Pan shop
-
‘మూల్‌చంద్’ పాన్ షాప్.. పాన్ ప్రియులకు ఫుల్ క్రేజ్
జైపూర్: రాజస్థాన్‌లోని బికనీర్ పట్టణం సట్టాబజార్‌లో ఉన్న ముల్సా-పుల్సా పాన్ షాపుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈపాన్షాపు ఓనర్ పూల్‌చంద్ కట్టే రుచికరమైన పాన్ల కోసమే కాకుండా ఆయన ధరించే బంగారు ఆభరణాలు చూడడానికి కూడా ఎక్కువ మంది కస్టమర్లు వస్తుంటారు.పూల్‌చంద్ కట్టే వివిధ రకాల పాన్లు రుచిచూసేందుకు బికనీర్ వాసులే కాకుండా దూర ప్రాంతాల నుంచి పాన్‌ప్రియులు విచ్చేస్తారు. పూల్‌చంద్ స్వయంగా పాన్లు కట్టడమే కాకుండా కస్టమర్లను నవ్వుతూ పలకరిస్తుండటం షాపుకు ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. ఇటీవలి కాలంలో పాన్లు కట్టడంలో పూల్‌చంద్‌కు ఆయన కుమారుడు కూడా సాయం చేస్తున్నాడు. షాపు ఉదయాన్నే 5 గంటలకు మొదలై అర్ధరాత్రి 2 గంటల వరకు కస్టమర్లతో కిటకిటలాడుతూనే ఉంటుంది. ముల్సాపుల్సా పాన్‌షాపులో పాన్లు రూ.20 నుంచి మొదలుపెట్టి రూ.200 వరకు దొరుకుతాయి. VIDEO | Bikaner is home to a unique 'Paan' seller. His shop in the Satta Bazar area of the city has been attracting customers not just for the Paan but also for the gold ornaments he adorns with grace. Phoolchand owns the Mulsa-Phulsa paan shop, which sells various flavours of… pic.twitter.com/Ou3U6zsvDZ— Press Trust of India (@PTI_News) June 2, 2024 -
పాన్ షాప్ దగ్గర రాజకీయ ముచ్చట్లు.. విసుగెత్తిన ఓనర్ ఏం చేశాడంటే..
రాయ్‌పూర్: ఎన్నికలు వచ్చాయంటే చాలు ఊళ్లలోని టీ కొట్లు, పాన్ షాప్‌ల దగ్గర జనం రాజకీయ ముచ్చట్లు పెడుతుంటారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.. ఎందుకు గెలుస్తారు.. ఏ పార్టీ అధికారంలోని వస్తుంది.. ఇలా చర్చోపచర్చలు చేస్తుంటారు. ఇవి ఒక్కోసారి శ్రుతి మించి ఘర్షణలు, గొడవలకు దారి తీస్తుంటాయి. ఛత్తీస్‌గడ్‌లోని ఓ పాన్ షాప్ వద్ద కూడా జనం ఇలాగే చేస్తుండటంతో విసుగెత్తిపోయిన ఆ షాప్ నిర్వాహకుడు ఏం చేశాడంటే.. డిసెంబర్ 3 వరకు ఆగండి.. ఛత్తీస్‌గఢ్‌లోని మారుమూల ముంగేలి జిల్లాలోని ఓ ఊరిలో పాన్, టీ విక్రయించే చిన్నపాటి దుకాణంలో ఓ బోర్డు దర్శనమిస్తోంది. ‘డిసెంబర్ 3 వరకు ఆగండి. ఇక్కడ రాజకీయాల గురించి చర్చలు పెట్టి నా సమయాన్ని వృధా చేయకండి.. మీ సమయాన్ని చేసుకోకండి’ అని ఆ బోర్డులో రాసిఉంది. ఇక్కడికి వచ్చే జనం రాజకీయాల గురించి చర్చిస్తున్నారని, పార్టీలవారీగా విడిపోయి వాదనలకు దిగుతున్నారని పాన్ షాప్ నిర్వహకుడు మహావీర్ సింగ్ ఠాకూర్ చెబుతున్నారు. వీరి వాదనలు శ్రుతి మించి తరచుగా గొడవలు జరుగుతుండటంతో తన షాప్ వద్ద రాజకీయ చర్చలు వద్దని బోర్డును పెట్టినట్లు పేర్కొన్నారు. దీని వల్ల వ్యాపారం తగ్గినా పరవాలేదని ఆయన చెబుతున్నారు. బోర్డు పెట్టినప్పటి నుంచి అక్కడి వచ్చే జనంలో మార్పు వచ్చిందని, రాజకీయ చర్చలు తగ్గుముఖం పట్టాయని ఠాకూర్ తెలిపారు. కాగా ముంగేలి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. కాంగ్రెస్‌కు చెందిన సంజీత్ బంజారే, మాజీ మంత్రి బీజేపీ అభ్యర్థి పున్నూలాల్ మోహ్లేల మధ్య ఇక్కడ తీవ్ర పోటీ ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 3న మిగిలిన నాలుగు రాష్ట్రాలతోపాటు ఓట్ల లెక్కింపు జరగనుంది. -
జ్యుడీషియల్ సర్వీస్ ఎగ్జామ్‌లో టాపర్‌గా పాన్‌షాప్ యజమాని కూతురు!
సామాన్యుల పిల్లలు అసామాన్య ప్రతిభతో టాప్ విద్యాసంస్థల్లో చదివే పిల్లలతో పోటీ పడి విజేతలయ్యారు. ఇలాంటి ఘటనలు ఎన్నో చూశాం. సాధించాలనే తపన ఉంటే ఎవ్వరైన విజయం సాధించొచ్చు అని చూపిన ఘటనలు అవి. అదే కోవకు చెందింది ఉత్తరప్రదేశ్‌కి చెందిన నిషి గుప్తా. ఆమె ప్రతిష్టాత్మకమైన జ్యూడీషియల్ సర్వీసెస్‌లో సత్తా చాటి టాపర్‌గా నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకెళ్తే..ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కి చెందిన నిషి గుప్తా పాన్ షాప్ యజమాని కూతురు. ఆమె బుధవారం ప్రకటించిన ప్రోవిన్షియల్ సివిల్ సర్వీస్ జ్యుడీషియల్ ఎగ్జామ్‌లో సత్తా చాటింది. ఏకంగా ప్రథమ స్థానంలో నిలిచి శభాష్ అనిపించుకుంది నిషి గుప్తా. తొలి ప్రయత్నంలోనే నిషి ఈ పరీక్షలో ఉత్తీర్ణ సాధించడం విశేషం. లాలో గ్రాడ్యుయేట్ చేసినవారందరూ ఈ పరీక్షకు అర్హులు. ఇది జడ్డిలుగా ఎంపిక చేయడానికి పెట్టే ఎంట్రీ లెవెల్ ఎగ్జామ్. ఆ పరీక్షలో నిషి గుప్తా ప్రథమ స్థానం దక్కించుకుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారిని జిల్లా, మెజిస్ట్రేట్, అటర్నల్ జనరల్, సబ్ మెజిస్ట్రేట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ తదితరాలుగా ఎంపిక అవ్వుతారు. వీరిని హైకోర్టు ఎంపిక చేస్తుంది. ఇక నిషి పాఠశాల విద్యను ఫాతిమా కాన్వెంట్లో పూర్తి చేసింది. ఇక గ్రాడ్యేయేషన్ని 2020లో పూర్తి చేసింది. కాగా, ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్య యోగినాథ్ ఉత్తరప్రదేశ్ ప్రోవిన్షియల్ సివిల్ సర్వీస్ జ్యుడీషియల్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించిన తమ రాష్ట్ర అభ్యర్థులందర్నీ అభినందించారు. ఈ పరీక్షలో 55 శాతం మంది బాలికలు విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. కుమార్తెలు మమ్మల్ని గర్విచేలా చేశారని అభినందించారు కూడా. (చదవండి: ఆ ఏజ్‌లో లీడర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమెను చూసి.. షాకవ్వడం ఖాయం!) -
స్కూళ్ల సమీపంలోని సిగరెట్, పాన్ షాపులు క్లోజ్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల చుట్టూ కలుషిత వాతావరణం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ స్కూల్‌కు 200 మీటర్ల దూరం వరకు గుట్కా, పాన్, సిగరెట్లు అమ్మే షాపులు ఉండకూడదని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్ల సమీపంలోని పరిస్థితులను ఇకపై ఏఎన్ఎంలు పర్యవేక్షిస్తారు. ఒక్కో ఏఎన్ఎంకు రెండు, మూడు పాఠశాలల బాధ్యతలు అప్పగించనున్నారు. ఏఎన్ఎం వెళ్లి స్కూలు సమీపంలోని పరిస్థితులను పరిశీలించాల్సి ఉంటుంది. దీనికోసం ఒక ప్రత్యేక యాప్‌ను తయారు చేశారు. ఈ యాప్ ద్వారా అక్కడి ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలి. ఎవరైనా సిగరెట్, గుట్కా వంటి షాపులు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే స్కూల్ సమీపంలో ఎవరైనా స్మోకింగ్ చేసినా కూడా చర్యలుంటాయి. మద్యం షాపులైతే ఆ పరిసరాల్లో అసలే కనిపించకూడదు. ప్రతి స్కూల్‌నూ పర్యవేక్షణ కోసం మ్యాపింగ్ చేస్తారు. మ్యాపింగ్ అనంతరం వీటిని ఆన్లైన్ పోర్టల్‌కు అనుసంధానిస్తారు. చెడు అలవాట్ల ప్రభావం చిన్నపిల్లలపై పడకూడదని ఈ చర్యలు చేపట్టారు. అలాగే స్కూల్ ఆవరణలో స్మోకింగ్ వల్ల వచ్చే అనర్థాలను సూచించే బోర్డులను ఏర్పాటు చేస్తారు. టీచర్లు ఎవరైనా స్కూల్ ఆవరణలో స్మోకింగ్ చేస్తే.. వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటారు. త్వరలో ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. -
సీబీఐ.. బీజేపీ ప్రభుత్వంలో పాన్ షాప్
ముంబై: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) పరిధిపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మహారాష్ట్ర మత్స్య, జౌళి శాఖ మంత్రి అస్లాం షేక్ శుక్రవారం స్వాగతించారు. సీబీఐ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో ఒక పాన్ షాప్లా మారిందని ఆరోపించారు. సీబీఐ ఎక్కడికైనా వెళ్తుందని, ఎవరిపై అయినా కేసు పెడుతుందని అన్నారు. బీజేపీయేతర పార్టీల పాలన ఉన్న రాష్ట్రాల్లోనే తన ప్రతాపం చూపిస్తుందని ఎద్దేవా చేశారు. ఏకంగా ముఖ్యమంత్రులు, మంత్రులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. సీబీఐకి దాని పరిధి ఏమిటో గుర్తు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సీబీఐ అక్కడ దర్యాప్తు ప్రారంభించరాదని సుప్రీంకోర్టు ఇటీవలే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ పరిధిని నియంత్రిస్తున్న ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్‌ను జస్టిస్ ఏఎం ఖాన్వీల్కర్, జస్టిస్ బీఆర్ గవాయిల సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రస్తావించింది. చట్ట ప్రకారం.. ఒక రాష్ట్రంలో ఏదైనా కేసులో సీబీఐ దర్యాప్తు జరపాలంటే అక్కడి ప్రభుత్వ అనుమతి ముందుగా తీసుకోవాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. -
పాన్‌షాపులో మరోసారి చోరీ
సాక్షి, తాండూరు టౌన్: పాన్‌షాపులో చోరీ జరిగింది. ఈ ఘటన శనివారం రాత్రి తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తాండూరు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తాండూ రు ఇందిరానగర్‌కు చెందిన ఎండీ అస్లాం స్థానిక లారీ పార్కింగ్ వద్ద జీషాన్ పాన్‌మహల్ పేరుతో పాన్‌షాపు నడుపుతున్నాడు. రోజూ మాదిరిగానే షాపు తెరిచేందుకు వెళ్లిన అస్లాం షాపులో చోరీ జరిగినట్లు గుర్తించారు. పాన్‌షాపు రేకును కట్ చేసి చొరబడిన దొంగలు రూ. 10 వేల నగదుతో పాటు, సుమారు రూ.35వేల విలువైన సిగరెట్ ప్యాకెట్లు, ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారని అస్లాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే ఇదే తరహాలో గతేడాది అక్టోబర్‌లో కూడా అస్లాం పాన్‌షాపులో చోరీ జరిగింది. -
‘మయూరి’ ఉపేంద్రవర్మ కేసులో కొత్త కోణం
సాక్షి, హైదరాబాద్ : మయూరి పాన్‌షాప్‌ల యజమాని కుమారుడు ఉపేంద్రవర్మ చేతిలో మోసపోయానంటూ కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు (సాఫ్ట్వేర్ ఇంజినీర్) సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌ను కలిశారు. తనకు జరుగుతున్న అన్యాయంతో పాటు తనకు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో షికారు చేస్తున్న పుకార్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అదనపు సీపీ (నేరాలు) షికా గోయల్‌ను సైతం బాధితురాలు కలిశారు. తన అనుమతి లేకుండా తనకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంపై సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఈమె ఇప్పటికే ఫిర్యాదు చేసిన విషయం విదితమే. వీటిని పోస్ట్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఇది జరిగిన తర్వాత ఉపేంద్ర వర్మ సంబంధీకులు బాధితురాలికి వ్యతిరేకంగా మరికొన్ని ఫొటోలు విడుదల చేశారు. దీనిపై ఆమె పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నన్ను అప్రతిష్టపాలు చేస్తున్నారు: బాధితురాలు ‘ఉపేందర్‌తో గతేడాది సెప్టెంబర్ 13న వివాహం జరిగింది. నన్ను పెళ్లి చేసుకొని మోసం చేశాడు. న్యాయం కోసమే వారి ఇంటికి వెళ్లాను. ఆయన భార్యతో ఎలాంటి గొడవ పడలేదు. వారు ఉద్దేశపూర్వకంగానే వీడియో తీసి నన్ను అప్రతిష్టపాలు చేస్తున్నారు. నేను అనేక మంది నుంచి డబ్బు తీసుకున్నట్లు చేస్తున్న ఆరోపణలు వాస్తవాలు కావు. నేను రూ. 40 లక్షలు తీసుకున్నట్లు ఆధారాలు ఉంటే బయటపెట్టాలి. వాళ్లు విడుదల చేసిన ఫొటోలు నా కాలేజ్ ఫ్రెండ్‌తో దిగినవి. అతడితో నాకు మొదట్లో అఫైర్ ఉండేది. ఆ తర్వాత మనస్ఫర్థలు రావడంతో విడిపోయాం. కాలేజ్ ఫ్రెండ్ అనే ఉద్దేశంతో అతనితో చనువుగా ఉన్నా’ అని బాధితురాలు పేర్కొన్నారు. -
తన ఫొటోలు, వీడియోల వైరల్‌పై ఫిర్యాదు
సాక్షి,సిటీబ్యూరో/సుల్తాన్‌బజార్ : మయూర్ పాన్‌షాప్‌ల యజమాని కుమారుడు ఉపేంద్ర వర్మ చేతిలో మోసపోయినట్లు కాచిగడూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ శనివారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తనకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంపై ఆమె ఫిర్యాదు చేశారు. ఫేస్బుక్ ద్వారా 2013లో పరిచయమైన బాధితురాలిని ఉపేంద్ర వర్మ 2017లో వివాహం చేసుకున్నాడు. అప్పటికే వివాహితుడైన విషయం దాచి ఆమెతో హనీమూన్‌కు వెళ్ళివచ్చాడు. ఆపై అసలు విష యం చెప్పడంతో పాటు తన వద్ద ఉన్న ఆమెకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత వీడియోలు, ఫొటో లు ఇంటర్నెట్లో పెడతానని బెదిరించాడు. దీంతో బాధితురాలు కాచిగూడ పోలీసులకు ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం ఉపేంద్ర వర్మతో పాటు అతడికి సహకరించిన మరో ముగ్గురు స్నేహితుల్ని అరెస్టు చేశారు. ఇది జరిగిన తర్వాత ఉపేంద్ర వర్మతో బాధితురాలు ఉన్న అనేక ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఆమె శనివారం సైబర్ క్రైమ్ పోలీసులు ఆశ్రయించారు. వీటిని పోస్ట్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. పాన్‌షాప్ ముట్టడి యువతులపై అత్యాచారాలకు పాల్పడుతున్న ముయూరి పాన్‌షాప్ యజమాని ఉపేందర్‌వర్మను ఉరి తీయాలని అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి శీలం సరస్వతీ డిమాండ్ చేశారు. శనివారం శీలం సరస్వతి ఆధ్వర్యంలో బొగ్గులకుంటలోని మయూరి పాన్శాప్ను మహిళ సంఘం నాయకులు ముట్టడించారు. ఉపేందర్‌వర్మను ఉరితీసి, దుకాణాన్ని సీజ్ చేయాలని ప్లకార్డులు ప్రదర్శించి ధర్నాకు దిగారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రాధిక, శోభ, శారద, నాగమణి, లత, ఆర్ఎ. వినోద్‌కుమార్, శ్రావణి, పద్మ, నికాత్బేగం తదితరులు పాల్గొన్నారు. -
ఆవుల్ని పెంచుకోండి.. పాన్‌షాప్ పెట్టుకోండి..
అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేబ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విద్యావంతులైన యువతీయువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా ఆవులను పెంచుకోవాలని లేదంటే పాన్‌షాప్ పెట్టుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీల చుట్టూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం తిరగడం వల్ల జీవితంలో విలువైన సమయం వృథా అవుతుందని అభిప్రాయపడ్డారు. త్రిపుర వెటర్నరీ కౌన్సిల్ ఆదివారం నాడిక్కడ నిర్వహించిన ఓ సెమినార్లో బిప్లవ్ మాట్లాడుతూ.. ‘ప్రతి ఇంట్లో ఓ ఆవు ఉండాలి. ఒక్కో లీటర్ ఆవుపాలు ప్రస్తుతం రూ.50గా ఉంది. పదేళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగాల కోసం తిరగడానికి బదులుగా పాలు అమ్ముకుని ఉంటే ప్రస్తుతం ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షలు ఉండేవి. కనీసం రూ.75 వేల పెట్టుబడితో కొంచెం కష్టపడితే నెలకు వీరు రూ.25,000 ఆర్జించవచ్చు. కానీ గత 25 ఏళ్లలో రాష్ట్రంలో ఏర్పడ్డ కమ్యూనిస్టు సంస్కృతే దీనికి అడ్డంకిగా మారింది’ అని వ్యాఖ్యానించారు. ‘కనీసం 10 మంది నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించాలని అధికారులకు నేను చెప్పాను. ఆవుల్ని, పందుల్ని, కోళ్లను పెంచుకోవడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించవచ్చు. రాబోయే మూడు నెలల్లో 3,000 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని వెల్లడించారు. గతంలో ఓ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పకోడీలు అమ్ముకుని రోజుకు రూ.200 ఆర్జించేవారిని నిరుద్యోగులుగా పరిగణించలేమని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. విద్యావంతులు వ్యవసాయం చేయలేరన్న సంకుచిత మనస్తత్వమే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యకు ప్రధాన కారణమని బిప్లవ్ అభిప్రాయపడ్డారు. ఇంతకుముందు సివిల్స్ పరీక్షను సివిల్ ఇంజనీర్లే రాయాలనీ, మెకానికల్ ఇంజనీర్లు రాయకూడదంటూ బిప్లవ్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. -
పాన్ మండే.. నోరు పండే!
హిమాయత్‌నగర్: పంచ భక్ష్య పరమాన్నంతో భోజనం చేశాక పచ్చని తమలపాకులతో చక్కగా ఓ పాన్ చుట్టి నోట్లో వేసుకుంటే.. ఆ మజానే వేరు. అప్పుడే కదా విందు చేసిన సంతృప్తి ఉండేది. భోజన ప్రియులు ఎవరన్నా ఇలాగే చెబుతారు. అంతలేకున్నా కడుపు నిండా ఇష్టమైన భోజనం చేశాక పాన్ వేసుకునేవారు చాలామందే ఉన్నారు. ఇక దమ్ బిర్యానీ లాంగిచేశాక ఓ పాన్ వేసుకుంటే బాగా జీర్ణమవుతుందనా చాలామంది సిటీవాసులు అభిప్రాయం అదే నమ్మకంతో చాలామంది పాన్ కోసం క్యూ కడతారు. సిటీలో ఎన్ని పాన్‌షాపులు ఉన్నా.. ఒక్కో షాపుది ఒక్కో ప్రత్యేకత. ఇదే కోవలో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు నిలోఫర్ ఆస్పత్రి సమీపంలోని ‘ఎన్ఎన్ఎస్ పాన్ మహల్’ వారు. ‘భగభగ మండే’ పాన్‌తో పాన్ప్రియులను అలరిస్తూ సిటీకే ‘ఫైర్’ టాపిక్‌గా మారారు. ఓల్డ్‌సిటీలోని హుస్సేనీ ఆలంకు చెందిన నజర్నభీ సాలార్ (ఎన్ఎన్ఎస్)కు పాన్ అంటే అమితమైన ప్రేమ. ఈ ప్రేమతోనే 1950లో ఓల్డ్‌సిటీలో ‘షేరాన్ పాన్’ పేరుతో ‘ఫైర్ పాన్’ను ప్రారంభించారు. అప్పట్లో ఇక్కడ దొరికే ఈ ఫైర్ పాన్ కోసం నగరవాసులు బారులు తీరేవారు. అనుకోకుండా కొంతకాలానికి పాన్ అమ్మకాలను నిలిపివేశారు. ఆ తర్వాత నిలోఫర్ ఆస్పత్రి సమీపంలో ఎన్ఎన్ఎస్ కుటుంబ సభ్యులు ‘ఎన్ఎన్ఎస్ పాన్ మహల్’ పేరుతో ఫైర్‌పాన్ అమ్మకాలను ప్రారంభించారు. ప్రత్యేకత ఏమిటి.. ఫైర్పాన్లో ‘స్ట్రాబెర్రీ ఫ్లేవర్, హాట్చీజ్, ఇంట్లో తయారు చేసిన గుల్హాకన్, కోకోనట్, డౌట్స్, ఖర్జూర, స్వీట్మసాలా, హెర్బల్ మసాలా’తో పాన్ తయారు చేస్తారు. తమలపాకుపై ఇవన్నీ వేసిన తర్వాత మంటను వెలిగిస్తారు. భగభగ మండుతున్న ఆ పాన్‌ను నోట్లో వేసుకుంటే ఓ కరమైన కూల్, హాట్, స్వీట్ వంటి టేస్ట్లు నాలుకకు తగలడం విశేషం. నాలుక ఎర్రగా పండడంతో పాటు రోజంతా నోరు ఫ్రెష్‌గా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇంత టేస్ట్ కలిగిన ఈ పాన్‌ను ప్రస్తుతం రూ.50కి విక్రయిస్తున్నారు. రోజుకు 100కు పైగానే.. ఫైర్‌పాన్ తయారీ, విక్రయం దేశంలోనే మాది ఫస్ట్ ప్లేస్. మా తాత నజర్నబీ సాలార్ (ఎన్ఎన్ఎస్) చూపించిన ఈ చక్కటి అవకాశాన్ని వంశ పారంపర్యంగా కొనసాగిస్తున్నాం. ఫైర్పాన్కు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ప్రతిరోజూ వందకుపైగా అమ్మకాలు జరుగుతున్నాయి. వీకెండ్స్‌లో అయితే ఐదారొందల మంది తింటుంటారు. – మహ్మద్ జయుద్దీన్, పాన్‌షాపు యజమాని టేస్ట్ మస్తుంది.. నిలోఫర్‌లో మా బంధువుల్ని చూసేందుకు కొద్దిరోజుల క్రితం వచ్చాను. ఇక్కడ ఫైర్‌పాన్ బాగుంటుందని అందరూ అనుకుంటుంటే విన్నా. ఫ్రెండ్స్‌తో వచ్చి మరీ టేస్ట్ చేశా. ఓ పక్క మంట మండుతుండగానే నోట్లో పెట్టుకోవాలంటే ముందు భయపడ్డా, తింటుంటే టేస్ట్ మస్త్ ఉంది.– చందుగౌడ్, ప్రైవేట్ ఉద్యోగి -
ఆ ఆంక్షల వల్ల ఆగమవుతాం..!
హైదరాబాద్: పాన్‌షాపుల్లో పొగాకేతర విక్రయాలపై ఆంక్షలు విధించడం తగదని, వాటిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని పాన్‌షాప్ యజమానులు ఆందోళన చేపట్టారు. ఆ నిబంధనల వల్ల జీవనోపాధి సన్నగిల్లి వేలాది మంది వీధిపాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఇక్కడ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్‌ప్లాజాలో పాన్‌షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేలాది మంది ర్యాలీ నిర్వహించారు. తాము విక్రయించాలనుకునే వస్తువులను ఎంపిక చేసుకునే హక్కును హరిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసిందని తెలిపారు. పొగాకేతర ఉత్పత్తులైన బ్రెడ్డు, జ్యూస్, సాఫ్ట్ కూల్‌డ్రింక్‌లపై నిషేధం విధించడం వల్ల హైదరాబాద్‌లో దాదాపు ఏడువేల మంది పాన్‌షాపు నిర్వాహకులు, తెలంగాణలోని లక్షా 60 వేల మంది వ్యాపారుల కుటుంబాలు రోడ్డుపాలవుతాయని అసోసియేషన్ సభ్యులు అల్హాజ్ మొహమ్మద్ సలాహుద్దీన్, వాహెద్ హుస్సేన్, సంతోశ్, ఆనంద్, జమాలుద్దీన్ తెలిపారు. ఈ నిబంధనలను ఉపసంహరించుకోకపోతే ‘మా అందరికీ, మా కుటుంబ సభ్యులకు ప్రభుత్వం శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలి’అని డిమాండ్ చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఆస్కారం ఆంక్షలను వెనక్కి తీసుకోకపోతే సూక్ష్మ దుకాణదారులు తప్పనిసరై తమను తాము కాపాడుకోవడానికి చట్టవ్యతిరేక కార్యకలాపాల వైపు వెళ్లే ప్రమాదం ఉంది. ‘సబ్కా సాథ్ సబ్కా వికాస్’ స్ఫూర్తికి ఆ నిబంధనలు పూర్తి వ్యతిరేకం. ఇవి శాంతియుత ఉద్యోగాలు, జీవనోపాధిపై విధ్వంసకర ప్రభావం చూపుతాయి. – పాన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రంగరాజ్ శంకర్రావు పాన్‌షాప్.. మాకు ఆధారం 50 సంత్సరాలుగా పాన్‌షాపు ఆధారంగా జీవిస్తున్నాం. మా అన్నయ్య చనిపోయిన తరువాత నేను షాపును నిర్వహిస్తున్నాను. ఒక్క షాపుపైనే రెండు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు పాన్‌షాపుల్లో కేవలం పొగాకు ఉత్పత్తులే అమ్మాలంటే ఉపాధి లేక మా కుటుంబాలు వీధిన పడతాయి. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. – మహ్మద్ మోయిన్, పాన్‌షాపు యజమాని, సికింద్రాబాద్ -
ఆ షాపుల్లో... చాక్లెట్లు, కూల్‌డ్రింక్‌లకు ‘నో’
