తాండూరు టౌన్/తాండూరు, న్యూస్‌లైన్ : ఐదురోజుల పాటు పూజలందుకున్న గణనాథునికి తాండూరులో ఘనంగా వీడ్కోలు పలి కారు. శుక్రవార ఘనంగా నిమజ్జనం చేశారు. మధ్యాహ్నం నుంచి ఊరేగింపు ప్రారంభమైంది. రాత్రి భారీగా విగ్రహాలు తరలిరావడంతో అక్కడక్కడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విగ్రహాలను పలు వాహనాల్లో తరలిస్తూ వాటి ముందు యువకులు పెద్ద ఎత్తున నృత్యాలు చేశారు. రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. యోగ్‌చాప్, చిరుతల భజన, సన్నాయివాయిద్యాలు, డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపు కోలాహలంగా సాగింది.
భారీ వర్షంలోనూ ఊరేగింపు ...
నిమజ్జనానికి బయలుదేరిన వినాయకులను వరుణదేవుడు పలకరించాడు. సాయంత్రం 5గంటల నుంచి రెండుగంటలకు పైగా భారీ వర్షం కురిసింది. అయినా ఊరేగింపు ఉత్సాహంగా కొనసాగింది. భద్రప్ప గుడి వద్ద హిం దూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వేదిక ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రమేష్, డీసీసీబీ జిల్లా చైర్మన్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షు డు లక్ష్మారెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
భారీ బందోబస్తు
నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీ సులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ రాజకుమారి, ఏఎస్పీ వెంకటస్వామి పరిస్థితిని సమీక్షించారు. 200మందికి పైగా పోలీసులు డీఎస్పీ షేక్‌ఇస్మాయిల్ ఆధ్వర్యంలో విధులు నిర్వర్తించారు. అంతకుముందు వినాయక విగ్రహాల వేదికల వద్ద, ఊరేగింపు వెళ్లే మార్గాల్లో బాంబ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది ముమ్మర తనిఖీలు చేపట్టారు.
లక్కీడ్రాలో రూ.లక్ష విలువైన బంగారం
తాండూరులోని వినాయక్‌చౌక్‌లో వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీడ్రా ఉత్కంఠగా కొనసాగింది. శుక్రవారం వందలాది మంది సమక్షంలో డ్రా నిర్వహిం చారు. చివరి బహుమతి నుంచి డ్రా తీస్తుండటంతో రూ.లక్ష బంగారం ఎవరికి దక్కుతుం దోననే ఉత్కంఠ నెలకొంది. ‘6715’ నంబర్‌కు రూ.లక్ష విలువైన బంగారం దక్కింది. 7487 నంబర్‌కు (కెరెళ్లికి చెందిన రైతు కె.రాజయ్య) ద్వితీయ బహుమతిగా రూ.25వేల బంగారం, 2432 నంబర్‌కు (తాండూరుకు చెందిన ఖాజామొయినొద్దీన్) తృతీయ బహుమతిగా రూ.10వేల వెండి బహుమతి దక్కింది.
గణపతి లడ్డూకు భలే డిమాండ్
తాండూరులోని వినాయక మండపాల వద్ద గణపతి లడ్డూలకు భలే డిమాండ్ పలికింది. శుక్రవారం ఆయా మండపాల ఉత్సవ సమితిల ఆధ్వర్యంలో వేలం పాటలు నిర్వహిం చారు. గణపతి లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. పసారి వార్డు వద్ద రూ.55,559కు అల్లాపూర్ జైపాల్‌రెడ్డి, సాయిపూర్ పోచమ్మ గుడి వద్ద రూ.42 వేలకు బంటు హన్మంతు లడ్డూను దక్కించుకున్నారు. తాతాగుడి (హనుమాన్‌దేవాలయం) వద్ద పట్లోళ్ల రవీందర్‌రెడ్డి రూ.40వేలు, బోనమ్మ గుడి వద్ద రూ.36లకు, అంబేద్కర్ చౌక్‌వద్ద రూ.30వేలకు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పట్లోళ్ల రత్నమాల భర్త పి.నర్సింహులు, సాయిపూర్‌లో రూ.30వేలకు పట్లోళ్ల జనార్దన్, మైసమ్మ గుడి వద్ద రూ.23వేలకు పట్లోళ్ల వెంకటేశం, యాదిరెడ్డి చౌక్‌లో రూ.38,001 మేస్త్రీలు అంకమరాజు, హరిబాబు, రూ.23,001కు మరో లడ్డూను మేస్త్రీ వీరబాబు, శాంతినగర్‌లో రెండు లడ్డూలు రూ.30వేలకు భక్తులు వేలంలో దక్కించుకున్నారు.
కోకట్ కాగ్నా నదిలో...
యాలాల: మండల పరిధిలోని కోకట్ కాగ్నా నదిలో నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. తాండూరుతో పాటు వివిధ గ్రామాల్లో ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథులను భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. రెవెన్యూ, పోలీసులు, తాండూరు మున్సిపల్ సిబ్బంది, అగ్నిమాపక, వైద్య, గజ ఈతగాళ్లు, ఎలక్ట్రిసిటీ అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. నిమజ్జన కార్యక్రమాన్ని ఎస్పీ రాజకుమారి, వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి పరీశీలించారు.
వినాయకా.. సెలవిక
Published Sat, Sep 14 2013 12:44 AM | Last Updated on Fri, Aug 3 2018 2:57 PM
Advertisement