
ప్రతీకాత్మక చిత్రం
తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం చోటుచేసుకుంది. కన్న తండ్రే కూతురిపాలిట యముడయ్యాడు. భార్యపై అనుమానం పెంచుకుని కన్న కూతురిని హత్య చేశాడు. కర్ణాటక రాష్ట్రం బీదర్ ప్రాంతానికి చెందిన రాజు స్థానికంగా నివాసం ఉంటూ కోనాపూర్‌లోని శ్రీ లక్ష్మీ నరసింహ పాలిష్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. ఆయనకు ఐదేళ్ల కూతురు ఉంది. ఇటీవల తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. కూతురు తనకు పుట్టలేదని అనుమానంతో ఆ చిన్నారిని చంపి సుద్ధగని గుంతలో పడేశాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment