Thanduru
-
‘ఈటల కోసం ప్రచారం చేస్తా’
తాండూరు టౌన్: రానున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మాజీమంత్రి ఈటల రాజేందర్ తరఫున ప్రత్యక్షంగా ప్రచారం చేస్తానని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసైనా అక్కడ విజయం సాధించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. శనివారం వికారాబాద్ జిల్లా తాండూరులో విలేకరులతో మాట్లా డారు. కేసీఆర్, కేటీఆర్ కలసి రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు విప్పేస్థితిలో లేరని, టీఆర్ఎస్లో కట్టుబానిసత్వం కొనసాగుతోందని అన్నారు. తండ్రీ, కొడుకులను ఎదిరించే వారిని అణచివేస్తు న్నారని, అది ఈటల వ్యవహారంతో బట్టబయలైందని పేర్కొన్నారు. తాను ఇంకా ఏ పార్టీలోకి వెళ్లాలనేది నిర్ణయించుకోలేదని, టీఆర్ఎస్ను మంత్రి హరీశ్‌రావు వంటి వారికి అప్పగిస్తే మళ్లీ అందులో చేరేందుకు తాను సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. సుస్థిరాభివృద్ధిలో ఏపీ 3వ స్థానంలో ఉండగా, తెలంగాణ మాత్రం 11వ స్థానంలో ఉందని తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో గత ఆరేళ్లుగా చివరిస్థానాల్లోనే ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్లపై టిఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, పంటలు వానలపాలై రైతులు గగ్గోలు పెడుతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ బడా నేతల అక్రమాలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టు రఘును అరెస్టు చేసి జైలుకు పంపడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. చదవండి: ఆత్మగౌరవ బావుటా ఎగురవేస్తా -
స్వయంగా బావిలోకి దిగి శవాన్ని వెలికి తీసిన ఎస్ఐ
తాండూరు రూరల్: ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ యువకుడు దుర్మరణం చెందగా.. ఎస్ఐ స్వయంగా బావిలోకి దిగి మృతదేహాన్ని వెలికి తీశారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కొత్లాపూర్‌లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కొత్లాపూర్‌కు చెందిన రాయిపల్లి నర్సింహులు (30) హోలీ సంబరాల అనంతరం స్నానం చేసేందుకు ఓ బావి వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు అతడు అందులో పడి మృతి చెందాడు. అయితే, నీరు ఎక్కువగా ఉండటం, పురాతనమైనది కావడంతో గ్రామస్తులెవరూ ఆ బావిలోకి దిగేందుకు ముందుకు రాలేదు. దీంతో కరన్‌కోట్ ఎస్ఐ ఏడుకొండలు నడుముకు తాళ్లు కట్టుకొని స్వయంగా బావిలోకి దిగి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. దీంతో గ్రామస్తులు ఎస్సైని చప్పట్లతో అభినందించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. చదవండి: యూనిఫామ్‌లోనే ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య సైబర్ నేరగాళ్ళు.. పోలీసులకే టోకరా! -
రోహిత్‌రెడ్డికి ఇదే ఆఖరి పదవి
తాండూరు: తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి జీవితంలో ఇదే ఆఖరి పదవిగా మిగిలిపోనుందని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి జోస్యం చెప్పారు. బుధవారం తాండూరు పట్టణంలోని అంబేడ్కర్చౌక్వద్ద ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి రాజీనామా చేయాలంటూ చేపట్టిన రిలేనిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. తాండూరు మండల కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు రాజ్‌కుమార్ ఆద్వర్యంలో మండలానికి చెందిన నాయకులు చేపట్టిన ఈ దీక్షకు ఏఐసీసీ కార్యదర్శి వంశిచంద్రెడ్డి, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీ.రామ్మోహన్‌రెడ్డి, తాండూరు నియోజకవర్గ మాజీ ఇన్చార్జి రమేష్ మహరాజ్ హాజరయ్యి సంఘీభావం తెలిపారు. అనంతరం వంశీచంద్ మాట్లాడుతూ... తాండూరులో మంత్రిగా ఉన్న పట్నం మహేందర్‌రెడ్డిని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడించిందన్నారు. ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన పంజుగుల రోహిత్‌రెడ్డి పార్టీ మారడం తాండూరు నియోజవకర్గం ప్రజలను మోసం చేయడమేనన్నారు. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీ మారిన ఎమ్మెల్యేకు జీవితంలో ఇదే మొదటి, చిట్ట చివరి పదవిగా మిగిలిపోతుందన్నారు. తాండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పుడే రోహిత్‌రెడ్డికి బుద్ధి చెప్పినట్లవుతుందన్నారు. ఆ దిశగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి రాజీనామా చేయాలని చేపట్టిన నిరాహార దీక్షకు ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. తాండూరు ప్రజలను మోసం చేసిన ఎమ్మెల్యే రానున్న రోజుల్లో తగిన శాస్తి కలుగకమానదన్నారు. నిరహరదీక్ష చేస్తున్న రాజ్‌కుమార్, జర్నప్ప, రాఘనాత్రెడ్డి, జెన్నెనాగప్ప, శివగౌడ్, శివకుమార్‌తో పాటు పలువురు నాయకులకు సాయంత్రం జూస్ తాగించి దీక్షను విరమింపచేయించారు. ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గ మాజీ ఇన్చార్జి రమేష్, పార్టీ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు ఉత్తంచంద్, తాండూరు పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌గౌడ్, మా జీ మున్సిపల్ వైస్ చైర్మన్ అలీం, తాండూరు మం డల మాజీ అధ్యక్షుడు హేమంత్‌కుమార్, మాజీ కౌన్సిలర్ లింగదల్లిరవికుమార్, నాయకులు జనార్ధన్‌రెడ్డి, కల్వ సుజాత తదితరులున్నారు. -
కారు గుర్తు నాదే.. కాదు.. నాదే!
తాండూరు: తాండూరు మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ఇంకా తేలకముందే అప్పుడే అధికార పార్టీ శ్రేణుల్లో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ఆశవహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చైర్మన్ అభ్యర్థిత్వం మొదలుకోని కౌన్సిలర్ స్థానం వరకు అధికారపార్టీలో నాయకుల మద్య పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. చైర్మన్ పదవికోసం ఇద్దరు బలమైన నేతలు పోటీ పడుతున్నారు. అయితే ఇద్దరి మధ్య సాగుతున్న పోరుతో విసుగుచెందిన గులాబీబాస్‌లు చైర్మన్ అభ్యర్థి పేరు ప్రకటించకుడానే ఎన్నికల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్టు భోగట్టా. 29 వరకు కౌంటర్ దాఖలు చేయండి.. మున్సిపల్ వార్డుల విభజన సక్రమంగా జరగలేదని పలు పార్టీలు కోర్టును ఆశ్రయించాయి. సోమవారం మున్సిపల్ ఎన్నికలపై ప్రభుత్వ, ప్రతిపక్ష లాయర్ల వాదనలు విన్న హైకోర్టు ఈనెల 29వ తేదీ వరకు మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కౌంటర్ దాఖలు చేయాలని తీర్పు వెలువరించింది. దీంతో అన్ని మున్సిపాలిటీలతో పాటు తాండూరు మున్సిపాలిటీకి కూడా అప్పటి వరకు తాత్కాలిక బ్రేక్ పడినట్లయ్యింది. అయితే ఎన్నికలపై తీర్పు వెలువడే వరకు ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తోందా.. లేదా అనేది స్పష్టత లేదని అధికార వర్గాలు అంటున్నాయి. చైర్మన్ అభ్యర్థి పేరు ప్రకటించకుండానే ఎన్నికల్లోకి..! తాండూరు మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి పేరు ప్రకటించకుండానే ఎన్నికలలోకి వెళ్లనున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వర్గం నుంచి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గం నుంచి చైర్మన్ పీఠం కోసం పోటీ పడుతున్నారు. అయితే మరికొంత మంది నాయకులు చైర్మన్ రేసులో తమ పేర్లను పరిశీలించాలని పార్టీ నేతల వద్దకు వెలుతున్నారు. దీంతో పదవికోసం పోటీ తీవ్రం అయింది. ఈ విషయం గులాబీ బాస్‌లకు తలనొప్పిని తెప్పిస్తోంది. దీంతో మున్సిపల్ ఎన్నికలలో తాండూరులో చైర్మన్ అభ్యర్థి పేరు ప్రకటించకుండా కౌన్సిలర్లతోనే ఎన్నికలకు వెళ్లాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కౌన్సిలర్ టికెట్ కోసం తీవ్ర పోటీ.. తాండూరు మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల్లో టీఆర్స్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్క వార్డులో పార్టీ నుంచి పోటీ చేసేందుకు 10 మంది వరకు ముందుకు వస్తున్నారు. బీ–ఫామ్‌లు ఇద్దరు నేతల్లో ఎవరి చేతికి అందుతాయోనని పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. మిగతా పార్టీలలో మాత్రం ఎన్నికల టెన్షన్ ఏమాత్రం లేకుండా ముందుకు వెళ్తున్నారు. -
భార్యపై అనుమానం..కూతురి హత్య
తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం చోటుచేసుకుంది. కన్న తండ్రే కూతురిపాలిట యముడయ్యాడు. భార్యపై అనుమానం పెంచుకుని కన్న కూతురిని హత్య చేశాడు. కర్ణాటక రాష్ట్రం బీదర్ ప్రాంతానికి చెందిన రాజు స్థానికంగా నివాసం ఉంటూ కోనాపూర్‌లోని శ్రీ లక్ష్మీ నరసింహ పాలిష్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. ఆయనకు ఐదేళ్ల కూతురు ఉంది. ఇటీవల తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. కూతురు తనకు పుట్టలేదని అనుమానంతో ఆ చిన్నారిని చంపి సుద్ధగని గుంతలో పడేశాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాన్‌షాపులో మరోసారి చోరీ
సాక్షి, తాండూరు టౌన్: పాన్‌షాపులో చోరీ జరిగింది. ఈ ఘటన శనివారం రాత్రి తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తాండూరు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తాండూ రు ఇందిరానగర్‌కు చెందిన ఎండీ అస్లాం స్థానిక లారీ పార్కింగ్ వద్ద జీషాన్ పాన్‌మహల్ పేరుతో పాన్‌షాపు నడుపుతున్నాడు. రోజూ మాదిరిగానే షాపు తెరిచేందుకు వెళ్లిన అస్లాం షాపులో చోరీ జరిగినట్లు గుర్తించారు. పాన్‌షాపు రేకును కట్ చేసి చొరబడిన దొంగలు రూ. 10 వేల నగదుతో పాటు, సుమారు రూ.35వేల విలువైన సిగరెట్ ప్యాకెట్లు, ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారని అస్లాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే ఇదే తరహాలో గతేడాది అక్టోబర్‌లో కూడా అస్లాం పాన్‌షాపులో చోరీ జరిగింది. -
సుముహూర్తం..మోగనున్న పెళ్లి బాజాలు
వికారాబాద్ అర్బన్ : అధిక జేష్ఠమాసం ఈ నెల 15వ తేదీతో ముగిసింది. దీంతో గత పది రోజులుగా పలు శుభకార్యాలు కొనసాగుతున్నా.. పెళ్లిళ్లకు అనువైన మూహూర్తాలు మాత్రం దొరకలేదు. ఈ నెల 27, 30వ తేదీల్లో వివాహాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో వధూవరుల తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు. జూలై 15 నుంచి ఆషాఢ మాసం రానున్న నేపథ్యంలో ఆగస్టు 15వ తేదీ వరకు ముహూర్తాలు ఉండవు. దీంతో జూలై మొదటి వారంలోనే పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తీపి గుర్తుగా... మనిషి జీవితంలో ఒకే సారి చేసుకునే పండుగ పెళ్లి. ఈ మూడు ముళ్ల బంధం, తలంబ్రాల కోలాహలం, ఏడు అడుగల నడక.. వందేళ్ల తీపి గుర్తులుగా ఉండిపోవాలని వధూవరులు, తల్లిదండ్రులు ఆశిస్తారు. ఈ సంబరాన్ని ఎప్పుడైనా చూసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే ఎంత ఖర్చయినా వెనకాడకుండా ఫొటోగ్రఫీ, వీడియోలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకోసం ఒక్కొక్కరు తమ స్థాయిని బట్టి రూ.30 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు. ఇటీవల కొందరు డ్రోన్ కెమెరాలతో పెళ్లి వేడుకలను చిత్రీకరిస్తున్నారు. గాలిలో తేలియాడుతూ అత్యంత క్వాలిటీగా ఫొటోలు, వీడియోలు తీస్తుండటంతో డ్రోన్ కెమెరాలకు ఆదరణ పెరిగింది. పెళ్లి మండపంలోనే రెండు, మూడు స్క్రీన్లు ఏర్పాటు చేసి పెళ్లి వేడుకను దగ్గరగా చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఇలాంటి ఏర్పాట్లు పెద్దపెద్ద పట్టణాల్లో, ధనికుల పెళ్లి వేడుకల్లో కనిపించేవి. ఇప్పుడు వికారాబాద్, తాండూరు, పరిగి లాంటి చిన్నచిన్న పట్టణాల్లో సందడి చేస్తున్నాయి. మండపాలకు డిమాండ్... పెళ్లి వేడుకలను వైభవంగా చేయాలంటే పెళ్లి మండపాలను ఆశ్రయించాల్సిందే. అక్కడైతేనే అతిథులకు అన్ని రకాల సౌకర్యాలు, విశాలమైన స్థలం ఉంటుంది. ఇందుకోసం పెళ్లి పెద్దలు ఎంత ఖర్చుకైనా వెనకాడటం లేదు. దీంతో పెళ్లి మండపాలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. రెండు నెలల ముందు బుక్ చేసుకుంటే కానీ ఫంక్షన్ హాల్ దొరికే పరిస్థితి లేదు. దీంతో పాటు, డెకరేషన్, క్యాటరింగ్, వీడియో, ఫొటోగ్రాఫర్లను సైతం ముందుగానే బుక్ చూసుకోవాలి. శ్రావణమాసం, భక్తిమాసం... హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భా వించేది శ్రావణమాసం. ఈ మాసంలో అత్యధిక మంది భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు, భజ నలు, దీక్షలు చేస్తారు. ఈ నెల మొత్తం చాలా మంది మాంసాహారానికి దూరంగా ఉంటా రు. ఆగస్టు 14వ తేదీ నుంచి శ్రావణ మాసం రానుంది. ఆగస్టు మాసంలో దివ్య మైన మూహూర్తాలు ఉన్నట్లు పురోహితులు చెబుతున్నారు. శ్రావణమాసం పండుగలకు, శుభకార్యాలకు అనువైన మాసం కావడంతో పెళ్లిళ్ల వేడుకలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. మంచి రోజులు.. గత నెల రోజులుగా శుభగడియల కోసం ఎదురు చూసిన వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పెళ్లి వేడుకలను జరిపించేందుకు రెడీ అవుతున్నారు. జూన్‌లో కొన్ని సుముహూర్తాలు ఉండటంతో నూతన గృహప్రవేశం, పిల్లలకు పుట్టు పంచలు వంటి కార్యక్రమాలు చేశారు. నేటి బుధవారంతో పాటు ఈ నెల 30వ తేదీన మంచి ముహూర్తాలు ఉండటంతో ఫంక్షన్ హాళ్లు ఇప్పటికే బుక్ అయిపోయాయి. జూలై మాసంలో 1, 5, 6, 7తేదీల్లో మంచి గడియలు ఉన్నాయని పురోహితుడు వైభవలక్ష్మి ఆలయ అర్చకుడు అంబదాస్ తెలిపారు. ఆగస్టు మాసంలో 15, 16, 17, 18, 19, 23, 24, 29, 30, 31వ తేదీల్లో, సెప్టెంబర్ 2, డిసెంబర్ 12, 14, 21, 22, 27, 28, 29, 30వ తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నట్లు చెప్పారు. తిరిగి 2019 ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మంచి ముహూర్తాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. -
చెత్త వేస్తే.. ఫైన్ కట్టాల్సిందే!
