గుంటూరు జిల్లా పొగాకు ఉత్పత్తిదారులు, క్యూరర్ల సహకార మార్కెటింగ్ సొసైటీ (కోల్ సొసైటీ) నూతన పాలకవర్గ ఎన్నికలకు శనివారం నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్:
గుంటూరు జిల్లా పొగాకు ఉత్పత్తిదారులు, క్యూరర్ల సహకార మార్కెటింగ్ సొసైటీ (కోల్ సొసైటీ) నూతన పాలకవర్గ ఎన్నికలకు శనివారం నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. సొసైటీలో మొత్తం 13 డెరైక్టర్ స్థానాలకు 14 మంది సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. పోటీ నుంచి ఒకరు తప్పుకుంటే పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికవుతుంది. స్థానిక కోల్ సొసైటీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల అధికారి కె.వెంకటేశ్వర్లు నామినేషన్లు స్వీకరించారు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీల సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు.
కోల్ సొసైటీలో ఏ, బీ రెండు నియోజకవర్గాల నుంచి 13 మంది డెరైక్టర్లను ఎన్నుకుంటారు. ‘ఏ’ నియోజకవర్గంలో ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి వ్యక్తిగత ఓటర్లు 1828 మంది 18 సంఘాలకు సభ్యత్వం ఉంది. ఈ విభాగంలో వ్యక్తిగత సభ్యుల నుంచి ఆరుగురు డెరైక్టర్లు ఎన్నిక కావాల్సి ఉంది. ఏడుగురు సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. సొసైటీ అధ్యక్షులు ఇద్దరు డెరైక్టర్‌ను ఎన్నుకోవాల్సి ఉండగా ఇద్దరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. ‘ఏ’ నియోజకవర్గంలో మొత్తం 9 నామినేషన్లకుగాను 8 ప్రకాశం జిల్లా నుంచి దాఖలు కాగా నెల్లూరు జిల్లా నుంచి ఒక నామినేషన్లు దాఖలైంది. బీ నియోజకవర్గంలో వ్యక్తిగత సభ్యుల నుంచి నలుగురిని, సొసైటీల నుంచి ఒకరిని డెరైక్టర్‌గా ఎన్నుకుంటారు. ఈ నియోజకవర్గంలో గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వ్యక్తిగత సభ్యులు 130 మంది ఉండగా నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. సొసైటీల నుంచి ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. బీ నియోజకవర్గంలో మొత్తం 5 నామినేషన్లు గుంటూరు జిల్లానుంచి దాఖలయ్యాయి.
నామినేషన్ల పరిశీలన ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. పరిశీలన పూర్తయిన తర్వాత సక్రమంగా ఉన్న వాటి వివరాాలు ప్రకటిస్తారు. సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. అనంతరం పోటీలో మిగిలిన అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారి ప్రకటిస్తారు.
‘ఏ’ నియోజకవర్గంలో దాఖలైన నామినేషన్లు:
వ్యక్తిగత సభ్యుల నుంచి ఆరు డెరైక్టర్ పదవులకు ఏడుగురు నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో కోల్‌సొసైటీ అధ్యక్షులుగా ఉన్న తాటిపర్తి సుబ్బారెడ్డి (ఒంగోలు), మద్దినేని శ్రీనివాసరావు (సంతనూతలపాడు మండలం వేములపాడు), మల్లు రవీంద్రారెడ్డి (నెల్లూరు జిల్లా రంపసముద్రం), మద్దులూరి లక్ష్మయ్య (టంగుటూరు మండలం కందులూరు), ఇనగంటి వెంకటరెడ్డి (నాగులుప్పలపాడు మండలం మాచవరం), మోతాటి శ్రీనివాసులురెడ్డి (రాచర్ల మండలం అచ్చంపల్లి), భూపతి శ్రీనివాసరావు (నాగులుప్పలపాడు మండలం మాచవరం) నామినేషన్లు దాఖలు చేశారు. ఈ విభాగంలో ఈ విభాగంలో డెరైక్టర్ పదవులకు నలమాలపు రామిరెడ్డి (మద్దిపాడు మండలం గురవారెడ్డిపాలెం సొసైటీ అధ్యక్షుడు), బత్తుల శివన్నారాయణరెడ్డి (చీమకుర్తి మండలం గాడిపర్తివారిపాలెం సొసైటీ అధ్యక్షుడు) నామినేషన్లు దాఖలు చేశారు.
‘బి’ నియోజకవర్గంలో వ్యక్తిగత సభ్యుల విభాగంలో నలుగురు డెరైక్టర్లను ఎన్నుకోవాల్సి ఉండగా నలుగురే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఈ నలుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. వ్యక్తిగత సభ్యులు తాళ్ల శివారెడ్డి (గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపాలెం), బచ్చు అప్పిరెడ్డి (గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపాలెం), ఉయ్యూరు వెంకటప్పారెడ్డి (గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపాలెం), చావలి డోల వెంకటరమాదేవి (గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపాలెం) నామినేషన్లు దాఖలు చేశారు. కోల్‌సొసైటీలో సభ్యత్వం ఉన్న సంఘాల అధ్యక్షులకు ఒక్క డెరైక్టర్ పదవి రిజర్వు కాగా మోదుగుల కృష్ణారెడ్డి (చుండూరు మండలం పెదగాదెలకర్రు సొసైటి అధ్యక్షులు) నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల అధికారి కె.వెంకటేశ్వర్లుకు సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు పీ రామారావు, జీఆర్ రాజశేఖర్‌లు సహకరించారు.