ఖమ్మం (చింతూరు) : విలీన మండలాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చింతూరులో విద్యార్థులు రిలే నిరాహార దీక్షకు పూనుకున్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని, చింతూరులో బస్ డిపో ఏర్పాటు చేసి తక్షణమే బస్ పాస్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూనవరం మండలంలోని బాలికల గురుకుల పాఠశాలను కళాశాలగా అప్‌గ్రేడ్ చేయాలని, విలీన మండలాల్లో ప్రభుత్వ డిగ్రీ, బీఈడీ, డైట్ కళాశాలు ఏర్పాటు చేయాలని కోరారు.