భావితరాలను పొగాకు వ్యసనానికి దూరంగా ఉంచేందుకు కేంద్రం ప్రభుత్వం మరో చర్య చేపట్టింది. సిగరెట్లు, బీడీలు, ఖైనీ, గుట్కాలను అమ్మే షాపులు స్థానిక సంస్థల వద్ద రిజిస్టర్ చేసుకొని... విక్రయాలకు అనుమతి పొందాలని ప్రతిపాదించింది. అలాగే మైనర్లు వీటి పట్ల ఆకర్షితులు కాకూడదనే ఉద్దేశంతో పాన్‌షాపుల్లో చాక్లెట్లు, బిస్కట్లు, చిప్స్, కూల్‌డ్రింక్స్ లాంటివి అమ్మకూడదని స్పష్టం చేసింది. పొగాకు ఉత్పత్తులు అమ్మే షాపులకు స్థానిక సంస్థల ద్వారా అనుమతిని జారీచేసే ప్రక్రియకు సంబంధించి విధివిధానాలను రూపొందించాలని కోరుతూ ఈనెల 21న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అన్ని రాష్ట్రాలకూ లేఖలు రాసింది. దేశవ్యాప్తంగా మైనర్లకు పొగాకు ఉత్పత్తుల అమ్మకుండా ఓ కన్నేసి ఉంచడానికి ఈ విధానం పనికి వస్తుందని ఆరోగ్యశాఖ సలహాదారు అరుణ్ ఝా అన్నారు. అయితే మన దేశంలో పాన్‌షాపుల్లో కాకుండా ప్రతిచిన్న కిరాణా కొట్టులోనూ సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు అమ్ముతారు. వీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయో చూడాలి. ప్రపంచ వ్యాప్తంగా పొగతాగే వారిలో 90 శాతం మందికి 20 ఏళ్ల వయసులోపే దమ్ము అలవాటైందని గణాంకాలు చెబుతున్నాయి. మొక్కగా ఉన్నపుడే వంచడం సులువు కాబట్టి యుక్త వయసులో అటు వైపు ఆకర్షితులు కాకుండా నిరోధిస్తే... ఈ మహమ్మారి బారినపడకుండా యువ శక్తిని కాపాడుకోగలమని ప్రభుత్వం భావిస్తోంది. – భారత్‌లో ప్రతి ఐదుగురిలో ఒకరికి పొగాకు నమిలే అలవాటు ఉందని ప్రభుత్వ సర్వే తేల్చింది. – 10 కోట్లు: భారత్‌లో పొగాకు తాగే అలవాటు ఉన్నవారు. – 1 కోటి: పొగాకు తాగే అలవాటు కారణంగా... క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె సంబంధం వ్యాధుల బారినపడి ప్రతియేటా మనదేశంలో మరణించే వారి సంఖ్య. – 60 శాతం నివారించొచ్చు: క్యాన్సర్లలో 60 శాతం నివారించదగ్గవే. వీటిలో పొగాకు సంబంధింత క్యాన్సర్లు 40 శాతం. – 16 ఏళ్లు: భారత్‌లో పొగాకు అలవాటుపడుతున్న పిల్లలు 16 ఏళ్ల సగటు వయసులో దీన్ని మొదలుపెడుతున్నారు. – 4.4 శాతం: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌లో విడుదల చేసిన గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే (గాట్స్) నివేదిక ప్రకారం 2010 నుంచి 2016 మధ్యకాలంలో 15–17 ఏళ్ల మధ్యలో పొగాకుకు అలవాటుపడుతున్న వారి సంఖ్య 9.6 శాతం నుంచి 4.4 శాతానికి పడిపోయింది. – 15.4 శాతం: ఇదే కాలంలో 18–24 ఏళ్ల వయసు వారిలో పొగాకు అలవాటున్న వారి శాతం 21.4 నుంచి 15.4 శాతానికి పడిపోయింది. ప్రజారోగ్యానికి సంబంధించి ఇదో ఆరోగ్యకర పరిణామంగా భావించిన కేంద్రం... యువతను ఈ అలవాటుకు దూరంగా ఉంచేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో తాజా చర్యలు చేపట్టింది. – 7 ఏళ్లు: 2015లో ఆమోదించిన జువనైల్ చట్టం ప్రకారం... మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మితే గరిష్టంగా ఏడేళ్ల దాకా కఠినకారాగార శిక్షను విధించే అవకాశముంది. 100 మీటర్లు: విద్యాసంస్థలకు 100 మీటర్ల దూరంలోపు పొగాకు ఉత్పత్తులను అమ్మకూడదు. – 4వ స్థానం: ప్రపంచంలో అత్యధికంగా సిగరెట్లు అమ్ముడయ్యే దేశాల్లో భారత్‌ది నాలుగోస్థానం. చైనా, అమెరికా, జపాన్ల తర్వాత మనమున్నాం. 9,900 కోట్లు: 2016లో భారత్‌లో అమ్ముడైన సిగరెట్ల సంఖ్య. 51 శాతం: ప్రపంచవ్యాప్తంగా సిగరెట్ల వినయోగంలో టాప్–4 దేశాలు ( చైనా, అమెరికా, జపాన్, భారత్) ఏకంగా 51 శాతం వినియోగిస్తున్నాయి. 11.2 శాతం: ప్రపంచవ్యాప్తంగా మొత్తం పొగరాయుళ్లలో భారతీయులు 11.2 శాతం. – ఈ ఏడాది విడుదల చేసిన జాతీయ ఆరోగ్య విధానంలో 2020 కల్లా పొగాకు వినియోగాన్ని 15 శాతం తగ్గించాలని, 2025 కల్లా 30 శాతం తగ్గించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మత్తెక్కిస్తోంది..
♦ నగరంలో గంజాయి సిగరెట్లు ♦ పాన్‌షాపులే విక్రయ కేంద్రాలు ♦ రాత్రి 9 గంటల తర్వాత అమ్మకాలు ♦ షీలావతి సిగరెట్‌కు డిమాండ్ వరంగల్ నగరంలో గంజాయి విక్రయాలు, వినియోగం జోరుగా సాగుతోంది. ప్రధాన సెంటర్లలో విచ్చలవిడిగా గంజాయి లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి రైలు మార్గం ద్వారా నగరానికి చేరుకుంటున్న గంజాయి.. ఆ తర్వాత సిగరెట్‌గా మారి మత్తెక్కిస్తోంది. సాక్షి, వరంగల్: నగరంలోని ప్రధాన జంక్షన్లలో, ప్రముఖ విద్యా సంస్థల పరిసరాల్లో ఉన్న పాన్‌షాçపుల్లో గంజాయి విక్రయాలు ఎక్కువగా సాగుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి కిలోల లెక్కన కొనుగోలు చేసిన గంజాయి పాన్‌షాపులకు చేరుతోంది. ఇక్కడ వీరు తమ కస్టమర్లకు గంజాయిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గంజాయికి అలవాటు పడిన కస్టమర్లు నిత్యం ఈ పాన్‌షాపులను సందర్శిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో కాకుండా రాత్రి 9 దాటిన తర్వాత పాన్‌షాపుల్లో గంజాయి అమ్మకాలు మొదలవుతున్నాయి. కస్టమర్ల అభిరుచి, కొనుగోలు శక్తిని బట్టి గంజాయిని రెడీమేడ్ సిగరెట్లు, లేదా రా మెటీరియల్‌గా అందిస్తున్నారు. ‘షీలావతి’కి డిమాండ్.. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు సంబంధించిన సిగరెట్లు అమ్మకాలు జరుగుతున్నాయి. వీటిలో మగవారి అందాన్ని సూచించే అర్థంతో వచ్చే సిగరేట్లు గంజాయి అమ్మకాలకు అనువుగా ఉన్నాయి. మిగిలిన బ్రాండ్లకు సంబంధించిన సిగరేట్లలో గంజాయిని మిళితం చేయడం కష్టం. కానీ అందాన్ని సూచించే సిగరెట్లో గంజాయిని మిక్స్ చేయడం తేలిక. దీంతో ఈ సిగరేట్‌లో ఉన్న పొగాకు సగానికి పైగా తొలగించి దాని స్థానంలో గంజాయిని కలుపుతున్నారు. ఈ సిగరేట్కు కోడ్ భాషలో షీలావతిగా పేర్కొంటారు. ఒక్క షీలావతి సిగరేట్ ధర రూ.150 నుంచి రూ.200 వరకు ఉంది. రెడీమేడ్‌గా సిగరెట్ కావాలనుకునే వారు షీలావతిని కొనుగోలు చేస్తారు. మరికొందరు టోకుగా గంజాయి, ఫిల్టర్లు, సిగరెట్‌ను చుట్టే రిజ్లా కాగితాన్ని కొనుక్కుని తమకు ఇష్టం వచ్చినట్లు సిగరెట్లు తయారు చేసుకుంటున్నారు. ప్రారంభంలో కేవలం గంజాయి విక్రయించినా సొంత తయారీ గంజాయి సిగరేట్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో సిగరేట్ తయారీకి ఉపయోగించే రిజ్లా కాగితం, ఫిల్టర్లను ప్రత్యేకంగా తెప్పించి అమ్మకాలు చేస్తున్నారు. ఈ విధానంలో ధర తక్కువగా ఉండటంతో పాటు ఎవరి కంట పడకుండా గుట్టుగా తాగే అవకాశం ఉంది. రైలు ద్వారా రవాణా.. హైదరాబాద్, విజయవాడల నుంచి నగరానికి గంజాయి వస్తోంది. గంజాయిని సరఫరా చేసే వ్యక్తులు ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా మిలిటరీ ట్రంకు పెట్టెను పోలి ఉండే పెట్టెలను, బ్యాగులను ఉపయోగిస్తున్నారు. వీటిని రైలుబోగీలో తలుపులు, టాయిలెట్లకు సమీపంలో ఈ బ్యాగు/పెట్టెలను ఉంచుతున్నారు. వీటిని సరఫరా చేసే వ్యక్తులు మిలిటరీ కటింగ్ చేయించుకుని ఉంటున్నారు. దీంతో చూసేవారికి ఆర్మీలో పని చేసే వ్యక్తులుగా కనిపిస్తున్నారు. కాజీపేట, వరంగల్ స్టేషన్లు రాగానే గంజాయితో కూడిన బ్యాగులతో రైలు దిగి బయటకు వెళ్లిపోతున్నారు. వేషధారణ, నడవడిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో ఎవరికీ అనుమానం రావడం లేదు. -
పొగాకు ఉత్పత్తులపై ‘85% హెచ్చరిక’ వద్దు
పాన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు హైదరాబాద్: పొగాకు ఉత్పత్తులపై 85% గ్రాఫిక్ ఆరోగ్య హెచ్చరికలు ఉండాలన్న నిబంధనను ఉపసంహరించాలని పాన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో పాన్‌షాప్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగరాజ్ శంకర్రావు, నేతలు సతీష్‌నాయక్, మహ్మద్ ఆఫ్జలుద్దీన్లు మాట్లాడుతూ ప్రపంచంలోనే పొగాకు అత్యధికంగా వినియోగించే యూఎస్ఏ, జపాన్, చైనా వంటి దేశాల్లో సున్నా ఛాయాచిత్ర హెచ్చరికలుంటే ఇండియాలో 85% ఉండాలన్న నిబంధన విధించడం ఎంతవరకు సబబమని ప్రశ్నించారు. వేలాది కుటుంబాలు పాన్‌షాప్‌ల ద్వారా జీవనం కొనసాగిస్తున్నాయని, అంతేగాక, తంబాకు అమ్మే వ్యాపారులు, రిటైలర్లు జీవనోపాధి పొందుతున్నారని, ఇలాంటి హెచ్చరికల ద్వారా వారి కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందన్నారు. -
కిల్లీ దగ్గర వచ్చింది లొల్లి
కుత్బుల్లాపూర్ : పాన్‌షాప్‌లో కిల్లీ కట్టే సమయంలో వివాదం తలెత్తడంతో ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై బాహాబాహీకి దిగారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్, చింతల్ గణేశ్ నగర్ బస్టాప్ సమీపంలో శనివారం సాయంత్రం జరిగింది. మొదట ఇద్దరితో ప్రారంభమై.. ఆపై తొమ్మిది మంది..ఇలా ఒకరికొకరు తోడవుతూ నానా హంగామా సృష్టించారు. సినీఫక్కీలో జరిగిన ఈ సంఘటనను అక్కడున్న వారంతా చూసి విస్తుపోయారు. కొందరు వ్యక్తులు 20 నిమిషాలపాటు వీరంగం సృష్టించారు. గణేష్ నగర్లో బస్సు దిగిన ప్రయాణికులు ఈ గొడవను చూసి భయంతో పరుగులు తీశారు. స్థానికులు 100కు ఫోన్ చేయడంతో జీడిమెట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. -
బెల్టు తీయలే..
నెల్లూరు(క్రైమ్):‘బెల్టుషాపులు నిర్వహిం చరాదు ..ఎమ్మార్పీకే విక్రయాలు జరపాలి.. బార్‌కోడింగ్ అమలుచేయాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఉత్తర ప్రగల్భాలేనని ప్రస్పుటమవుతోంది. బెల్టుతీయలేక ప్రభుత్వం చతికలబడటంతో ఊరూవాడ బెల్టుషాపులు దర్శనమిస్తూ మద్యాన్ని ఏరులై పారిస్తున్నాయి. చివరకు పాన్‌షాపుల్లో కూడా బెల్టు నిర్వహిస్తూ...విక్రయాలు జరుపుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులు మొక్కుబడి చర్యలకే పరిమితమవుతున్నారు. క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న బెల్టుషాపులను పరిశీలిస్తే నిషేధం ఇక సాధ్యం కాదన్న విషయం తెలిసిపోయింది. ఉదయభానుడైనా...కాస్త ఆలస్యంగా వస్తాడేమో గానీ...మద్యం విక్రయాలు మాత్రం తెల్లవారుజామునుంచే ప్రారంభమవుతున్నాయి. అడపాదడపా దాడులతోనే ఎకై ్సజ్ అధికారులు సరిపెట్టుకుంటున్నారు. 2,500కు పైనే.. జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 940 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో అనధికారికంగా నిర్వహిస్తున్న బెల్టుషాపుల సంఖ్య దాదాపు 2,500కు పైగానే ఉంది. భారీ సంఖ్యలో బెల్టుషాపులు నడుస్తున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం ఒక్కటి లేదనే బుకాయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 348 మద్యం దుకాణాలు, 48 బార్లు ఉన్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సబంధించి అధికారులు వేలంపాటలు నిర్వహించారు. 348 మద్యం దుకాణాలకు గాను 333 మద్యం దుకాణాలను లాటరీలో వ్యాపారులు దక్కించుకున్నారు. ఐఎంఎల్ డిపో నుంచి రోజుకు సుమారు రూ.2కోట్ల విలువైన మద్యాన్ని దుకాణదారులు తీసుకెళుతున్నారు. దుకాణాల వారీగా ప్రాంతాన్ని బట్టి రోజుకు రూ.30 వేల నుంచి రూ. లక్షకు పైగా వ్యాపారం జరుగుతోంది. వీటిలో ఎక్కువశాతం బెల్టుదుకాణాల ద్వారానే అమ్ముడుపోతోంది. కొన్ని దుకాణాల్లో అయితే కౌంటర్ సేల్కన్నా, బెల్టుషాపుల ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ. లెసైన్సుడ్ షాపులను జాతీయపండగల రోజులు, ఎన్నికల సమయంలో మూసివేయాల్సి ఉంటుం ది. నిర్ణీత వేళల్లోనే ఇక్కడ మద్యం అమ్మకాలు సాగించాలి. బెల్టుషాపులకు మాత్రం వేళాపాళా లేదు. రోజంతా విక్రయాలు సాగుతుంటాయి. ఈ కారణంగా బెల్టుషాపులపై ఈగ వాలకుండా వ్యాపారులు ఎప్పటికప్పుడు ఆబ్కారీ అధికారులుకు భారీగా ముడుపులు ముట్టజెబుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు మొక్కుబడి దాడులు నిర్వహిస్తూ తమ పనైపోయిందని చేతులు దులుపుకొంటున్నారు. సిండికేట్లు..అనధికార విక్రయాలు ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. జిల్లాలోని మద్యం వ్యాపారులు సిండికేట్లుగా మారారు. దీంతో ఎంఆర్పీ ఊసేలేదు. ప్రతి బ్రాండ్‌పై రూ. 10 నుంచి రూ.15 వరకు అధికంగా విక్రయిస్తూ మందుబాబుల జేబులకు చిల్లుపెడుతున్నారు. పర్మిట్ గదులు కాస్తా బార్లను తలపిస్తున్నాయి. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జాతీయ రహదారి వెంబడి దాబాలు అనధికర బార్లుగా మారాయి. 24 గంటలు మద్యం అందుబాటులో ఉండటంతో పూటుగా మద్యం తాగుతున్న మందుబాబులు ప్రమాదాల బారిన పడి మృత్యువాతపడుతున్నారు. భారీగా మామూళ్లు.... ఎక్సైజ్, పోలీసు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండటంతో మద్యం వ్యాపారుల పరిస్థితి మూడు బీర్లు....ఆరు క్వార్టర్లు అన్న చందాన తయారైందని ఆరోపణలున్నాయి. ప్రతి పోలీసుస్టేషన్‌కు ప్రాంతాన్ని బట్టి ఒక్కో దుకాణదారుడు రూ. 5 నుంచి, రూ. 15వేలు ముడుపులు చెల్లించుకుంటున్నట్లు సమాచారం. ఎక్సైజ్ అధికారుల సంగతి సరేసరి. ఇటీవల పోలీసులు నైట్సేల్స్, అనధికార బెల్టుదుకాణాలపై దాడులు ప్రారంభించి నిర్వాహకులపై చర్యలు తీసుకుంటుండటంతో ఆబ్కారీలో చలనం మొదలైంది.