జైపూర్: రాజస్థాన్‌లోని బికనీర్ పట్టణం సట్టాబజార్‌లో ఉన్న ముల్సా-పుల్సా పాన్ షాపుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈపాన్‌షాపు ఓనర్ పూల్‌చంద్ కట్టే రుచికరమైన పాన్‌ల కోసమే కాకుండా ఆయన ధరించే బంగారు ఆభరణాలు చూడడానికి కూడా ఎక్కువ మంది కస్టమర్లు వస్తుంటారు.
పూల్‌చంద్ కట్టే వివిధ రకాల పాన్‌లు రుచిచూసేందుకు బికనీర్ వాసులే కాకుండా దూర ప్రాంతాల నుంచి పాన్‌ప్రియులు విచ్చేస్తారు. పూల్‌చంద్ స్వయంగా పాన్‌లు కట్టడమే కాకుండా కస్టమర్లను నవ్వుతూ పలకరిస్తుండటం షాపుకు ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది.
ఇటీవలి కాలంలో పాన్‌లు కట్టడంలో పూల్‌చంద్‌కు ఆయన కుమారుడు కూడా సాయం చేస్తున్నాడు. షాపు ఉదయాన్నే 5 గంటలకు మొదలై అర్ధరాత్రి 2 గంటల వరకు కస్టమర్లతో కిటకిటలాడుతూనే ఉంటుంది. ముల్సాపుల్సా పాన్‌షాపులో పాన్‌లు రూ.20 నుంచి మొదలుపెట్టి రూ.200 వరకు దొరుకుతాయి.
VIDEO | Bikaner is home to a unique 'Paan' seller. His shop in the Satta Bazar area of the city has been attracting customers not just for the Paan but also for the gold ornaments he adorns with grace. Phoolchand owns the Mulsa-Phulsa paan shop, which sells various flavours of… pic.twitter.com/Ou3U6zsvDZ
— Press Trust of India (@PTI_News) June 2, 2024
Comments
Please login to add a commentAdd a comment