తాండూరు : పారిశుద్ధ్యంపై మున్సిపల్ యంత్రాంగం కఠిన నిర్ణయం తీసుకోనుంది. వీధిలో చెత్త వేసినట్లు కనిపించిన వారికి జరిమానా వేసేందుకు మున్సిపాలిటీ సిద్ధమవుతోంది. జులై నుంచి మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్యంలో కొత్త నిబంధనలు అమలుచేసేందుకు సిద్ధమవుతున్నారు. వ్యాపారస్తులకు రూ.5 వేలు, నివాస గృహాలకు రూ.500 జరిమానా వేయనున్నారు. తాండూరు మున్సిపల్ పరిధిలో 31 మున్సిపల్ వారుల్లో 12వేల నివాస గృహాలున్నాయి. మొత్తం సూమారు 65 వేల జనాభా ఉంది. మున్సిపల్ పరిధిలో ఉన్న వార్డులలో పారిశుద్ధ్యం రోజురోజుకు అధ్వానంగా మారుతోంది. వార్డుల్లోని ప్రజలకు ఇళ్లలో నుంచి చెత్తను వీధుల్లో వేయకూడదని మున్సిపల్ సిబ్బంది పలుమార్లు అవగహన కల్పించారు. గతేడాది నవంబర్, డిసెంబర్ నెలలతో పాటు ఈ ఏడాది జనవరి నెలలో స్వచ్ఛ సర్వేక్షన్ పథకానికి ఎంపికయ్యేందుకు వార్డులలోని ప్రజలకు అవగహన కల్పించారు. అయినా పారిశుద్ధ్యంపై ప్రజల్లో ఎలాంటి మార్పు రాలేదు. వార్డుల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడంతో ప్రధాన రోడ్డు అపరిశుభ్రంగా కనిపిస్తోంది. అయినా ఈ మార్గంలోని దుకాణదారులు రోడ్డుపై చెత్త వేస్తున్నారు. దీంతో కాలనీలు, మార్గాలు చెత్తమయంగా మారుతున్నాయి. తడి చెత్త కారణంగా పారిశుద్ధ్యం లోపిస్తుంది. చెత్తను పారిశుద్ధ్య కార్మికులు సేకరిస్తారని అధికారులు పలుమార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో పారిశుద్ధ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు చర్యలకు ఉపక్రమించారు. చెత్త వేస్తే జరిమానా.. మున్సిపల పరిధిలో ఇష్టారాజ్యంగా వీధుల్లో, ప్రధాన రోడ్డు మార్గాల్లో చెత్త వేస్తున్న వారిపై జరిమానా వేసేందుకు సిద్ధమయ్యారు. సెక్షన్ 336 మున్సిపల్ చట్టం ప్రకారం మున్సిపల్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే చర్యలు తీసుకునే అవకాశం కల్పించింది. అందులో భాగంగా వ్యాపారస్తులు చెత్తను రోడ్లపై వేస్తే రూ.500 నుంచి రూ.5000 వరకు జరిమానా విధించేందుకు అధికారాలు ఇచ్చింది. నివాస గృహాలకు రూ.50 నుంచి రూ.500 వరకు చెత్త వేసిన వారిపై జరిమానా విధించనున్నారు. అందుకోస మున్సిపల్ అధికారులు నోటీసులను ముద్రించారు. జులై నుంచి ఈ నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. స్వచ్ఛతగా మార్చేందుకే.. తాండూరు మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో ఇష్టానుసారంగా చెత్త వేస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు వార్డు ప్రజలకు చెప్పినా ప్రయోజనంలేదు. వ్యాపారస్తులు రాత్రి సమయాల్లో రోడ్లపైనే చెత్త వేసి వెళ్తున్నారు. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేస్తున్న వ్యాపారులపై, నివాస గృహాల ప్రజలకు జరిమానా వేస్తాం. తీరు మారకపోతే మున్సిపల్ చట్టం ప్రకారం కేసు పెట్టి కోర్టుకు పంపిస్తాం. – విక్రంసింహారెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్,తాండూరు -
ఆర్టీఏ కార్యాలయం అవినీతిమయం
తాండూరు : తాండూరులో నిబంధనలకు విరుద్ధంగా లారీల ద్వారా ఓవర్ లోడ్ రవాణా సాగిస్తున్నారు. తాండూరు ప్రాంతం నుంచి నిత్యం 2వేలకు పైగా లారీలు నాపరాతిని ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటాయి. ఇందుకోసం రాయల్టీ ఫీజు కింద ఒక్కో వాహనానికి రూ.2 వేలు చెల్లించాలి. కానీ అధికారుల నిఘా లేక పోవడంతో రాయల్టీ చెల్లించకుండా పెద్దసంఖ్యలో లారీలు సరిహద్దులు దాటివెళ్తున్నాయి. ఓవర్ లోడ్‌తో సాగుతున్న ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ట్రాన్స్‌పోర్టు నిర్వాహకుల వద్ద పర్సెంటీలు తీసుకుంటున్న రవాణా శాఖ అధికారులు.. అక్రమంగా రాకపోకలు సాగిస్తున్న వాహనాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇందుకు కృతజ్ఞతగా ప్రతినెలా రూ.లక్షల్లో ముడుపులు అందుకుంటున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి నియోజకవర్గంలోనే సాగుతున్న వ్యవహారంపై విమర్శలు వస్తున్నాయి. తాండూరు పట్టణం జిల్లాలోనే ప్రధాన వ్యాపార కేంద్రంగా కొనసాగుతోంది. స్థానికంగా నాపరాయి, సుద్ద, ఎర్రమట్టి భూగర్భ నిక్షేపాలున్నాయి. తాండూరులో సిమెంట్ కర్మాగారాలు, నాపరాతి పాలిషింగ్ యూనిట్లు ఉండటంతో నిత్యం రూ.కోట్లలో వ్యాపారం, లావాదేవీలు జరుగుతాయి. తాండూరు నుంచి నిత్యం సిమెంట్, సుద్ద, నాపరాతి, నిత్యావసర సరుకుల రవాణా పెద్దఎత్తున జరుగుతోంది. 2 వేల వరకు లారీలు ప్రతిరోజూ ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తాయి. ఇందుకోసం ప్రతినెలా రవాణా శాఖ నేషనల్ పర్మిట్ వాహనాలకు రూ.3,500, లోకల్ లారీలకు రూ.2,500 వసూలు చేస్తున్నారు. ఆర్టీఏ శాఖ అధికారులు మధ్యవర్తులతో కలిసి ఈ తంతంగాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తాండూరులోని లారీ పార్కింగ్ ఏరియాలో ప్రత్యేక ట్రాన్స్‌పోర్టులు వెలిశాయి. వీటి ద్వారా నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి ఓవర్‌లోడ్‌తో రాకపోకలు సాగిస్తున్నారు. ట్రాన్స్‌పోర్ట్‌ల నిర్వాహకుల నుంచి క్రమం తప్పకుండా మామూళ్లు తీసుకుంటున్న కారణంగా రవాణాశాఖ అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి రూ.లక్షల్లో గండి పడుతోంది. బ్రోకర్లదే హవా.. తాండూరులోని రవాణా శాఖ కార్యాలయం వారానికి రెండు రోజులు మాత్రమే సేవలు అందుతాయి. దీంతో ఈ రెండు రోజులు ఆఫీసు సందడిగా ఉంటుంది. ఆన్లైన్ ద్వారానే ఆర్టీఏ సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం ఓ వైపు ప్రకటనలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటోంది. ఆన్లైన్లో లైసెన్స్ పొందాలనుకునే వారికి ఆరు నెలల పాటు తిరిగినా కూడా పని పూర్తి కాదు. ఈ తలనొప్పి ఎందుకని భావిస్తున్న జనాలు రూ.వెయ్యి అదనంగా పెట్టి పని పూర్తి చేసుకుంటున్నారు. కార్యాలయం ఎదుట మధ్యవర్తులు దుకాణాలు ఏర్పాటు చేసుకొని ఆర్టీఏ ద్వారా లభ్యమయ్యే ధ్రువీకరణ పత్రాలకు ఒక్కోదానికి ఒక్కొ రేటు నిర్ణయించి.. వసూలు చేసి పంచుతున్నారు. దీనిపై అడిగేం దుకు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆపీసర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు. డబ్బులిస్తేనే పని తాండూరు పట్టణంలో ఏర్పాటు చేసిన ఆర్టీఏ కార్యాలయంలో లైసెన్స్ పొం దాలన్నా, కొత్త వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న ప్రభుత్వ ఫీజుతో పాటు అ దనంగా చెల్లించాల్సిందే. లేదంటే ఒకటికి ప దిసార్లు తిరిగినా పనికాదు. మధ్యవర్తులను ఆశ్రయిస్తే చటుక్కున పని అయిపోతుంది. నేరుగా వెళ్లి రూల్స్ మాట్లాడితే.. అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. – బాబు వారణాసి,తాండూరు -
తాండూరులో పొంగి ప్రవహిస్తున్న కాగ్నా వాగు
తాండూరు : ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రంగారెడ్డి జిల్లా తాండూరులో కాగ్నా వాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో తాండూరు - కొడంగల్ మార్గంలో వాహన రాకపోకలు స్తంభించాయి. పోలీసులు వెంటనే స్పందించి... ఆ మార్గంలో నిలిచిన వాహనాలను మరో మార్గం ద్వారా దారి మళ్లించారు. -
'గ్రామాల్లో బెల్టుషాపులను నియంత్రించండి'
తాండూరు రూరల్ (రంగారెడ్డి జిల్లా) : గ్రామాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్టు షాపులను నియంత్రించాలని మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు శకుంతల సోమవారం ప్రజాదర్బార్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ.... గ్రామాల్లో బెల్టుషాపులు నియంత్రించాలని గతంలో అనేకసార్లు వికారాబాద్ సబ్‌కలెక్టర్, ఎక్సైజ్ అధికారులను కోరినా పట్టించుకోలేదన్నారు. ఈ బెల్టుషాపుల వలన గ్రామాల్లోని ప్రజలు మద్యం మత్తులో తూగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం తాగి విచక్షణ కొల్పోయి అనేక నేరాలు జరిగాయన్నారు. మొన్నటికి మొన్న యాలాల మండలం అచ్యుతాపూర్‌లో ఓ మతిస్థిమితంలేని అమ్మాయిపై అత్యాచారం చేశారన్నారు. అలాగే తాండూరు మండలం మల్కాపూర్‌లో మద్యం మత్తులో ఓ భర్త గొడ్డలితో భార్యను హత్య చేశారని శకుంతల గుర్తుచేశారు. గ్రామాల్లో కొనసాగుతున్న బెల్టు షాపులను అధికారులు నియంత్రించాలని...లేదంటే మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని ఆమె హెచ్చరించారు. మహిళలపై ఇన్ని సంఘటనలు జరిగినా అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం సరికాదన్నారు. వినతిపత్రం సమర్పించిన వారిలో గౌతపూర్ ఉప సర్పంచు హాకిం, వార్డు సభ్యులు నర్సిములు, గ్రామస్తులు వెంకట్‌స్వామి, బాలయ్య, మహేష్, నర్సింహారెడ్డిలు పాల్గొన్నారు. -
'సారా తయారుచేస్తే పీడీ యాక్ట్'
తాండూరు (రంగారెడ్డి) : సారా తయారు చేసినా, విక్రయించినా పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని రాజేంద్రనగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ దశరథ్ అన్నారు. మంగళవారం తాండూరులో సారా తయారీ, విక్రయాల నియంత్రణపై సమీక్షా సమావేశం జరిగింది. దీనికి హాజరైన సందర్భంగా దశరథ్ మాట్లాడారు. అక్టోబర్ నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుందని, ఆ లోపే సారా తయారీని పూర్తిగా అరికడతామని చెప్పారు. అక్టోబర్ నుంచి చౌక మద్యం అందుబాటులోకి రానుందని, జిల్లాల్లో కొత్తగా 10 బార్లు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. -
మరో ఉద్యమానికి సిద్ధం
తాండూరు టౌన్, న్యూస్‌లైన్: అసెంబ్లీకి వచ్చిన తెలంగాణ బిల్లుపై చర్చకు గడువు పొడిగిస్తే ఊరుకునేది లేదని.. మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతామని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం స్పష్టంచేశారు. గురువారం తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో తాండూరులో ఏర్పాటుచేసిన ‘సంపూర్ణ తెలంగాణ సాధన సదస్సు’లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. చర్చకు గడువు కోరి.. తెలంగాణ బిల్లును పార్లమెంటు సమావేశాల సమయానికి పంపించకూడదనే సీమాంధ్రులు కుట్ర పన్నుతున్నారన్నారు. తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత దానిని ఆపాలనే కుట్రలు పన్నుతున్న సీమాంధ్ర నాయకులు తెలంగాణ ప్రజల హక్కులను కాలరాస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు చర్చ జరగాలని పట్టుబడుతున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ బిల్లు ప్రతులను భోగి మంటల్లో వేసి ఇక్కడి ప్రజల మనోభావాలను గాయపరిచారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ రెండేళ్లు సరిపోతుందని, పదేళ్లు అవసరం లేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ సీమాంధ్రుల ఆస్తులను గానీ, వారిైపై గానీ ఉద్యమకారులు దాడులు చేయలేదని, అలాంటప్పుడు శాంతిభద్రతల విషయం గవర్నర్‌కు అప్పగించడం సమంజసమా అని ప్రశ్నించారు. ఒకప్పుడు తెలంగాణ ఏర్పాటుకు తాము అడ్డంకి కాదని, ఇస్తే ఇవ్వండని చెప్పిన కొన్ని పార్టీలు ప్రస్తుతం తమ మనుగడ కోసమే కొత్త నాటకాలాడుతున్నాయన్నారు. ఎవరెన్ని చెప్పినా తెలంగాణ రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తంచేశారు. సామాజిక విశ్లేషకులు గంటా చక్రపాణి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో నిరంతరం కృషిచేసిన వారే తెలంగాణ పునర్నిర్మాణంలో పాత్రులవుతారని అన్నారు. మరో నెల రోజుల్లో తెలంగాణ రావడం ఖాయమన్నారు. మంత్రి జైపాల్‌రెడ్డి ఇప్పటికైనా ధైర్యంగా ముందుకు వచ్చి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చే యాలని ఆయన కోరారు. అనంతరం ఆయన తెలంగాణ విద్యావంతుల వేదిక డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. సాయిచంద్ ధూంధాం కార్యక్రమం తెలంగాణ వాదులను ఉర్రూతలూగించింది. కార్యక్రమంలో టీవీవీ , టీఆర్ఎస్, బీజేపీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, వైద్య జేఏసీల నాయకులు పాల్గొన్నారు. -
తాండూరుకు కర్ణాటక ‘మత్తు’
తాండూరు, న్యూస్‌లైన్: ఆంధ్రా- కర్ణాటక సరిహద్దు మీదుగా మత్తు పదార్థాలు, కర్ణాటక మద్యం రవాణా జోరుగా సాగుతోంది.సరిహద్దులో నిఘాను పటిష్టం చేస్తామని తాండూరు పర్యటనలో చెప్పే ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఆచరణలో విఫలమవుతున్నారు. ఏం జరుగుతోంది..? సరిహద్దు ప్రాంతం మీదుగా కర్ణాటక మద్యం(నాన్ పెయిడ్ డ్యూటీ) బాటిళ్లు, నిషేధిత మత్తు పదార్థాలైన క్లోరల్ హైడ్రే ట్ (సీహెచ్), డైజోఫాం, అల్ఫాజోలం తదితరాల అక్రమ రవాణాను నిరోధించేందుకు దాదాపు ఐదేళ్ల క్రితం బోర్డర్ మొబైల్ పెట్రోలింగ్ పార్టీ(బీఎంపీపీ)ని అధికారులు ఏర్పా టు చేశారు. దానిని ఇప్పుడు అధికారులు ఎత్తేశారు. ఈ పా ర్టీ ఉన్నప్పుడే తనిఖీలు అంతంత మాత్రం ఉండేవి. ఇప్పుడు మొత్తానికే ఎత్తివేయడంతో ఇంకేముంది స్మగ్లర్లకు వరంగా మారింది. బోర్డర్ మొబైల్ పార్టీకి నేతృత్వం వహించే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్కు మహేశ్వరం సమీపంలోని మద్యం బాటిళ్లు సరఫరా చేసే డిపోలో బాధ్యతలు అప్పగించారని తెలిసింది. దీంతో కర్ణాటక కేంద్రంగా సాగుతున్న నిషేధిత మత్తు పదార్ధాల రవాణాకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. మొబైల్ పార్టీతోపాటు కర్ణాటక-ఆంధ్రా సరిహద్దులో చెక్‌పోస్ట్ లేకపోవడంతో సరిహద్దులోని తాండూరు మండల పరిధిలోని కోత్లాపూర్, బషీరాబాద్ మండలం మైల్వార్, పెద్దేముల్ మండలం తట్టేపల్లి, బంట్వారం మండలం బోపునారం సమీపంలోని కుంచారం మార్గాల మీదుగా క్లోరల్ హైడ్రేట్(సీహెచ్), డైజోఫాం, అల్ఫాజోలం తదితర నిషేధిత మత్తుపదార్ధాల రవాణా సాగుతోంది. అధికారులు ఏం చేశారు..? అధికారులు గత ఏడాది ఆగస్టులోతాండూరు మండలం చెన్‌గేష్‌పూర్ అనుబంధ గ్రామమైన కోనాపూర్‌లో 34.5కిలోల సీహెచ్, గత డిసెం బర్ మొదటి వారంలో పెద్దేముల్ మండలం రచ్చకట్ట తండాలో కర్ణాటక మద్యం (నాన్ పెయిడ్ డ్యూటీ) బాటిళ్లు, తాండూరు పట్టణంలోని శ్రీకాళికాదేవి దేవాలయం సమీపంలో నాలుగున్నర కిలోల డైజోఫాం, పట్టణంలోని శాంతప్ప కాలనీలో మరో 3 కిలోల డైజోఫాం, 2 కిలోల సీహెచ్ స్వాధీనం చేసుకున్నారు. ఎవరు లాభపడుతున్నారు..? సరిహద్దులో నిఘా పూర్తిగా లోపించడంతో తాండూరుకు చెందిన కొందరు బడా వ్యక్తుల కనుసన్నల్లో ఈ దందా ‘మూడు పువ్వులు ఆరుకాయలు’ అన్న చందంగా సాగుతోంది. రూ. లక్షల్లో మత్తుపదార్ధాల వ్యాపారం సాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. మత్తు కోసం కల్లులో నిషేధిత మత్తుపదార్ధాలను కలుపుతూ కల్తీ చేస్తూ జనం ప్రాణాలతో వ్యాపారులు ఆడుకుంటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. బోర్డర్ మొబైల్ పెట్రోలింగ్ లేదనే ధైర్యంతో స్మగర్లు రెచ్చిపోతున్నారు. పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు మాత్రమే అధికారులు హడావిడి చేసి, పాత కేసులతో సంబంధం ఉన్న వారిపై కేసులు నమోదు చేసి చేతులు దులిపేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుంటే ఈ దందాకు బ్రేక్‌కు పడే అవకాశం ఉందని జనం అభిప్రాయపడుతున్నారు. -
ఉద్యోగాల పేరుతో కుచ్చుటోపీ...
తాండూరు టౌన్, న్యూస్‌లైన్: ఉద్యోగాల పేరిట ఓ కంపెనీ నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టింది. 11 మంది నుంచి సుమారు రూ.5.12 లక్షలు వసూలు చేసి కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో మోసపోయామని ఆలస్యంగా గ్రహించిన బాధితులు సోమవారం తాండరు పోలీసులను ఆశ్రయించారు. పట్టణ సీఐ సుధీర్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో ‘బిల్డర్స్ అండ్ డెవలపర్స్’ పేరుతో ఓ కంపెనీ ఉంది. నిరుద్యోగులకు పలు ప్రాంతాల్లో నిర్మాణ రంగంలో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మబలికింది. తాం డూరు, బషీరాబాద్, పెద్దేముల్, కర్ణాటక రాష్ట్రంలోని చించోళి తదితర ప్రాం తాలకు చెందిన కిషన్‌నాయక్, లక్ష్మణ్, తుకారాం, సంతోష్, రాజేందర్, శివ, సువర్ణ, లక్ష్మణ్, శ్రీనివాస్, జనార్ధన్, శ్రీనుల నుంచి రూ. సుమారు రూ. 5.12 లక్షలు వసూలు చేశారు. ఒక్కొక్కరి దగ్గర రూ. 50 వేలకు పైగా దండుకొని రెండు నెలల క్రితం నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు నేడుమాపు అం టూ తిప్పించుకుంటున్నారు. రెం డు రోజుల క్రితం సదరు కంపెనీ యా జమాన్యం బోర్డు తిప్పేశారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సోమవారం తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగాలిప్పిస్తామని డబ్బు లు వసూలు చేసిన హైదరాబాద్‌కు చెందిన నారాయణ, విల్లులపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని బం జారా సంఘం జిల్లా అధ్యక్షుడు విఠల్‌నాయక్, నవాంద్గి పీఏసీఎస్ వైస్ై చెర్మన్ రామునాయక్ పోలీసులను కోరారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వాటాల పర్వం...
తాండూరు/యాలాల, న్యూస్‌లైన్: ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేయడంలో అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. దీంతో సహజ సంపదను అక్రమార్కులు ఇష్టానుసారంగా కొల్లగొడుతున్నారు. యాలాల మండలంలో కాగ్నా నది (వాగు) కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నా అడ్డుకోవడంలో రెవెన్యూ, పోలీసు అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. రెండు శాఖల్లోని కొందరు అధికారుల దన్నుతోనే ఇసుక అక్రమ రవాణాకు బ్రేక్ పడటం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. ఆయా శాఖల్లోని అధికారులకు రోజు, నెలవారీ మామూళ్లను అందజేస్తూ అక్రమార్కులు ఇసుక దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగ్నా నది నుంచి రోజుకు సుమారు 100-150 ట్రాక్టర్లు, 40లారీల ఇసుకను అక్రమంగా తరలిస్తూ అక్రమార్కులు రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి ఇసుక అక్రమ దందాను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ఆచరణలో ఫలితం లేకుండాపోతోంది. క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు ‘మామూళ్ల మత్తు’లో మొక్కుబడిగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదీ ఇసుక దందా తీరు... ఒక ట్రాక్టర్ ఇసుకకు మార్కెట్లో సుమారు రూ.2వేల ధర చొప్పున రోజుకు రూ.3లక్షలు, నెలకు రూ.90లక్షల విలువ చేసే ఇసుక రవాణాతో అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారని తెలుస్తోంది. వికారాబాద్, పరిగి, మన్నెగుడకు చెందిన లారీలు వచ్చి కాగ్నా నుంచి ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నా అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతోన్నాయి. ఒక లారీకి రూ.5వేల చొప్పున రోజుకు రూ.2లక్షలు, నెలకు రూ.60లక్షల ఇసుక లారీల్లో అక్రమంగా తరలిపోతున్నట్టు అంచనా. ఈ మేరకు మొత్తం దాదాపు నెలకు రూ.1.50కోట్ల ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోన్నట్టు తెలుస్తోంది. మామూళ్లు ఇలా... ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో ఆయా శాఖల్లోని కొందరు అధికారులకు అక్రమార్కులు రోజు, నెలవారీ వాటాలు అందజేస్తున్నారని సమాచారం. రోజుకు ఒక ట్రాక్టర్‌కు సుమారు రూ.వెయ్యి చొప్పున కొందరు కింది స్థాయి అధికారులకు వాటాలు వెళుతున్నట్టు తెలుస్తోంది. ఇక ‘పెద్ద’ అధికారులకు నెలకు రూ.2వేల వరకు మామూళ్లను అక్రమార్కులు అందిస్తున్నారని సమాచారం. అదేవిధంగా అక్రమ ఇసుక రవాణాను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన తనిఖీ బృందాలకూ రోజుకు రూ.2-రూ.3వేలు ముట్టజెబుతూ అక్రమార్కులు రాత్రింబవళ్లు ఈ దందాను నిర్భయంగా కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. నిబంధనలు గాలికి... పట్టా భూముల్లోనుంచి ఇసుక తరలింపునకు సంబంధించి ప్రభుత్వం విధించిన నిబంధనలను అక్రమార్కులు గాలికి వదిలేస్తున్నారు. అటు అధికారులూ పట్టించుకోవడం లేదు. వాస్తవానికి ఇసుక తరలించే తేదీ, సమయం, ట్రాక్టర్ నంబర్, డ్రైవర్ లెసైన్స్ వివరాలన్నీ తప్పనిసరిగా అధికారులకు ఇవ్వాలి. కానీ ఇవేవీ లేకుండానే కొందరు ఇసుకను తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ ఆదాయానికి గండి పడుతోంది. ఒక రాయల్టీ మీద ఒక ట్రిప్పు ట్రాక్టర్ ఇసుకను తరలించాలి. కానీ ఐదారు ట్రిప్పుల ఇసుకను తరలిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అలాగే ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు పట్టాభూముల్లో ఇసుక తరలించాలనే నిబంధన ఉన్నా అమలు చేయడంపై అధికారులు ధ్యాస పెట్టకపోవడం విడ్డూరం. రహస్య ప్రదేశాల్లో డంపింగ్... రవాణా వికారాబాద్, మహబూబ్‌నగర్, కర్ణాటక, దువ్వచర్ల, కొత్తూర్లకు యాలాల నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నా అడ్డుకట్ట వేయడంలో అధికారులు శ్రద్ధ చూపడం లేదు. ఇక కొందరు అక్రమార్కులు ఎవరికీ అనుమానం రాకుండా ఎడ్లబండ్లపై ఇసుకను తరలించి రహస్య ప్రదేశాల్లో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి ట్రాక్టర్లు, లారీల్లో ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది. మొక్కుబడి చర్యలు ఆయా శాఖల్లోని అధికారులకు ట్రాక్టర్‌కు నెలకు రూ.2వేల చొప్పున అక్రమార్కులు రూ.లక్షల్లో వాటాలు అందజేస్తున్నారని తెలుస్తోంది. సబ్‌కలెక్టర్ ఆదేశించినప్పుడు మాత్రం అధికారులు రెండు మూడు రోజులు కాస్తా హడావుడి చేసి ఒకటెండ్రు కేసులు, జరిమానాలతో మమ అనిపించేస్తుండటం గమనార్హం. ఇసుక అక్రమ రవాణాపై సమాచారం ఇచ్చినా ‘అలాగా...ఎక్కడ’... పై అధికారులకు చెబుతామంటూ తప్పించుకుంటున్నారే తప్ప సరైన విధంగా స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఈ లోపాయికారీ వ్యవహారాలకు చెక్ పెడితేనే కొంతమేరకైనా ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడే ఆస్కారం ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
ప్రాణం తీసిన పేకాట!
తాండూరు రూరల్, న్యూస్‌లైన్: ఓ గని కార్మికుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు బండరాయితో మోది చంపేశారు. పేకాట ఆడే సమయంలో డబ్బుల విషయమై తలెత్తిన గొడవ హత్యకు దారి తీసి ఉండొచ్చని కుటుంబీకులు, గ్రామస్తులు అనుమానిస్తున్నారు. హతుడి కుటుంబసభ్యులు, రూరల్ సీఐ రవి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన అబ్దుల్ హుస్సేన్(26) స్థానికంగా ఉన్న ఓ నాపరాతి గనిలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆయన ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో బుధవారం హుస్సేన్ తండ్రి బషీర్మియా అతడి ఆచూకీ కోసం గాలించసాగాడు. ఈ క్రమంలో కొడుకు తరచూ జూదం ఆడే గ్రామ శివారులోని ఓ గది వద్దకు వెళ్లాడు. సమీపంలోని ఓ గుంతలో బండరాళ్ల కింద ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. హతుడి దుస్తుల ఆధారంగా అతడు తన కుమారుడు హుస్సేనేనని బషీర్మియా గుర్తించాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలంలో పెద్దఎత్తున గుమిగూడారు. రూరల్ సీఐ రవి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. హుస్సేన్ కుడి కన్ను, కణత, తల భాగాలపై తీవ్ర గాయాలు ఉన్నాయి. బండరాళ్లతో మోదిన ఆనవాళ్లు కనిపించాయి. ఘటనా స్థలానికి సమీపంలోని ఓ గదిలో పేక ముక్కలు, మద్యం సీసాలు పడిఉన్నాయి. పోలీసులు హైదరాబాద్ నుంచి డాగ్‌స్క్వాడ్ ను రప్పించారు. జాగిలం ఘటనా స్థలం నుంచి గ్రామంలోని భవానీనగర్‌లోని ఓ కిరాణం దుకాణం వద్దకు, అక్కడి నుంచి సంగెంకాలన్ గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న వడిచర్ల మొగులప్ప హోటల్ వరకు వెళ్లి ఆగింది. వికారాబాద్ నుంచి వచ్చిన క్లూస్ టీం వివరాలు సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. హతుడి తండ్రి బషీర్ మియా ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవి తెలిపారు. తల్లికి అనారోగ్యం.. తండ్రి అనంతలోకాలకు హతుడు హుస్సేన్‌కు భార్య బిస్మిల్లా, కూతురు ఇసాత్(7), కుమారుడు, పాష(2) ఉన్నారు. అనారోగ్యంతో బిస్మిల్లా కొన్నాళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. పిల్లలు నాయనమ్మ మొగులన్బీ వద్ద ఉంటున్నారు. తల్లి అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోవడం, తండ్రి హత్యకు గురవడంతో పిల్లలు అనాథలయ్యారు. హుస్సేన్ మృతితో తల్లిదండ్రులు, పిల్లలు కన్నీటిపర్యంతమయ్యారు. -
వరద నీటి వృథాకు ‘చెక్’
తాండూరు, న్యూస్‌లైన్: వర్షాకాలంలో కాగ్నా నది నుంచి వృథాగా కర్ణాటక రాష్ట్రానికి తరలిపోతున్న నీటికి అడ్డుకట్టే వేసే ప్రాజెక్టు త్వరలో కార్యరూపం దాల్చనుంది. వృథాగా పోతున్న వరద నీటిని వినియోగంలోకి తీసుకొచ్చి పంటలకు సాగు నీరు, ప్రజలకు తాగునీరు అందించేందుకు తాండూరు కాగ్నా నదిలో చెక్‌డ్యాం నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. ఈ చెక్‌డ్యాం నిర్మాణం కోసం రూ.8.52కోట్ల నిధులను ఇటీవలనే ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి పరిపాలన అనుమతి ప్రక్రియ కూడా పూర్తయ్యింది. చెక్‌డ్యాం నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. పట్టణవాసులకు తాగునీరు అందించే పాతతాండూరులోని పంప్‌హౌస్‌కు సుమారు 200-300 మీటర్ల దూరంలో కాగ్నా నది వద్ద చెక్‌డ్యాం నిర్మించాలని సంకల్పించారు. ప్రతిపాదిత స్థలంలో 35 మిలియన్ క్యూబిక్ ఫీట్ల (ఎంసీఎఫ్‌టీ) నీటి నిల్వ సామర్థ్యం కలిగిన చెక్‌డ్యాం నిర్మించేందుకు ఇరిగేషన్ అధికారులు డిజైన్ సిద్ధం చేశారు. చెక్‌డ్యాం నిర్మాణం పూర్తయితే కాగ్నా నది పరీవాహక ప్రాంతంలోని సుమారు 900 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. అలాగే తాండూరు పట్టణవాసులతోపాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని 30 గ్రామాల ప్రజలకు తాగునీరు సరఫరా చేయవచ్చంటున్నారు. వరద నివారణ కట్టల నిర్మాణానికీ సంకల్పం కాగ్నా నదిలో చెక్‌డ్యాంతో పాటు వరద జలా లు నదికి రెండు వైపులా వెళ్లకుండా పాత తాం డూరు, యాలాల మండలం అగ్గనూర్ ప్రాం తాల్లో రెండు వరద నివారణ కట్టలు నిర్మిం చేందుకు ఇరిగేషన్ అధికారులు సంకల్పించా రు. వీటి నిర్మాణానికి అవసరమైన 9 ఎకరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ రెండు ప్రాంతాల్లో భూముల ధరలపై స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆరా తీశారు. పాతతాండూరులో ఎకరం రూ.లక్ష, అగ్గనూర్‌లో ఎకరం రూ.1.50లక్షల ధర పలుకుతున్నట్టు ఇరిగేషన్ అధికారుల దృష్టికి వచ్చింది. రెండు నెలల్లో పనులప్రారంభం: డీఈ చెక్‌డ్యాం నిర్మాణానికి సంబంధించిన అంచనా ప్రతిపాదనలను చిన్ననీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్‌కు పంపించినట్లు, ప్రస్తుతం టెండర్లు ఆహ్వానించే ప్రక్రియ కొనసాగుతోందని తాండూరు ఇరిగేషన్ డీఈ నర్సింహ ‘న్యూస్‌లైన్’తో చెప్పారు. టెండర్లు ఖరారు కాగానే వచ్చే జనవరి మాసం నాటికి పనులు ప్రారంభమవుతాయని వివరించారు. -
‘పిడుగు’ విషాదం ఐదుగురు రైతుల మృత్యువాత
పిడుగులు.. జిల్లాలో మృత్యుగంట మోగిస్తున్నాయి. రెండ్రోజుల వ్యవధిలో ఐదుగురిని బలిగొన్నాయి. వ్యవసాయ పనులకు వెళ్లిన రైతు కుటుంబాలపై మృత్యువు పిడుగై పడుతోంది. ఉట్నూర్ మండలానికి చెందిన తండ్రీకొడుకులు, వాంకిడికి చెందిన మహిళ పిడుగుపాటుకు గాయపడి చికిత్స పొందుతూ చనిపోయారు. తాజాగా తాండూర్ మండలం అచ్చులాపూర్‌లో మామాఅల్లుడు దుర్మరణం చెందారు. తాండూర్, న్యూస్‌లైన్ : మండలంలోని అచ్చులాపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి భారీ వర్షంతోపాటు పిడుగు పడడంతో గ్రామానికి చెందిన బామండ్లపల్లి పోచయ్య(60), చెన్నూరుకు చెందిన కమ్మల రాజయ్య(25) మృత్యువాత పడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. అచ్చులాపూర్‌కు చెందిన బామండ్లపల్లి పోచయ్య కుమారుడు మహేశ్ తన బావమరిది చెన్నూరుకు చెందిన కమ్మల రాజయ్యతో కలిసి గ్రామ శివారులో వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వ్యవసాయ పనులు ముగించుకుని పోచయ్యతోపాటు అతని కుమారులు మహేశ్, సంతోశ్, కమ్మల రాజయ్య(మహేష్ బావమరిది) ఇంటికి వస్తున్నారు. మహేశ్ తమ ఎడ్లను పట్టుకుని అందరి కంటే మందు నడుస్తుండగా, వెనకాల ఎడ్లబండిపై పోచయ్య, సంతోశ్, రాజయ్య వస్తున్నారు. అదే సమయంలో భారీ వర్షం కురియడంతోపాటు ఒక్కసారిగా ఎడ్లబండిపై పిడుగు పడింది. దీంతో బండిలో ఉన్న పోచయ్య, రాజయ్య అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. సంతోశ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనలో తండ్రి మృతిచెందగా ఇద్దరు కుమారులు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. హఠాత్తుగా సంభవించిన ఈ పరిణామంతో పోచయ్య, రాజయ్య కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. మృతుడు పోచయ్య అచ్చులాపూర్ సర్పంచ్ చవుళ్ల లక్ష్మికి కన్న తండ్రి. -
తాండూరులో సినీ ఫక్కీలో చోరీ..
తాండూరు, న్యూస్‌లైన్: తాండూరు పట్టణంలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. దుండగులు ఆభరణాలు కొనుగోలు చేస్తున్నట్లు నటించి యజమానిని మభ్యపెట్టి పట్టపగలే రూ. 4.5 లక్షలు చేసే బంగారాన్ని అపహరించుకుపోయారు. మరో దుకాణంలోనూ చోరీకి యత్నించారు. ఈ ఘటన బుధవారం పట్టణంలో కలకలం సృష్టించింది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని గాంధీచౌక్ సమీపంలో రామకృష్ణ జ్యువెలర్స్ ఉంది. బుధవారం మధ్యాహ్నం సుమారు 40-45 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు వ్యక్తులు దుకాణానికి వచ్చి హిందీలో మాట్లాడారు. 5 గ్రాముల వెండి బిళ్లను కొనుగోలు చేసి రూ. 260 చెల్లించారు. చిన్నపిల్లలకు సంబంధించిన బంగారు ఉంగరాలను చూశారు. ఎరుపురంగు రాయి ఉన్న ఓ ఉంగరానికి కొంత పాలిష్ తక్కువ చేయాలన్నారు. దీంతో యజమాని ముదెళ్లి విజయ్‌కుమార్ గుమాస్తా గుండప్పకు ఉంగరం ఇచ్చి పంపాడు. అనంతరం ‘ఓం’ గుర్తు ఉన్న బిళ్లలను చూసి డిజైన్లు నచ్చలేదన్నారు. పలు బాక్స్‌ల్లోని బంగారం, వెండి ఆభరణాలు చూస్తామని బయటకు తీయించారు. ఈక్రమంలోనే దుండగులు యజమానితో పిచ్చాపాటిగా మాట్లాడుతూ తమ చోర కళను ప్రదర్శించారు. ఓ బాక్సును చాకచక్యంగా అపహరించారు. తర్వాత లక్ష్మీపూజకు చిన్న బంగారం ముక్క (ముడి బంగారం) కావాలని 115 మిల్లీ గ్రాములు కొనుగోలు చేసి రూ.390 చెల్లించి వెళ్లిపోయారు. దుకాణం యజమానికి అనుమానం వచ్చి ఆభరణాలు ఉన్న బాక్సులను పరిశీలించగా ఒకటి కనిపించలేదు. దుండగులు దాదాపు రూ.4.5 లక్షలు విలువ చేసే 15 తులాల ముడి బంగారంతో పాటు నగలను అపహరించుకుపోయారని గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చాడు. దుండగుల కోసం పరిసరాల్లో గాలించినా ఫలితం లేకుండా పోయింది. కాగా రామకృష్ణ జ్యువెలర్స్‌లో చోరీకి పాల్పడేకంటే ముందే దొంగలు గాంధీచౌక్‌లోని జీపీ నగల దుకాణం యజమానిని మాటల్లో పెట్టి చోరీకి యత్నించారని, అనుమానం వచ్చిన దుకాణాదారు వారిని బయటకు పంపించేశాడని తెలిసింది. బాధితుడి ఫిర్యాదుతో తాండూరు అర్బన్ సీఐ దుకాణాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. దుండగుల్లో ఓ వ్యక్తి ఎత్తుగా ఎరుపు రంగు, మరో వ్యక్తి లావుగా ఉన్నాడని బాధితుడు తెలిపాడు. దొంగల వద్ద ఓ నల్లబ్యాగు ఉందన్నారు. దుండగులు బైకుపై పరారై ఉండొచ్చని అనుమానం వ్యక్తం అవుతోంది. సీఐ రెండు దుకాణాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. దుండగుల కోసం విస్త్రృ తంగా గాలిస్తున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
వినాయకా.. సెలవిక
తాండూరు టౌన్/తాండూరు, న్యూస్‌లైన్ : ఐదురోజుల పాటు పూజలందుకున్న గణనాథునికి తాండూరులో ఘనంగా వీడ్కోలు పలి కారు. శుక్రవార ఘనంగా నిమజ్జనం చేశారు. మధ్యాహ్నం నుంచి ఊరేగింపు ప్రారంభమైంది. రాత్రి భారీగా విగ్రహాలు తరలిరావడంతో అక్కడక్కడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విగ్రహాలను పలు వాహనాల్లో తరలిస్తూ వాటి ముందు యువకులు పెద్ద ఎత్తున నృత్యాలు చేశారు. రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. యోగ్చాప్, చిరుతల భజన, సన్నాయివాయిద్యాలు, డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపు కోలాహలంగా సాగింది. భారీ వర్షంలోనూ ఊరేగింపు ... నిమజ్జనానికి బయలుదేరిన వినాయకులను వరుణదేవుడు పలకరించాడు. సాయంత్రం 5గంటల నుంచి రెండుగంటలకు పైగా భారీ వర్షం కురిసింది. అయినా ఊరేగింపు ఉత్సాహంగా కొనసాగింది. భద్రప్ప గుడి వద్ద హిం దూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వేదిక ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రమేష్, డీసీసీబీ జిల్లా చైర్మన్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షు డు లక్ష్మారెడ్డి తదితరులు స్వాగతం పలికారు. భారీ బందోబస్తు నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీ సులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ రాజకుమారి, ఏఎస్పీ వెంకటస్వామి పరిస్థితిని సమీక్షించారు. 200మందికి పైగా పోలీసులు డీఎస్పీ షేక్‌ఇస్మాయిల్ ఆధ్వర్యంలో విధులు నిర్వర్తించారు. అంతకుముందు వినాయక విగ్రహాల వేదికల వద్ద, ఊరేగింపు వెళ్లే మార్గాల్లో బాంబ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది ముమ్మర తనిఖీలు చేపట్టారు. లక్కీడ్రాలో రూ.లక్ష విలువైన బంగారం తాండూరులోని వినాయక్‌చౌక్‌లో వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీడ్రా ఉత్కంఠగా కొనసాగింది. శుక్రవారం వందలాది మంది సమక్షంలో డ్రా నిర్వహిం చారు. చివరి బహుమతి నుంచి డ్రా తీస్తుండటంతో రూ.లక్ష బంగారం ఎవరికి దక్కుతుం దోననే ఉత్కంఠ నెలకొంది. ‘6715’ నంబర్‌కు రూ.లక్ష విలువైన బంగారం దక్కింది. 7487 నంబర్‌కు (కెరెళ్లికి చెందిన రైతు కె.రాజయ్య) ద్వితీయ బహుమతిగా రూ.25వేల బంగారం, 2432 నంబర్‌కు (తాండూరుకు చెందిన ఖాజామొయినొద్దీన్) తృతీయ బహుమతిగా రూ.10వేల వెండి బహుమతి దక్కింది. గణపతి లడ్డూకు భలే డిమాండ్ తాండూరులోని వినాయక మండపాల వద్ద గణపతి లడ్డూలకు భలే డిమాండ్ పలికింది. శుక్రవారం ఆయా మండపాల ఉత్సవ సమితిల ఆధ్వర్యంలో వేలం పాటలు నిర్వహిం చారు. గణపతి లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. పసారి వార్డు వద్ద రూ.55,559కు అల్లాపూర్ జైపాల్‌రెడ్డి, సాయిపూర్ పోచమ్మ గుడి వద్ద రూ.42 వేలకు బంటు హన్మంతు లడ్డూను దక్కించుకున్నారు. తాతాగుడి (హనుమాన్‌దేవాలయం) వద్ద పట్లోళ్ల రవీందర్‌రెడ్డి రూ.40వేలు, బోనమ్మ గుడి వద్ద రూ.36లకు, అంబేద్కర్ చౌక్‌వద్ద రూ.30వేలకు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పట్లోళ్ల రత్నమాల భర్త పి.నర్సింహులు, సాయిపూర్లో రూ.30వేలకు పట్లోళ్ల జనార్దన్, మైసమ్మ గుడి వద్ద రూ.23వేలకు పట్లోళ్ల వెంకటేశం, యాదిరెడ్డి చౌక్‌లో రూ.38,001 మేస్త్రీలు అంకమరాజు, హరిబాబు, రూ.23,001కు మరో లడ్డూను మేస్త్రీ వీరబాబు, శాంతినగర్‌లో రెండు లడ్డూలు రూ.30వేలకు భక్తులు వేలంలో దక్కించుకున్నారు. కోకట్ కాగ్నా నదిలో... యాలాల: మండల పరిధిలోని కోకట్ కాగ్నా నదిలో నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. తాండూరుతో పాటు వివిధ గ్రామాల్లో ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథులను భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. రెవెన్యూ, పోలీసులు, తాండూరు మున్సిపల్ సిబ్బంది, అగ్నిమాపక, వైద్య, గజ ఈతగాళ్లు, ఎలక్ట్రిసిటీ అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. నిమజ్జన కార్యక్రమాన్ని ఎస్పీ రాజకుమారి, వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి పరీశీలించారు.