harrased
-
లా స్టూడెంట్ పై ఎమ్మెల్యే పీఏ అత్యాచారం
-
ముంబైలో నడిరోడ్డు పై కొరియన్ యూట్యూబర్ తో అసభ్య ప్రవర్తన
-
తొలిరేయి నుంచే ఆమెకు నరకం
క్రైమ్: పెద్దల తొందరపాటు నిర్ణయంతో ఓ నవ వధువు(22) నరకం చవిచూసింది. ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఆమెకు.. వరుసగా ఒక్కో షాక్ తగులుకుంటూ వచ్చింది. చిన్నప్పటి నుంచి తెలిసివాడని, మంచోడని భావించిన భర్త.. మొదటి రాత్రి నుంచే ఆమెపై శాడిజం ప్రదర్శిస్తూ వచ్చాడు. పైగా పరాయి పురుషులకు పడక సుఖం పంచాలంటూ ఆమెపై ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో మాట వినని ఆమెకు దారుణాతి దారుణంగా హింసించాడు. రాజస్థాన్ బికనీర్ ఫైవ్ స్టార్ హోటల్లో జరిగిన నవ వధువు వేధింపుల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో మేనేజర్‌గా పని చేసే వ్యక్తి.. తన భార్యను అత్యంత పైశాచికంగా హింసించిన ఉదంతం విస్మయానికి గురి చేస్తోంది. శారీకంగా, మానసికంగా దెబ్బ తిన్న ఆమె అనారోగ్యం నుంచి కోలుకోవడానికి నెలల సమయమే పట్టింది. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో ఆ భర్త కిరాతకాలు వెలుగులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్ భోపాల్ ఖోహేఫిజా ప్రాంతంలో ఇరు కుటుంబాలు పక్కపక్కనే ఉంటాయి. చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నవాళ్లు కావడంతో పెద్దలు, వాళ్ల పిల్లలకు ఈ ఏడాది జూన్‌లో వివాహం చేశారు. అయితే నవ వధువును తీసుకుని రాజస్థాన్ బికనీర్‌లో ఉన్న తమ ఇంటికి కాపురం వెళ్తానని అందరినీ నమ్మించాడు ఆ భర్త. తీరా అక్కడికి వెళ్లాక తాను పని చేసే ఫైవ్ స్టార్ హోటల్గదిలో ఆమెను బంధించాడు. తొలి రాత్రి నుంచే తన శాడిజంతో ఆమెకు చుక్కలు చూపించాడు. తమకు అసలు సొంతిల్లే లేదని.. ఇక్కడే ఉండాలంటూ ఆమెను బలవంతం చేశాడు. ఆపై ఆమె ఫోన్ లాక్కుని.. ఎవరితో కాంటాక్ట్ లేకుండా చేశాడు. చివరకు.. వైఫ్ స్వాపింగ్ గేమ్(ఒకరి భార్యతో మరొకరు శృంగారంలో పాల్గొనే క్రీడ)లో పాల్గొనాలని బాధితురాలిపై ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలో ఆమె మాట వినకపోవడంతో దారుణంగా హింసించాడు. ఆపై ఆమె కుటుంబ సభ్యుల్ని రూ. 50 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే ఆమె తల్లిదండ్రుల నుంచి సరైన స్పందన రాలేదు. ఈలోపు పదిహేను రోజుల పాటు హోటల్ గదిలోనే బంధించి.. ఆమె ముందు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. భార్యను మంచానికి కట్టేసి డ్రగ్స్ సేవించి.. ఆమె ఎదురుగానే అమ్మాయిలతో పాటు మగవాళ్లతోనూ శృంగారంలో పాల్గొన్నాడు. అంతటితో ఆగకుండా ఆమెతో అసహజ శృంగారంలో పాల్గొని నరకం చూపించాడు. ఈ తరుణంలో ఆమె ఆత్మహత్యయత్నం చేయగా.. హోటల్ నుంచి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అదనపు కట్నం కోసం అత్తమామ, భర్త కలిసి ఆమెను వేధించడం మొదలుపెట్టారు. ఎలాగోలా పుట్టింటికి ఫోన్ చేసి సమాచారం అందించిన ఆమె.. మేనమామ సాయంతో ఆ నరకం నుంచి బయటపడింది. ఈలోపు ఆరోగ్యం క్షీణించడంతో ఆమెకు ఇన్నాళ్లపాటు చికిత్స అందించారు. చివరకు స్వస్థలం చేరుకుని భోపాల్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్నారు పోలీసులు. అయితే ఇంతవరకు నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంతో.. బాధిత కుటుంబం ఆందోళనకు సిద్ధమైంది. ఇదీ చదవండి: యువతుల కోసం అపార్ట్‌మెంట్‌కు సాఫ్ట్వేర్ ఉద్యోగి.. షాకింగ్ ట్విస్ట్ -
బస్సాపండంకుల్ ప్లీజ్..!
ర్యాంకులు, గ్రేడ్లు, పర్సెంటైల్స్ ఏవో ఉంటాయి.. అవన్నీ ధైర్యంగా ఇంట్లోంచి బయటికి వెళ్లి చదివొచ్చినందుకు అనిపిస్తుంది ఫలితాలు వెల్లడైన రోజు తల్లిదండ్రులకు. వాళ్లనింకా పిల్లలనే అనాలి. ఇంటర్లోకి అడ్మిషన్ తీసుకున్నారు కనుక ఫస్ట్ డే, ఫస్ట్ బెల్తోనే పెప్పర్ స్ప్రేని పట్టుకోవడం చేతనౌతుందా! ఇన్నాళ్లూ ఇంటి దగ్గరి స్కూలు. ఇప్పుడు ఊరికి దూరంగా ఉండే కాలేజి. భద్రంగా వెళ్లి రావాలన్నది ఇంట్లో ఫస్ట్ లెసన్. బయట కుదురుగా ఉండాలనేది నాన్–డీటెయిల్డ్. అమ్మ చెబుతుంది ఒంటి మీది బట్టలు సరిచేస్తూ.. డీటెయిల్స్ అవసరం లేని పాఠం. పిల్లలకూ అర్థం కానిదేం కాదు. లోకంలో జరిగేవి వింటూనే, చూస్తూనే కదా రోజూ ధైర్యంగా స్కూల్‌కి వెళ్లొస్తున్నారు, టెన్త్ పూర్తి చేస్తున్నారు, ధైర్యంగా ఇంటర్లో జాయిన్ అవుతున్నారు, ధైర్యంగా కాలేజ్‌కి వెళ్లొస్తున్నారు. ధైర్యం కావాలిప్పుడు ఆడపిల్లలకు సర్టిఫికెట్ చేతిలోకి రావడానికి. ర్యాంకులు, గ్రేడ్లు, పర్సెంటైల్స్ ఏవో ఉంటాయి.. అవన్నీ ధైర్యంగా ఇంట్లోంచి బయటికి వెళ్లి చదివొచ్చినందుకు అనిపిస్తుంది ఫలితాలు వెల్లడైన రోజు తల్లిదండ్రులకు. గ్రేటర్ నోయిడాలో ఇద్దరు పిల్లలు కాలేజ్‌కి వెళ్లేందుకు బస్సెక్కారు. ప్రైవేటు బస్సు. రోజూ వెళ్లొచ్చే రూట్లోనే చేతికి అందిన బస్సు. బస్సులో వీళ్లిద్దరు ఉన్నారు. వీళ్ల ముందు సీట్లలో నలుగురు అబ్బాయిలు ఉన్నారు. ఆ అబ్బాయిలు ఈ ఇద్దరు అమ్మాయిల కన్నా వయసులో కొంచెం పెద్దవాళ్లు. కాలేజ్‌మేట్స్ కాదు. ఎవరో. బస్సు ఎక్కినప్పట్నుంచీ ఆపకుండా వీళ్లపై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ‘చిక్కావు చేతిలో చిలకమ్మా..’ టైప్ కామెంట్స్. అమ్మాయిలకు భయం వేసింది. చూసి చూసి ఇక ధైర్యంగా ఉండలేక బస్సు ఆపమని డ్రైవర్ దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేశారు. ‘ఎక్కడపడితే అక్కడ ఆగదమ్మా..’ అన్నాడు డ్రైవర్. కనీసం బీరంపూర్ బస్టాప్లోౖనైనా బస్సును ఆపాలి. ఆ స్టాప్‌లో బస్ ఎక్కడం కోసం ఈ ఇద్దరమ్మాయిల క్లాస్మేట్స్ నిలబడి ఉన్నారు. ‘అంకుల్ ఆపండి ప్లీజ్..’ అన్నారు వీళ్లు. అక్కడా ఆపలేదు. ఆ స్టాప్ దాటితే బులంద్‌షహర్ స్టాప్. వీళ్లు దిగాల్సింది బులంద్ షహరే. ఇంకా కొంత దూరం ఉంది. బస్సు పోతూనే ఉంది. బస్సు ఆపమని వీళ్లు అడుగుతుండడం, డ్రైవర్ ఆపకపోవడం చూసి అబ్బాయిలకు ఉత్సాహం వచ్చేసింది. ‘ఈరోజు బస్సు ఆగదు’ (‘ఆజ్ తో నహీ రుకేగీ బస్’) అని ఒక అబ్బాయి అన్నాడు. అప్పుడు మొదలైంది ఈ పిల్లలకు వణుకు. ఆగని బస్సుల్లో ఏం జరిగే ప్రమాదం ఉంటుందో వాళ్ల ఊహకు వచ్చి ఉండాలి. ‘అంకుల్.. బస్ ఆపండి’ అని పెద్దగా అరిచారు. బస్సు ఆగలేదు. వేగం తగ్గలేదు. ఆ వేగంలోనే బస్ డోర్ నెట్టుకుని ఒకరి వెనుక ఒకరు బయటికి దూకేశారు! వాళ్లలో ఒకమ్మాయి తలకు, నడుముకు బలమైన దెబ్బలు తగిలాయి. పాదం, మణికట్టు నలిగిపోయాయి. ఇంకో అమ్మాయి కాలు, చెయ్యి ఫ్రాక్చర్ అయ్యాయి. అదృష్టం.. వీళ్లు కిందపడ్డ క్షణంలో వెనుక నుంచి వాహనాలేమీ రాలేదు. పెద్దవాళ్లొచ్చి పిల్లల్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పిల్లల్ని ఏడిపించిన అబ్బాయిలు దొరకలేదు. బస్సు ఆపని డ్రైవర్ మీద ఎఫ్.ఐ.ఆర్. రిజిస్టర్ అయింది. ఐపీసీ లోని ఓ మూడు సెక్షన్ల కింద కేసు పెట్టారు. బండిని వేగంగా నడపడం, తీవ్ర గాయాలకు కారణమవడం, వ్యక్తులకు దెబ్బలు తగిలించడం.. సెక్షన్ 279, 338, 337. కామెంట్స్ చేసిన ఆ మగపిల్లలపై కేసులు వద్దనుకున్నారు ఆడపిల్లల పేరెంట్స్. మళ్లీ ఆ దారిలోనే కదా పిల్లలు రోజూ వెళ్లిరావాలి! లోకంలోకి అప్పుడప్పుడే అడుగు పెడుతున్న ఇద్దరు ఆడపిల్లలు ఏ కారణంగానో భయపడి బస్సును ఆపమని బతిమాలినా ఆపకుండా బస్సును పోనిచ్చినందుకు అంటూ డ్రైవర్‌పై పెట్టడానికి ఐపీసీలో ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఉండదు. ఉన్న సెక్షన్లలోనే కాస్త దగ్గరగా ఉన్న వాటిని చూసి ఆ సెక్షన్ల కింద డ్రైవర్‌ను అరెస్టు చేస్తారు. నోయిడా పోలీసులూ అంతవరకే చేయగలిగారు. అసలైతే డ్రైవర్‌పై ‘నిర్భయ’ కేసు పెట్టాలి. ఎనిమిదేళ్ల క్రితం ఢిల్లీలో రాత్రి 10 గంటలకు బస్సులో జరిగిన ఆ ఘటనకు, వారం క్రితం నోయిడాలో పగలు 10 గంటలకు బస్సులో జరిగిన ఈ ఘటనకు తేడా ఏం లేదు. ‘ఈరోజు బస్సు ఆగదు’ అన్నాక, ఆ మగపిల్లల్లో ఇంకొకరు ‘మజాగా ఉంటుందిక’ (‘మజా ఆగయా’) అనడం విని డ్రైవర్‌కి కూడా మజా వచ్చి ఉంటే బస్సు ఏ ఒంటరి ప్రదేశం లోనికో మలుపు తిరిగి ఉండేది. మహిళల రక్షణకు, భద్రతకు చట్టం గట్టి కాపలాల్నే పెట్టింది. బయటే కాదు, సొంత ఇంట్లోనైనా ఆమెపై ఏదైనా జరగబోతుంటే ఒక్క కాల్‌తో పోలీసులు వచ్చేస్తారు. అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇచ్చేలా అబ్బాయిల్ని పెంచే తల్లిదండ్రుల ‘న్యూ ఎరా’ ఒకటి కూడా ఆల్రెడీ గర్ల్స్‌కి బాయ్స్ చేత నమస్తే పెట్టిస్తోంది. మరింకేంటి?! గట్టి చట్టం, బుద్ధి కలిగిన బాయ్స్. హ్యాపీనే కదా. కాదు! స్టీరింగ్ గర్ల్స్ చేతుల్లో ఉండాలి. లెజిస్లేచర్, జుడీషియరీ, ఎగ్జిక్యూటివ్, ప్రెస్ అనే ఫోర్–వీలర్ స్టీరింగ్‌ని గర్ల్స్ తమ చేతుల్లోకి తీసుకోవాలి. నోయిడాలో ఆ బస్సు స్టీరింగ్ ఒక మహిళ చేతిలో ఉండి ఉంటే ఏం జరిగి ఉండేదో ఊహించండి. అమ్మాయిల్ని వేధించినందుకు.. ‘బస్ ఆపండి ఆంటీ ప్లీజ్.. దిగిపోతాం’ అని అబ్బాయిలు ప్రాధేయపడుతుండేవాళ్లు.. బస్సు పోలీస్ స్టేషన్ వైపు మలుపు తిరుగుతుంటే. – మాధవ్ శింగరాజు -
ప్రేమ పేరుతో పురుగుల మందు తాగించిన టీచర్
సాక్షి, వికారాబాద్: కంప్యూటర్ విద్యను బోధించే ఓ ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయుడు ఓ విద్యార్థినిని బలవంతంగా తీసుకొచ్చి పురుగుల మందు తాగించి, తానూ తాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా ఆందోల్‌కు చెందిన రేణిగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శ్రీశైలం అనే యువకుడు కంప్యూటర్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఇదే పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఓ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు అతన్ని హెచ్చరించినా తీరు మారలేదు. ఇదిలాఉండగా సోమవారం మధ్యాహ్న భోజన సమయంలో సదరు బాలికను కారులో ఎక్కించుకున్న శ్రీశైలం.. సంగారెడ్డి వైపు వెళ్లినట్లు తోటి విద్యార్థులు హెచ్ఎంకు తెలిపారు. దీంతో హెచ్ఎం అతనికి ఫోన్ చేయగా స్పందించలేదు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పాఠశాల ఉపాధ్యాయులతో పాటు, యువకుడి కుటుంబీకులు పలుమార్లు ఫోన్‌చేసి ప్రశ్నించడంతో తాము వికారాబాద్‌లో ఉన్నామని సంగారెడ్డి వస్తున్నట్లు తెలిపాడు. అప్పటికే యువకుడి కుటుంబీకులు కొందరు వారిని వెతుక్కుంటూ వచ్చారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో కొత్తగడి వద్ద వీరు ఎదురుపడ్డారు. అప్పటికే ఇద్దరూ పురుగుల మందు తాగినట్లు గుర్తించి వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే శ్రీశైలం బలవంతంగా పురుగుల మందు తాగించాడని బాలిక తెలిపింది. యువకుడి పరిస్థితి బాగానే ఉందని, బాలిక పరిస్థితే కొంత విషమంగా ఉన్నట్లు సమాచారం. బాలిక తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలియడంతోనే ఆమెకు ఎక్కువ మొత్తంలో పురుగుల మందు తాగించి.. శ్రీశైలం కొంతే తాగినట్లు తెలిసింది. -
అధికారుల వేధింపులు తాళలేక
కార్మికుడి మృతి మున్సిపల్ కార్యాలయం గేటుకు తాళం వేసిన కార్మికులు ఇన్చార్జి కమిషనర్‌పై పోలీసులకు ఫిర్యాదు చైర్పర్సన్ హామీతో ఆందోళన విరమణ సంగారెడ్డి మున్సిపాలిటీ: అధికారుల వేధింపుల తాళలేకనే కాంట్రాక్ట్ కార్మికుడు కల్వకుంట కుమార్(32) మృతి చెందాడని, అందుకు బాధ్యుడైన ఇన్చార్జి కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం గేటుకు తాళం వేసి ఆందోళనకు దిగారు. శుక్రవారం ఉదయం 9 గంటలకే కార్మికులు విధులను బహిష్కరించి మున్సిపాలిటీకి చేరుకున్నారు. రెండు నెలల క్రితం విధులకు సమయానికి హాజరు కాలేదని ఇన్చార్జి కమిషనర్ మధు ఇచ్చిన నివేదిక ఆధారంగా పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కల్వకుంట కుమార్(32)ను కలెక్టర్ విధుల నుంచి తొలగించారు. అయితే కుమార్‌పైనే అతడి కుటుంబం ఆధారపడి ఉందని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మున్సిపల్ పాలకవర్గం తీర్మానం చేసింది. అయినా అతడిని విధుల్లోకి తీసుకోలేదు. గురువారం సైతం కుమార్ రాజంపేట పంప్‌హౌస్‌కు వచ్చిన జిల్లా అధికారిని కలిసి తనను విధుల్లోకి తీసుకోవాలని కోరాడు. తాను మున్సిపాలిటీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోలేనని సదరు అధికారి సమాధానం ఇచ్చారు. దీంతో కుమార్ అక్కడి నుంచి ఆవేదనగా తిరిగి ఇంటికి వెళ్లాడు. రాత్రి చాతిలో నొప్పి వస్తోందని కుమార్ తెలపడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కుమార్ అర్ధరాత్రి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు కమిషనర్ వేధింపుల వల్లే కుమార్ మృతి చెందాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సుమారు 4గంటల పాటు కార్యాలయ ప్రధాన గేటుకు తాళం వేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చెర్‌పర్సన్ విజయలక్ష్మీ అక్కడికి చేరుకొని మృతి చెందిన కుమార్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. దీంతో కార్మికులు ఆందోళన విరమించారు. ఇదిలా ఉంటే కాంట్రాక్ట్ కార్మికుడు కుమార్ మృతికి కారణమైన జిల్లా పరిషత్ సీఈవో, ఇన్చార్జి కమిషనర్‌పై మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. కుమార్ దహన సంస్కారాల కోసం చైర్పర్సన్ విజయలక్ష్మి రూ.10వేలు అందజేశారు. కార్మికులు ఆందోళన చేస్తున్నా ఇన్చార్జి కమిషనర్ రాకపోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్చార్జి కమిషనర్‌పై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.