పాన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు
హైదరాబాద్: పొగాకు ఉత్పత్తులపై 85% గ్రాఫిక్ ఆరోగ్య హెచ్చరికలు ఉండాలన్న నిబంధనను ఉపసంహరించాలని పాన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో పాన్‌షాప్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగరాజ్ శంకర్‌రావు, నేతలు సతీష్‌నాయక్, మహ్మద్ ఆఫ్జలుద్దీన్‌లు మాట్లాడుతూ ప్రపంచంలోనే పొగాకు అత్యధికంగా వినియోగించే యూఎస్‌ఏ, జపాన్, చైనా వంటి దేశాల్లో సున్నా ఛాయాచిత్ర హెచ్చరికలుంటే ఇండియాలో 85% ఉండాలన్న నిబంధన విధించడం ఎంతవరకు సబబమని ప్రశ్నించారు.
వేలాది కుటుంబాలు పాన్‌షాప్‌ల ద్వారా జీవనం కొనసాగిస్తున్నాయని, అంతేగాక, తంబాకు అమ్మే వ్యాపారులు, రిటైలర్లు జీవనోపాధి పొందుతున్నారని, ఇలాంటి హెచ్చరికల ద్వారా వారి కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందన్నారు.
పొగాకు ఉత్పత్తులపై ‘85% హెచ్చరిక’ వద్దు
Published Fri, Apr 22 2016 2:33 AM | Last Updated on Sun, Sep 3 2017 10:26 PM
Advertisement
Advertisement