రోహిత్‌రెడ్డికి ఇదే ఆఖరి పదవి | Tandur Congress Leaders Withdraw Riley's Fast | Sakshi
Sakshi News home page

రోహిత్‌రెడ్డికి ఇదే ఆఖరి పదవి

Published Thu, Jul 25 2019 12:30 PM | Last Updated on Thu, Jul 25 2019 12:31 PM

Tandur Congress Leaders Withdraw Riley's Fast - Sakshi

రిలే నిరాçహార దీక్ష వేదికపై మాట్లాడుతున్న వంశీచంద్‌రెడ్డి

తాండూరు: తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి జీవితంలో ఇదే ఆఖరి పదవిగా మిగిలిపోనుందని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి జోస్యం చెప్పారు. బుధవారం తాండూరు పట్టణంలోని అంబేడ్కర్‌చౌక్‌వద్ద ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి రాజీనామా చేయాలంటూ చేపట్టిన రిలేనిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. తాండూరు మండల కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌ ఆద్వర్యంలో మండలానికి చెందిన నాయకులు చేపట్టిన ఈ దీక్షకు ఏఐసీసీ కార్యదర్శి వంశిచంద్‌రెడ్డి, వికారాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు టీ.రామ్మోహన్‌రెడ్డి, తాండూరు నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి రమేష్‌ మహరాజ్‌ హాజరయ్యి సంఘీభావం తెలిపారు. అనంతరం వంశీచంద్‌ మాట్లాడుతూ... తాండూరులో మంత్రిగా ఉన్న పట్నం మహేందర్‌రెడ్డిని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడించిందన్నారు.

ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి విజయం సాధించిన పంజుగుల రోహిత్‌రెడ్డి పార్టీ మారడం తాండూరు నియోజవకర్గం ప్రజలను మోసం చేయడమేనన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీ మారిన ఎమ్మెల్యేకు జీవితంలో ఇదే మొదటి, చిట్ట చివరి పదవిగా మిగిలిపోతుందన్నారు. తాండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించినప్పుడే రోహిత్‌రెడ్డికి బుద్ధి చెప్పినట్లవుతుందన్నారు. ఆ దిశగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి రాజీనామా చేయాలని చేపట్టిన నిరాహార దీక్షకు ప్రజలు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. తాండూరు ప్రజలను మోసం చేసిన ఎమ్మెల్యే రానున్న రోజుల్లో తగిన శాస్తి కలుగకమానదన్నారు.

నిరహరదీక్ష చేస్తున్న రాజ్‌కుమార్, జర్నప్ప, రాఘనాత్‌రెడ్డి, జెన్నెనాగప్ప, శివగౌడ్, శివకుమార్‌తో పాటు పలువురు నాయకులకు సాయంత్రం జూస్‌ తాగించి దీక్షను విరమింపచేయించారు. ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి రమేష్, పార్టీ బీసీసెల్‌ జిల్లా అధ్యక్షుడు ఉత్తంచంద్, తాండూరు పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌గౌడ్, మా జీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అలీం, తాండూరు మం డల మాజీ అధ్యక్షుడు హేమంత్‌కుమార్, మాజీ కౌన్సిలర్‌ లింగదల్లిరవికుమార్, నాయకులు జనార్ధన్‌రెడ్డి, కల్వ సుజాత తదితరులున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement