Bhopal Newly Married Woman Harassed By Husband Over Wife Swap Game, Details Inside - Sakshi
Sakshi News home page

తొలిరేయి నుంచే ఆమెకు నరకం! ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో బంధించి మరీ..

Published Mon, Oct 17 2022 2:01 PM | Last Updated on Mon, Oct 17 2022 8:05 PM

Bhopal Newly Wed Woman Harassed By Husband Over Wife Swap Game - Sakshi

క్రైమ్‌: పెద్దల తొందరపాటు నిర్ణయంతో ఓ నవ వధువు(22) నరకం చవిచూసింది. ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఆమెకు.. వరుసగా ఒక్కో షాక్‌ తగులుకుంటూ వచ్చింది. చిన్నప్పటి నుంచి తెలిసివాడని, మంచోడని భావించిన భర్త.. మొదటి రాత్రి నుంచే ఆమెపై శాడిజం ప్రదర్శిస్తూ వచ్చాడు. పైగా పరాయి పురుషులకు పడక సుఖం పంచాలంటూ ఆమెపై ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో మాట వినని ఆమెకు దారుణాతి దారుణంగా హింసించాడు. 

రాజస్థాన్‌ బికనీర్‌ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో జరిగిన నవ వధువు వేధింపుల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో మేనేజర్‌గా పని చేసే వ్యక్తి.. తన భార్యను అత్యంత పైశాచికంగా హింసించిన ఉదంతం విస్మయానికి గురి చేస్తోంది. శారీకంగా, మానసికంగా దెబ్బ తిన్న ఆమె అనారోగ్యం నుంచి కోలుకోవడానికి నెలల సమయమే పట్టింది. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో ఆ భర్త కిరాతకాలు వెలుగులోకి వచ్చాయి.

మధ్యప్రదేశ్‌ భోపాల్‌ ఖోహేఫిజా ప్రాంతంలో ఇరు కుటుంబాలు పక్కపక్కనే ఉంటాయి. చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నవాళ్లు కావడంతో పెద్దలు, వాళ్ల పిల్లలకు ఈ ఏడాది జూన్‌లో వివాహం చేశారు. అయితే నవ వధువును తీసుకుని రాజస్థాన్‌ బికనీర్‌లో ఉన్న తమ ఇంటికి కాపురం వెళ్తానని అందరినీ నమ్మించాడు ఆ భర్త. తీరా అక్కడికి వెళ్లాక తాను పని చేసే ఫైవ్‌ స్టార్‌ హోటల్‌గదిలో ఆమెను బంధించాడు. 

తొలి రాత్రి నుంచే తన శాడిజంతో ఆమెకు చుక్కలు చూపించాడు. తమకు అసలు సొంతిల్లే లేదని.. ఇక్కడే ఉండాలంటూ ఆమెను బలవంతం చేశాడు. ఆపై ఆమె ఫోన్‌ లాక్కుని.. ఎవరితో కాంటాక్ట్‌ లేకుండా చేశాడు. చివరకు..  వైఫ్‌ స్వాపింగ్‌ గేమ్‌(ఒకరి భార్యతో మరొకరు శృంగారంలో పాల్గొనే క్రీడ)లో పాల్గొనాలని బాధితురాలిపై ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలో ఆమె మాట వినకపోవడంతో దారుణంగా హింసించాడు. ఆపై ఆమె కుటుంబ సభ్యుల్ని రూ. 50 లక్షల ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. 

అయితే ఆమె తల్లిదండ్రుల నుంచి సరైన స్పందన రాలేదు. ఈలోపు పదిహేను రోజుల పాటు హోటల్‌ గదిలోనే బంధించి.. ఆమె ముందు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. భార్యను మంచానికి కట్టేసి డ్రగ్స్‌ సేవించి.. ఆమె ఎదురుగానే అమ్మాయిలతో పాటు మగవాళ్లతోనూ శృంగారంలో పాల్గొన్నాడు. అంతటితో ఆగకుండా ఆమెతో అసహజ శృంగారంలో పాల్గొని నరకం చూపించాడు. ఈ తరుణంలో ఆమె ఆత్మహత్యయత్నం చేయగా.. హోటల్‌ నుంచి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అదనపు కట్నం కోసం అత్తమామ, భర్త కలిసి ఆమెను వేధించడం మొదలుపెట్టారు. 

ఎలాగోలా పుట్టింటికి ఫోన్‌ చేసి సమాచారం అందించిన ఆమె.. మేనమామ సాయంతో ఆ నరకం నుంచి బయటపడింది. ఈలోపు ఆరోగ్యం క్షీణించడంతో ఆమెకు ఇన్నాళ్లపాటు చికిత్స అందించారు. చివరకు స్వస్థలం చేరుకుని భోపాల్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వివిధ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసుకున్నారు పోలీసులు. అయితే ఇంతవరకు నిందితుడిని అరెస్ట్‌ చేయకపోవడంతో.. బాధిత కుటుంబం ఆందోళనకు సిద్ధమైంది.

ఇదీ చదవండి: యువతుల కోసం అపార్ట్‌మెంట్‌కు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. షాకింగ్‌ ట్విస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement