జ్యుడీషియల్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌లో టాపర్‌గా పాన్‌షాప్‌ యజమాని కూతురు! | Nishi Gupta Paan Shop Owners Daughter Topper In UP Judicial Services | Sakshi
Sakshi News home page

Nishi Gupta: జ్యుడీషియల్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌లో టాపర్‌గా పాన్‌షాప్‌ యజమాని కూతురు!

Published Thu, Aug 31 2023 3:33 PM | Last Updated on Thu, Aug 31 2023 6:43 PM

Nishi Gupta Paan Shop Owners Daughter Topper In UP Judicial Services  - Sakshi

సామాన్యుల పిల్లలు అసామాన్య ప్రతిభతో టాప్‌ విద్యాసంస్థల్లో చదివే పిల్లలతో పోటీ పడి విజేతలయ్యారు. ఇలాంటి ఘటనలు ఎన్నో చూశాం. సాధించాలనే తపన ఉంటే ఎవ్వరైన విజయం సాధించొచ్చు అని చూపిన ఘటనలు అవి. అదే కోవకు చెందింది ఉత్తరప్రదేశ్‌కి చెందిన నిషి గుప్తా. ఆమె ప్రతిష్టాత్మకమైన జ్యూడీషియల్‌ సర్వీసెస్‌లో సత్తా చాటి టాపర్‌గా నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

వివరాల్లోకెళ్తే..ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కి చెందిన నిషి గుప్తా పాన్‌ షాప్‌ యజమాని కూతురు. ఆమె బుధవారం ప్రకటించిన ప్రోవిన్షియల్‌ సివిల్‌ సర్వీస్‌ జ్యుడీషియల్‌ ఎగ్జామ్‌లో సత్తా చాటింది. ఏకంగా ప్రథమ స్థానంలో నిలిచి శభాష్‌  అనిపించుకుంది నిషి గుప్తా. తొలి ప్రయత్నంలోనే నిషి ఈ పరీక్షలో ఉత్తీర్ణ సాధించడం విశేషం. లాలో గ్రాడ్యుయేట్‌ చేసినవారందరూ ఈ పరీక్షకు అర్హులు.

ఇది జడ్డిలుగా ఎంపిక చేయడానికి పెట్టే ఎంట్రీ లెవెల్‌ ఎగ్జామ్‌. ఆ పరీక్షలో నిషి గుప్తా ప్రథమ స్థానం దక్కించుకుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారిని జిల్లా, మెజిస్ట్రేట్‌, అటర్నల్‌ జనరల్‌, సబ్‌ మెజిస్ట్రేట్, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తదితరాలుగా ఎంపిక అవ్వుతారు. వీరిని హైకోర్టు ఎంపిక చేస్తుంది. ఇక  నిషి పాఠశాల విద్యను ఫాతిమా కాన్వెంట్‌లో పూర్తి చేసింది. ఇక గ్రాడ్యేయేషన్‌ని 2020లో పూర్తి చేసింది.

కాగా, ఉత్తరప్రదేశ్‌ సీఎం ఆదిత్య యోగినాథ్‌ ఉత్తరప్రదేశ్‌ ప్రోవిన్షియల్‌ సివిల్‌ సర్వీస్‌ జ్యుడీషియల్‌ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించిన తమ రాష్ట్ర అభ్యర్థులందర్నీ అభినందించారు. ఈ పరీక్షలో 55 శాతం మంది బాలికలు విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. కుమార్తెలు మమ్మల్ని గర్విచేలా చేశారని అభినందించారు కూడా. 

(చదవండి: ఆ ఏజ్‌లో లీడర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమెను చూసి.. షాకవ్వడం ఖాయం!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement