relay hunger strikes
-
ప్రభుత్వం పరిష్కారం చూపాల్సిందే
న్యూఢిల్లీ/ఫతేపూర్: కేంద్ర ప్రభుత్వం రైతులకు తాజాగా రాసిన లేఖలో కొత్తదనం ఏమీ లేదని రైతు సంఘాల నేతలు విమర్శించారు. తమ డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సరైన పరిష్కార మార్గంతో ముందుకొస్తే చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని ఉద్ఘాటించారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాల్లోని 7 అంశాల్లో సవరణలు చేస్తామని ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని, తదుపరి చర్చలకు తేదీని ఖరారు చేయాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రెటరీ వివేక్ అగర్వాల్ ఆదివారం 40 వ్యవసాయ సంఘాల నేతలకు లేఖ రాశారు. రైతాంగం కోరినట్లుగా కనీస మద్దతు ధరపై(ఎంఎస్పీ) లిఖితపూర్వక హామీ ఇస్తామని వెల్లడించారు. అయితే, సవరణల ప్రతిపాదనపై తాము ఇప్పటివరకు ప్రభుత్వంతో చర్చించలేదని, తాజా లేఖపై ఎలా స్పందించాలన్న విషయంలో రైతు సంఘాల నేతల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నాయకుడు రాకేశ్ తికాయిత్ సోమవారం చెప్పారు. ప్రభుత్వ ప్రతిపాదనను తాము గతంలోనే తిరస్కరించామని, లేఖలో కొత్తగా ఏమీ లేదని అన్నారు. తమ డిమాండ్ ఏమిటో ప్రభుత్వానికి తెలియదా? అని మరో నేత అభిమన్యు కోహర్ నిలదీశారు. కొత్త సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. మా గోడు ప్రభుత్వం వినాలి నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వేలాది మంది రైతులు గత 24 రోజులుగా ఢిల్లీ శివార్లలోనే ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తమ గోడును ప్రభుత్వం వినిపించుకోవాలని కోరుతున్నారు. చర్చలకు తాము తేదీని ఖరారు చేయడం కాదని, ప్రభుత్వమే తమకు సమయం కేటాయించాలని, తమ దగ్గరకొచ్చి బాధలేమిటో తెలుసుకోవాలని ఆలిండియా కిసాన్ సమితి(పంజాబ్) సహాయ కార్యదర్శి కశ్మీర్‌సింగ్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఒక గట్టి పరిష్కార మార్గంతో ముందుకొస్తే మంచిదని ద్వాబా కిసాన్ కమిటీ ప్రధాన కార్యదర్శి అమర్జీత్సింగ్ పేర్కొన్నారు. సర్కారు ప్రతిపాదనలను తాము క్షుణ్నంగా చదివామని, కొత్త చట్టాలను రద్దు చేయాలని మళ్లీ మళ్లీ చెబుతున్నామని వ్యాఖ్యానించారు. తామంతా(సంయుక్త మోర్చా) మంగళవారం సమావేశమై, తదుపరి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని క్రాంతికిరణ్ కిసాన్ యూనియన్ నాయకుడు గుర్మీత్‌సింగ్ వెల్లడించారు. కొత్త చట్టాలతో రైతన్నలకు నష్టం, కార్పొరేట్లకు లాభం కలిగే అవకాశం ఉంది కాబట్టే ప్రభుత్వంతో తమ చర్చలు విఫలమవుతున్నాయని అన్నారు. తమ డిమాండ్ల విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని అంబేడ్కర్ సంఘర్‡్ష మోర్చా హరియాణా రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌సింగ్ స్పష్టం చేశారు. యూపీలో నిరవధిక రిలే నిరాహార దీక్ష కొత్త సాగు చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లా బిండ్‌కీ గ్రామంలో 11 మంది రైతులు ఆదివారం నుంచి నిరవధిక రిలే నిరాహార దీక్ష సాగిస్తున్నారు. సాగు చట్టాలపై కేరళ అసెంబ్లీ తీర్మానం! ఈ నెల 23వ తేదీన శాసన సభ ప్రత్యేకంగా సమావేశమై నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయనున్నట్లు కేరళలోని వామపక్ష ప్రభుత్వం తెలిపింది. ‘సోషల్ మీడియా మాకు చాలా కీలకం’ కొత్త సాగు చట్టాలపై తమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సోషల్ మీడియా మద్దతు చాలా కీలకమని రైతులు స్పష్టం చేశారు. రైతుల పోరాటంపై ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించే కిసాన్ ఏక్తా మోర్చా పేజీలను ఫేస్బుక్ యాజమాన్యం ఆదివారం సాయంత్రం నుంచి నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో 3 గంటల తర్వాత పునరుద్ధరించింది. ఇన్స్టాగ్రామ్ సైతం కిసాన్ ఏక్తా మోర్చా పేజీలను తాత్కాలికంగా రద్దు చేసింది. ఢిల్లీ శివారులోని సింఘు బోర్డర్ వద్ద ఆందోళన సాగిస్తున్న హిమ్మత్‌సింగ్ అనే రైతు సోమవారం మీడియాతో మాట్లాడారు. ప్రధాన ప్రసార మాధ్యమాలు వివక్ష చూపుతున్నాయని, వాస్తవాలను ప్రజలకు తెలియనివ్వడం లేదని ఆరోపించారు. అందుకే సోషల్ మీడియా ద్వారానే ప్రజలకు నిజాలు తెలియజేస్తున్నామని వెల్లడించారు. -
రోహిత్‌రెడ్డికి ఇదే ఆఖరి పదవి
తాండూరు: తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి జీవితంలో ఇదే ఆఖరి పదవిగా మిగిలిపోనుందని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి జోస్యం చెప్పారు. బుధవారం తాండూరు పట్టణంలోని అంబేడ్కర్చౌక్వద్ద ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి రాజీనామా చేయాలంటూ చేపట్టిన రిలేనిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. తాండూరు మండల కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు రాజ్‌కుమార్ ఆద్వర్యంలో మండలానికి చెందిన నాయకులు చేపట్టిన ఈ దీక్షకు ఏఐసీసీ కార్యదర్శి వంశిచంద్రెడ్డి, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీ.రామ్మోహన్‌రెడ్డి, తాండూరు నియోజకవర్గ మాజీ ఇన్చార్జి రమేష్ మహరాజ్ హాజరయ్యి సంఘీభావం తెలిపారు. అనంతరం వంశీచంద్ మాట్లాడుతూ... తాండూరులో మంత్రిగా ఉన్న పట్నం మహేందర్‌రెడ్డిని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడించిందన్నారు. ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన పంజుగుల రోహిత్‌రెడ్డి పార్టీ మారడం తాండూరు నియోజవకర్గం ప్రజలను మోసం చేయడమేనన్నారు. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీ మారిన ఎమ్మెల్యేకు జీవితంలో ఇదే మొదటి, చిట్ట చివరి పదవిగా మిగిలిపోతుందన్నారు. తాండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పుడే రోహిత్‌రెడ్డికి బుద్ధి చెప్పినట్లవుతుందన్నారు. ఆ దిశగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి రాజీనామా చేయాలని చేపట్టిన నిరాహార దీక్షకు ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. తాండూరు ప్రజలను మోసం చేసిన ఎమ్మెల్యే రానున్న రోజుల్లో తగిన శాస్తి కలుగకమానదన్నారు. నిరహరదీక్ష చేస్తున్న రాజ్‌కుమార్, జర్నప్ప, రాఘనాత్రెడ్డి, జెన్నెనాగప్ప, శివగౌడ్, శివకుమార్‌తో పాటు పలువురు నాయకులకు సాయంత్రం జూస్ తాగించి దీక్షను విరమింపచేయించారు. ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గ మాజీ ఇన్చార్జి రమేష్, పార్టీ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు ఉత్తంచంద్, తాండూరు పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌గౌడ్, మా జీ మున్సిపల్ వైస్ చైర్మన్ అలీం, తాండూరు మం డల మాజీ అధ్యక్షుడు హేమంత్‌కుమార్, మాజీ కౌన్సిలర్ లింగదల్లిరవికుమార్, నాయకులు జనార్ధన్‌రెడ్డి, కల్వ సుజాత తదితరులున్నారు. -
సమస్యలు పరిష్కరించే వరకు దీక్షలు
ఆదిలాబాద్ అర్బన్ : ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లోని కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు పరిష్కరించే వరకు నిరవధిక రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ రాష్ట్ర నాయకుడు కొప్పిశెట్టి సురేష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట కాంట్రాక్టు లెక్చరర్లు చేపట్టిన నిరవధిక రిలే నిరాహార దీక్షల్లో కూర్చున్న వారికి ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి అనేక విధాలుగా విన్నవించినా సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. కాంట్రాక్టు అధ్యాపకులను ప్రభుత్వ క్రమబద్ధీకరిస్తామని చెప్పి ఇంతవరకు రెగ్యులర్ చేయకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఒప్పంద అధ్యాపకులను వెంటనే క్రమబద్ధీకరించాలని అన్నారు. ఒకేషనల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. మహిళా అధ్యాపకులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని, జిల్లా సగటు ఉత్తీర్ణత శాతాన్ని ఎత్తివేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోమవారం దీక్షలో ప్రవీణ్‌కుమార్, రమేష్, వెంకటేష్, సూర్యకాంత్, ఉపేందర్‌రెడ్డి, నామ్‌దేవ్, లక్ష్మణ్, హరి, ఆశోక్‌రెడ్డి, దేవేందర్ కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు లెక్చరర్లు పాల్గొన్నారు. -
నిర్మల్‌ను జిల్లాగా చేయాల్సిందే..!
► లేదంటే తెలంగాణ స్ఫూర్తితో ఉద్యమిస్తాం ► అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్మల్‌రూరల్ : ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్మల్ కేంద్రంగా కొత్తజిల్లాను ప్రకటించాలని, లేనిపక్షంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో జిల్లా ఏర్పడే వరకు ఉద్యమిస్తామని అఖిలపక్షాల నాయకులు ముక్తకంఠంతో నినదించారు. నిర్మల్‌ను జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక వివేక్చౌక్లో వివిధ పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, యువజన సంఘాల వారు రాస్తారోకో చేపట్టారు. దీంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎలాంటి అర్హతలు లేని కొన్నిప్రాంతాలను జిల్లాలుగా ప్రకటించిన ప్రభుత్వం అన్ని అర్హతలున్న నిర్మల్‌ను విస్మరించడం శోచనీయమన్నారు. ముథోల్, బాసర్, భైంసా, ఖానాపూర్, కడెం, బోథ్, నేరేడిగొండ తదితర ప్రాంతాల ప్రజలకు మధ్యలో ఉన్న నిర్మల్ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలన్నారు. సర్కారు పేర్కొన్న నిబంధనల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో నిర్మల్ జిల్లా ఏర్పాటు కావల్సిందేనని చెప్పారు. ప్రజల బలమైన ఆకాంక్షతో పాటు ఈ ప్రాంత అవసరాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. జిల్లాను సాధించుకునే వరకు తీరొక్క నిరసనలతో ముందుకు సాగుతామన్నారు. ఇందులో భాగంగా శనివారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నామన్నారు. జిల్లా సాధనోద్యమంలో అన్నిసంఘాలు, వర్గాల వారు పాల్గొనాలని సాధన సమితి సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సాధన సమితి గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ప్రమోద్‌చంద్రారెడ్డి, కన్వీనర్ నాయిడి మురళీధర్, కో-కన్వీనర్ వెంకటేశ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామలింగం, జమాల్, పద్మాకర్, బీజేపీ నాయకులు శశివర్మ, హరివర్మ, రాజులదేవి శ్రీనివాస్, రాజేందర్, టీడీపీ పట్టణాధ్యక్షుడు గండ్రత్ రమేశ్, సీనియర్ కమ్యూనిస్ట్ నాయకుడు ఎస్‌ఎన్‌రెడ్డి, పలువురు మైనార్టీ సెల్ నాయకులు, టీవీవీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కృష్ణంరాజు, టీఎన్జీవోస్ తాలూక అధ్యక్షుడు ప్రభాకర్, ఎస్టీయూ బాధ్యులు లక్ష్మణ్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
నేటి నుంచి హోదా పోరు
21 వరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలేనిరాహార దీక్షలు 18న అన్ని చోట్లా ర్యాలీలు, సమావేశాలు ప్రత్యేక హోదా వచ్చే వరకు ఆగదు ఈ పోరాటం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆనందపేట (గుంటూరు): అక్టోబరు 17 నుంచి 21వ తేదీ వరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలేనిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. గుంటూరు అరండల్‌పేటలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ 17న రిలే నిరాహార దీక్షలు ప్రారంభమవుతాయన్నారు. 18వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, అనంతరం సమావేశాలు నిర్వహించనున్నామన్నారు. 19న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నా,20న మండల కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించున్నామన్నారు. 21వ తేదీన జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల వద్ద ధర్నాలు చేపట్టనున్నామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు పోరాటం చేయాలని పార్టీ ఈ కార్యక్రమాలను చేపట్టనుందన్నారు. పార్టీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జిలు, నాయకులు, కార్యకర్తలను కలుపుకొని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. -
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
ఖమ్మం (చింతూరు) : విలీన మండలాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చింతూరులో విద్యార్థులు రిలే నిరాహార దీక్షకు పూనుకున్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని, చింతూరులో బస్ డిపో ఏర్పాటు చేసి తక్షణమే బస్ పాస్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూనవరం మండలంలోని బాలికల గురుకుల పాఠశాలను కళాశాలగా అప్‌గ్రేడ్ చేయాలని, విలీన మండలాల్లో ప్రభుత్వ డిగ్రీ, బీఈడీ, డైట్ కళాశాలు ఏర్పాటు చేయాలని కోరారు. -
ప్రత్యేక హోదా ఇచ్చే దాకా విశ్రమించం
అనంతపురం అర్బన్ : ప్రజలకు మాయ మాటలు చెప్పారు? అమలు కానీ హామీలిచ్చి పదవులు అనుభవిస్తున్నారు. విభజన చట్టంలో నమోదు చేసిన ప్రత్యేక హోదా తీసుకురావడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పది నెలలు ఓపిగ్గా భరించాం. సహనం కోల్పోయి ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమయ్యాం. ప్రత్యేక హోదా సాధించే వరకు విశ్రమించం.. అంటూ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, మాజ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, బొత్స సత్యనారాయణ, శైలజానాథ్ వెల్లడించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రతిపత్తి, నిధులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి తదితర అంశాలపై కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట సోమవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. నగర అధ్యక్షులు దాదాగాంధీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ రిలే దీక్షలు ఈ నెల 20 వరకు కొనసాగిస్తారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం రాజధాని నిర్మాణానికి రూ.4 ల క్షల కోట్లు అడిగిన ఈ పెద్దమనిషి.. ఇప్పుడు ఎందుకు నోరు మెదపడని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. పది నెలల పాలన పూర్తయినా రాష్ట్రానికి సంబంధించి ఏ ఒక్క విషయంలోనూ ముందుకు వెళ్లలేకపోయారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో మీకు ఇంత నిర్లక్ష్యం ఎందుకంటూ ప్రశ్నించారు. మీకు చేతకాకపోతే మమ్మలను కలుపుకోండి కేంద్రంపై పోరాడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధికి ఏడాదికి రూ. లక్ష కోట్లు చొప్పున ఐదేళ్లు రూ.5లక్షల కోట్లు కేటాయించాలని తమ ప్రభుత్వం అప్పట్లో విభజన చట్టంలో పొందపరిచింది.. వాటిని తీసుకురావడంలో ఎందుకు నిర్లక్ష్యం అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్ హయాంలోనే కోట్ల రూపాయలు ఖర్చు పెడితే.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ముష్టి రూ. 100 కోట్లు కేటాయిస్తే చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను నిట్టనిలువునా మోసం చేసిన పెద్దమనిషి వెంకయ్యనాయుడు అని దుయ్యబట్టారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక నిధులు తీసుకురావయ్యా అంటే.. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని, మలేషియాలా మారుస్తానని రూ. 20 కోట్ల ప్రజా సొమ్ము దుర్వినియోగం చేసి ప్రత్యేక విమానంలో పర్యటనలు చేశారని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అపద్ధాలను భూతద్ధంలో చూపించి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కవ్.. ఇక ఐదు సంవత్సరాలు ఏమవుతుందిలే.. అనుకుంటున్నావేమో... వదిలే ప్రసక్తే లేద ంటూ హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే తాగునీటి సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది. లక్షలాది మంది పింఛన్లు కోల్పోయారు. తమ ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు అర్ధంతరంగా ఆగిపోయాయి. వీటిపై నీ స్పందన ఏమిటి బాబు అని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తి చేయడంలో ఐదు సంవత్సరాలు కాదు కాదా..? పది సంవత్సరాల్లో కూడా పూర్తి చేయలేరు. మా ఆనం రామనారాయణరెడ్డికి మీ మంత్రి కొలువులో రెండు సంవత్సరాలు నీటి పారుదల శాఖ మంత్రిగా పదవి ఇవ్వండి.. ప్రాజెక్టులను పూర్తి చేసి రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు తక్కువ కాకుండా సాగు, తాగునీరు అందించి చూపిస్తాం.. అంటూ చంద్ర బాబుకు రఘువీరా సవాల్ విసిరారు. జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడానికి రూ. 1100ల కోట్లు పంటల బీమాకు మేము నిధులిస్తే.. వాటిని కూడా రైతులకు ఇవ్వకుండా మోసం చేస్తున్నావ్..? నిన్ను నడిరోడ్డులో నిలదీసే రోజులు దగ్గరపడ్డాయంటూ ధ్వజమెత్తారు. హంద్రీ-నీవాకు రూ. 500 కోట్లు ఖర్చుపెట్టి జిల్లాకు సాగు, తాగునీరు తెచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కిందన్నారు. శిలఫలాలకే పరిమితం చేసిన హంద్రీ-నీవాను 90 శాతం పూర్తి చేస్తే.. మిగిలిన 10శాతం పనులు పూర్తి చేయడానికి రూ. 1600ల కోట్లు అవసరం ఉండగా.. కేవలం రూ. 212 కోట్లు బడ్జెట్లో కేటాయించి పెళ్లికూతురికి చదివింపులు ఇచ్చినట్లుగా చంద్రబాబు హంద్రీ-నీవాకు నిధులు కేటాయించారని ఎద్దేవా చేశారు. మొదటి రోజు దీక్షలో భాగంగా పెనుకొండ, కదిరి, శింగనమల నియోజకవర్గాల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్, నాయకులు కేటీ శ్రీధర్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కెవి రమణ, గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ బొమ్మలాటపల్లి నరసింహరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, డాక్టర్ గోవర్ధన్‌రెడ్డి, బీసీ నాగరాజు, అనిల్‌కుమార్, నారాయణమ్మ, లక్ష్మిదేవి, వనజాక్షి, వశికేరి శివ, మైనార్టీ నాయకులు షహానాజ్, హరీఫ్, హైదర్‌వలి, రమణారెడ్డి, రామచరణ్‌తేజ్, శంకర్, వంశీ, కొండారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు సేవల చిరస్మరణీయం రాష్ట్రానికి పొట్టి శ్రీరాములు చేసిన సేవలు చిరస్మరణీయమని ఏపీ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు దాదాగాంధీ అధ్యక్షతన చేపట్టిన రిలే నిరాహారదీక్ష కార్యక్రమానికి విచ్చేసిన రఘువీరారెడ్డి, మాజీ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, బొత్స సత్యనారాయణ, సాకే శైలజనాథ్ తదితరులు సోమవారం పొట్టి శ్రీరాముల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలు ఆర్పించారని తెలిపారు. ఐఎంఎం మద్దతు కాంగ్రెస్ రిలే దీక్షలకు ఐఎంఎం పార్టీ మద్దతు పలికింది. ఈ సందర్భంగా ఐఎంఎం అధ్యక్షుడు ఎస్.మహబూబ్‌బాషా మాట్లాడుతూ... రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించి, పోలవరం ప్రాజెక్టుకు రూ. 10 వేల కోట్లు నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహమ్మద్ రఫిక్, నేతలు అమీర్, మహబూబ్, అబ్దుల్ జబ్బర్, నబీరసూల్, నజీర్ హుస్సేన్, లాలు, బాబా ఫకృద్దీన్ పాల్గొన్నారు. -
‘హైకోర్టు’ కోసం ఆందోళన
నిజామాబాద్ క్రైం : తెలంగాణలో ప్రత్యేకంగా హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ఎల్ శాస్త్రి, ప్రధాన కార్యదర్శి నారాయణరెడ్డిల ఆధ్వర్యంలో మూడు రోజులపాటు కోర్టు బయట రిలే దీక్షలు చేసిన న్యాయవాదులు.. గురువారం కోర్టు ప్రధాన ద్వారం ముందు బైఠాయించారు. ప్రధాన ద్వారం తలుపులు మూసివేసి దీక్షను కొనసాగించారు. కోర్టు లోపలకు ఎవరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. జిల్లా జడ్జి షమీమ్ అక్తర్, అడిషనల్ జడ్జీలు జగ్జీవన్‌కుమార్, తిర్మలాదేవి, రవీందర్‌సింగ్, సబ్ జడ్జి బందె అలీ, మెజిస్ట్రేట్లు సరిత, కిరణ్, యువరాజు, రాధాకృష్ణ చౌహాన్లనూ లోపలికి వెళ్లనివ్వలేదు. దీంతో జడ్జీలు కోర్టు ప్రాంగణంలోని డీఎల్ఎస్ భవనంలో కూర్చోవాల్సి వచ్చింది. ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉందని చెప్పినా జిల్లా జడ్జిని వెళ్లనివ్వలేదు. దీంతో ఆయన మరో ద్వారా గుండా లోపలికి వెళ్లారు. అంతకు ముందు న్యాయవాదులు విధులకు అటంకాలు కలిగిస్తున్నారని జిల్లా జడ్జి ఒకటో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్హెచ్ఓ శ్రీనివాసులు పోలీసుల బలగాలతో కోర్టుకు వచ్చారు. ప్రధాన ద్వారం వద్దనుంచి వెళ్లాల్సిందిగా న్యాయవాదులను కోరినా వినిపించుకోలేదు. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో న్యాయవాదులు ప్రధాన ద్వారం వద్దనుంచి దీక్షా శిబిరానికి వెళ్లారు. దీక్షలకు మద్దతు * నాలుగో రోజు దీక్షలో న్యాయవాదులు రమాదేవి, సుమ, ప్రేమలత, భావన, వరలక్ష్మి, మితల్కుమారి, వెంకట్ రమణగౌడ్, షహనాజ్ ఆరా, సుభద్ర, అజితారెడ్డి, స్వరూప కూర్చున్నారు. న్యాయవాదులు రాజేంధర్‌రెడ్డి, తుల గంగాధర్, ఎర్రం గణపతి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. * ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టం ఏర్పడి ఎనిమిది నెలలు దాటినా ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయకపోవడం సరికాదన్నారు. కొత్తగా జడ్జీల నియూమకాలు చేపడుతూ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయవద్దని కోరారు. సీమాంధ్ర జడ్జీల పెత్తనం వల్లే తెలంగాణ హైకోర్టు ఏర్పాటు కావటం లేదని ఆరోపించారు. తక్షణమే హైకోర్టును ఏర్పాటు చేయూలని డిమాండ్ చేశారు. -
‘హైకోర్టు’ కోసం రెండో రోజు దీక్ష
నిజామాబాద్ లీగల్ :తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు జిల్లా కోర్టు ఆవరణలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం రెండో రోజుకు చేరాయి. రెండో రోజు దీక్షలో మంజీత్ సింగ్, సీహెచ్ సాయిలు, సతీశ్ కుమార్, గోవర్ధన్, సత్యనారాయణ గౌడ్ కూర్చున్నారు. దీక్షా శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ సందర్శించి, దీక్షలకు సంఘీభావం తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎన్ఎల్ శాస్త్రి, నారాయణరెడ్డి, ప్రతినిధులు శ్రీనివాస్, మాణిక్ రాజు, జగన్మోహన్ గౌడ్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. నేడు తెయూ బంద్ తెయూ(డిచ్పల్లి) : తెలంగాణ ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు చేపట్టిన దీక్షకు మద్దతుగా బుధవారం తెలంగాణ యూనివర్సిటీ బంద్‌కు పిలుపునిచ్చినట్లు లా విద్యార్థులు తెలిపారు. మంగళవారం వర్సిటీ లా కళాశాల విద్యార్థులు సంతోష్ గౌడ్, నవీన్ కుమార్, రాజేశ్వర్, శేఖర్, నాగార్జున, జైపాల్ విలేకరులతో మాట్లాడారు. హైకోర్టు విభజన చేయకుండా కావాలనే కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు. ఇప్పుడున్న హైకోర్టులో సీమాంధ్రుల ఆధిపత్యం కొనసాగుతోందన్నారు. వెంటనే హైకోర్టును విభజించాలని డిమాండ్ చేశారు. బంద్‌కు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్‌గౌడ్, టీఎస్ జేఏసీ జిల్లా చైర్మన్ యెండల ప్రదీప్, ఏబీవీపీ తెయూ ఇన్చార్జి రమణ, ఎన్ఎస్యూఐ తెయూ ఇన్చార్జి రాజ్‌కుమార్, టీజీవీపీ ఇన్చార్జి మనోజ్ మద్దతు ప్రకటించారు. -
రోడ్డెక్కిన ఎస్పీఎం కార్మికులు
కాగజ్‌నగర్‌టౌన్ : కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం(సిర్పూర్ పేపర్‌మిల్లు) తెరిపించాలనే డిమాండ్‌తో కార్మికులు చేపట్టిన ఆందోళన రోజు రోజుకు ఉధృతమవుతోంది. ఓ వైపు కార్మికుల రిలే నిరాహార దీక్షలు మంగళవారం రెండో రోజుకు చేరాయి. కార్మికులకు సంఘీభావంగా అంగన్వాడీ కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. మిల్లులో తక్షణమే ప్రారంభించి ఉత్పత్తి ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎస్పీఎం కార్మికులు మంగళవారం రోడ్డెక్కారు. కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ ముందు నుంచి నాయకులు, కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు భారీ సంఖ్యలో పాదయాత్రగా ఎన్టీఆర్ చౌరస్తాకు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. మిల్లును ప్రారంభించే వరకు ఆందోళనలు, శాంతియుత పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రెండు గంటలపాటు కొనసాగిన రాస్తారోకో ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. పట్టణ సీఐ జలగం నారాయణరావు, ఎస్సై అబ్దుల్‌మజీద్‌లు రాస్తారోకో విరమింపజేశారు. విద్యార్థుల ర్యాలీ ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ పిలుపు మేరకు పట్టణంలో కళాశాలలు, పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఏబీవీపీ నాయకుడు అన్నం నాగార్జున, ఎస్ఎఫ్ఐ నాయకులు కుబిడె రాకేష్, ఎన్నం ఆశోక్ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. పేపర్‌మిల్లు ఎదుట దీక్షా శిబిరానికి చేరుకుని కార్మికులకు సంఘీభావం తెలిపారు. సీఐటీయూ నాయకులు ముంజం ఆనంద్ ఆధ్వర్యంలో అంగన్వాడీలు మార్కెట్లో భారీ ర్యాలీ నిర్వహించి, కార్మికులకు మద్దతు పలికారు. ఆందోళనలు, నిరసనల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండో రోజుకు రిలే దీక్షలు మిల్లు తెరిపించాలని, కార్మికులకు నెల నెల వేతనాలు చెల్లించాలనే డిమాండ్‌తో కార్మిక సంఘాల ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో కార్మికులు మిల్లు ఎదుట చేపట్టిన రిలేదీక్షలు మంగళవారం రెండో రోజుకు చేరాయి. దీక్షలో కార్మికులు వేముల వెంకటేష్, వికాస్‌నాయక్, ఎన్,రాజయ్య, అంబాల అంజయ్య, బస్వచార్యులు, శ్రీనివాసన్, కొరగంటి చంద్రయ్య, బి.సుభాష్, చంద్రశేఖర్, కోట శంకర్ కూర్చున్నారు. కార్మిక సంఘాల ఐక్య కార్యచరణ సమితి నాయకులు ఈర్ల విశ్వేశ్వర్రావు, కూశన రాజన్న, షబ్బీర్ అహ్మద్(ఛోటా), మురళీ, అంబాల ఓదేలు, ముంజం శ్రీనివాస్, వెంకటేష్, కార్మికులు పాల్గొన్నారు.