పాన్‌షాపులో మరోసారి చోరీ | Pan shop Theft By Unknown Persons Second Time Happend In The Same Shop In Thanduru | Sakshi
Sakshi News home page

పాన్‌షాపులో మరోసారి చోరీ

Published Mon, Mar 11 2019 1:24 PM | Last Updated on Mon, Mar 11 2019 1:24 PM

Pan shop Theft By Unknown Persons Second Time Happend In The Same Shop In Thanduru - Sakshi

చోరీకి గురైన జీషాన్‌ పాన్‌షాప్‌

సాక్షి, తాండూరు టౌన్‌: పాన్‌షాపులో చోరీ జరిగింది. ఈ ఘటన శనివారం రాత్రి తాండూరు పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. తాండూరు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తాండూ రు ఇందిరానగర్‌కు చెందిన ఎండీ అస్లాం స్థానిక లారీ పార్కింగ్‌ వద్ద జీషాన్‌ పాన్‌మహల్‌ పేరుతో పాన్‌షాపు నడుపుతున్నాడు. రోజూ మాదిరిగానే షాపు తెరిచేందుకు వెళ్లిన అస్లాం షాపులో చోరీ జరిగినట్లు గుర్తించారు. పాన్‌షాపు రేకును కట్‌ చేసి చొరబడిన దొంగలు రూ. 10 వేల నగదుతో పాటు, సుమారు రూ.35వేల విలువైన సిగరెట్‌ ప్యాకెట్లు, ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారని అస్లాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే ఇదే తరహాలో గతేడాది అక్టోబర్‌లో కూడా అస్లాం పాన్‌షాపులో చోరీ జరిగింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement