సాక్షి,సిటీబ్యూరో/సుల్తాన్‌బజార్ : మయూర్ పాన్‌షాప్‌ల యజమాని కుమారుడు ఉపేంద్ర వర్మ చేతిలో మోసపోయినట్లు కాచిగడూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శనివారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తనకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంపై ఆమె ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్ ద్వారా 2013లో పరిచయమైన బాధితురాలిని ఉపేంద్ర వర్మ 2017లో వివాహం చేసుకున్నాడు. అప్పటికే వివాహితుడైన విషయం దాచి ఆమెతో హనీమూన్‌కు వెళ్ళివచ్చాడు. ఆపై అసలు విష యం చెప్పడంతో పాటు తన వద్ద ఉన్న ఆమెకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత వీడియోలు, ఫొటో లు ఇంటర్‌నెట్‌లో పెడతానని బెదిరించాడు.
దీంతో బాధితురాలు కాచిగూడ పోలీసులకు ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం ఉపేంద్ర వర్మతో పాటు అతడికి సహకరించిన మరో ముగ్గురు స్నేహితుల్ని అరెస్టు చేశారు. ఇది జరిగిన తర్వాత ఉపేంద్ర వర్మతో బాధితురాలు ఉన్న అనేక ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఆమె శనివారం సైబర్ క్రైమ్ పోలీసులు ఆశ్రయించారు. వీటిని పోస్ట్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.
పాన్‌షాప్ ముట్టడి
యువతులపై అత్యాచారాలకు పాల్పడుతున్న ముయూరి పాన్‌షాప్ యజమాని ఉపేందర్‌వర్మను ఉరి తీయాలని అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి శీలం సరస్వతీ డిమాండ్ చేశారు. శనివారం శీలం సరస్వతి ఆధ్వర్యంలో బొగ్గులకుంటలోని మయూరి పాన్‌శాప్‌ను మహిళ సంఘం నాయకులు ముట్టడించారు. ఉపేందర్‌వర్మను ఉరితీసి, దుకాణాన్ని సీజ్ చేయాలని ప్లకార్డులు ప్రదర్శించి ధర్నాకు దిగారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రాధిక, శోభ, శారద, నాగమణి, లత, ఆర్‌ఎ. వినోద్‌కుమార్, శ్రావణి, పద్మ, నికాత్‌బేగం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment