.
దేశంలో దాదాపు 11బిలియన్ల మార్కెట్ కలిగిన పొగాకు పరిశ్రమ ఇప్పటికే సిగరెట్ ప్యాకెట్ల మీద 85 శాతం మేర ఆరోగ్యానికి సంబంధించిన హెచ్చరికలు ముద్రించాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతోంది.
గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా షేర్లు 17 శాతం, ఐటీసీ షేర్లు ఒక శాతం,హైదరాబాద్కు చెందిన వీఎస్టీ ఇండస్ట్రీస్ షేర్లు 2.5 శాతం మేర పడిపోయాయి.
పొగాకు రంగంలో ఎఫ్డీఐలు ఇక ఉండవా ?
Published Tue, Apr 26 2016 8:15 PM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM
Advertisement
Advertisement