తాండూరు టౌన్, న్యూస్‌లైన్: ఉద్యోగాల పేరిట ఓ కంపెనీ నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టింది. 11 మంది నుంచి సుమారు రూ.5.12 లక్షలు వసూలు చేసి కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో మోసపోయామని ఆలస్యంగా గ్రహించిన బాధితులు సోమవారం తాండరు పోలీసులను ఆశ్రయించారు. పట్టణ సీఐ సుధీర్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో ‘బిల్డర్స్ అండ్ డెవలపర్స్’ పేరుతో ఓ కంపెనీ ఉంది.
నిరుద్యోగులకు పలు ప్రాంతాల్లో నిర్మాణ రంగంలో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మబలికింది. తాం డూరు, బషీరాబాద్, పెద్దేముల్, కర్ణాటక రాష్ట్రంలోని చించోళి తదితర ప్రాం తాలకు చెందిన కిషన్‌నాయక్, లక్ష్మణ్, తుకారాం, సంతోష్, రాజేందర్, శివ, సువర్ణ, లక్ష్మణ్, శ్రీనివాస్, జనార్ధన్, శ్రీనుల నుంచి రూ. సుమారు రూ. 5.12 లక్షలు వసూలు చేశారు. ఒక్కొక్కరి దగ్గర రూ. 50 వేలకు పైగా దండుకొని రెండు నెలల క్రితం నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు నేడుమాపు అం టూ తిప్పించుకుంటున్నారు. రెం డు రోజుల క్రితం సదరు కంపెనీ యా జమాన్యం బోర్డు తిప్పేశారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సోమవారం తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగాలిప్పిస్తామని డబ్బు లు వసూలు చేసిన హైదరాబాద్‌కు చెందిన నారాయణ, విల్లులపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని బం జారా సంఘం జిల్లా అధ్యక్షుడు విఠల్‌నాయక్, నవాంద్గి పీఏసీఎస్ వైస్‌ై చెర్మన్ రామునాయక్ పోలీసులను కోరారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఉద్యోగాల పేరుతో కుచ్చుటోపీ...
Published Tue, Nov 26 2013 5:02 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement