judicial service
-
జ్యుడీషియల్ సర్వీస్ ఎగ్జామ్‌లో టాపర్‌గా పాన్‌షాప్ యజమాని కూతురు!
సామాన్యుల పిల్లలు అసామాన్య ప్రతిభతో టాప్ విద్యాసంస్థల్లో చదివే పిల్లలతో పోటీ పడి విజేతలయ్యారు. ఇలాంటి ఘటనలు ఎన్నో చూశాం. సాధించాలనే తపన ఉంటే ఎవ్వరైన విజయం సాధించొచ్చు అని చూపిన ఘటనలు అవి. అదే కోవకు చెందింది ఉత్తరప్రదేశ్‌కి చెందిన నిషి గుప్తా. ఆమె ప్రతిష్టాత్మకమైన జ్యూడీషియల్ సర్వీసెస్‌లో సత్తా చాటి టాపర్‌గా నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకెళ్తే..ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కి చెందిన నిషి గుప్తా పాన్ షాప్ యజమాని కూతురు. ఆమె బుధవారం ప్రకటించిన ప్రోవిన్షియల్ సివిల్ సర్వీస్ జ్యుడీషియల్ ఎగ్జామ్‌లో సత్తా చాటింది. ఏకంగా ప్రథమ స్థానంలో నిలిచి శభాష్ అనిపించుకుంది నిషి గుప్తా. తొలి ప్రయత్నంలోనే నిషి ఈ పరీక్షలో ఉత్తీర్ణ సాధించడం విశేషం. లాలో గ్రాడ్యుయేట్ చేసినవారందరూ ఈ పరీక్షకు అర్హులు. ఇది జడ్డిలుగా ఎంపిక చేయడానికి పెట్టే ఎంట్రీ లెవెల్ ఎగ్జామ్. ఆ పరీక్షలో నిషి గుప్తా ప్రథమ స్థానం దక్కించుకుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారిని జిల్లా, మెజిస్ట్రేట్, అటర్నల్ జనరల్, సబ్ మెజిస్ట్రేట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ తదితరాలుగా ఎంపిక అవ్వుతారు. వీరిని హైకోర్టు ఎంపిక చేస్తుంది. ఇక నిషి పాఠశాల విద్యను ఫాతిమా కాన్వెంట్లో పూర్తి చేసింది. ఇక గ్రాడ్యేయేషన్ని 2020లో పూర్తి చేసింది. కాగా, ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్య యోగినాథ్ ఉత్తరప్రదేశ్ ప్రోవిన్షియల్ సివిల్ సర్వీస్ జ్యుడీషియల్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించిన తమ రాష్ట్ర అభ్యర్థులందర్నీ అభినందించారు. ఈ పరీక్షలో 55 శాతం మంది బాలికలు విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. కుమార్తెలు మమ్మల్ని గర్విచేలా చేశారని అభినందించారు కూడా. (చదవండి: ఆ ఏజ్‌లో లీడర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమెను చూసి.. షాకవ్వడం ఖాయం!) -
జిల్లాకో న్యాయసేవాధికార సంస్థ ! 23 కొత్త జిల్లాల్లో ఏర్పాటుకు నిర్ణయం
సాక్షి, కామారెడ్డి: పేదలకు ఉచితంగా న్యాయ సలహాలు, సేవలు అందించే న్యాయసేవాధికార సంస్థలు కొత్త జిల్లాల్లోనూ ఏర్పాటు అవుతున్నాయి. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాగానే కొనసాగాయి. అయితే సేవలు మరింత చేరువ అయ్యేందుకు తెలంగాణ న్యాయసేవాధికార సంస్థ 23 కొత్త జిల్లాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెల 2న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ వర్చువల్‌గా ఏకకాలంలో అన్ని జిల్లాల్లో ప్రారంభించనున్నారు. తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.నవీన్‌రావు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 23 కొత్త జిల్లాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థలను చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రారంభిస్తారు. తెలంగాణ ప్రభుత్వం 2016లో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తగా 23 జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆయా జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాలను ప్రారంభించింది. తరువాత కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాల సముదాయాలను నిర్మించింది. అయితే న్యాయస్థానాలకు సంబంధించి విభజన ప్రక్రియ కొంత ఆలస్యంగా జరిగింది. ఇటీవలే కొత్త జిల్లాల్లో జిల్లా న్యాయస్థానాలను ఏర్పాటు చేసింది. అంతేగాక కొత్త జిల్లాల్లో పోక్సో కేసుల విచారణకు కోర్టులను ఏర్పాటు చేసింది. ఇప్పుడు జిల్లా న్యాయసేవాధికార సంస్థలను ఏర్పాటు చేస్తోంది. ఇంకా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ ట్రిబ్యునళ్లు, కోర్టులు రావలసి ఉంది. అవి కూడా త్వరలోనే ఏర్పాటయ్యే అవకాశం ఉంది. కాగా కొత్త జిల్లాల్లో న్యాయస్థానాల సముదాయాల నిర్మాణానికి భూసేకరణ కూడా చేపట్టారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థల ద్వారా పేదలకు ఉచిత న్యాయసేవలు, సహాయం అందనుంది. అంతేగాక చిన్న చిన్న విషయాలకు సంబంధించిన కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరిగే వారిని కౌన్సెలింగ్ చేయడం ద్వారా ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చి కేసులను పరిష్కరిస్తారు. చదవండి: Telangana: గ్రూప్–4లో 8,039 పోస్టులే! -
న్యాయమైన ఆశయం
పెద్దవాళ్లు, చుట్టుపక్కల వాళ్లు చేసేది చూసి పిల్లలు అనుకరిస్తుంటారు. కొంతమంది అనుకరణతో ఆగిపోకుండా వాళ్లలాగే తామూ ఎదగాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని ఆ దిశగా అడుగులు వేస్తుంటారు. ఈ కోవకు చెందిన అమ్మాయే 23 ఏళ్ల కార్తీక గెహ్లాట్. తండ్రి ఉద్యోగరీత్యా డ్రైవర్. న్యాయమూర్తులను కోర్టుకు తీసుకెళ్లడం ఆయన పని. చిన్నప్పటి నుంచి నాన్న నడిపే కారులో ఎంతో హుందాగా ఉండే న్యాయమూర్తులను దగ్గర నుంచి చూసిన కార్తీక తను కూడా జడ్జీ కావాలనుకుంది. నేను పెద్దయ్యాక నల్లకోటు ఆఫీసర్ అవుతాను అని అనుకరించి చూపిస్తూండేది. అది చూసిన వారంతా చిన్నపిల్ల చేష్టలనుకునేవారు. కానీ నేడు కార్తీక జుడీషియల్ సర్వీసెస్ పరీక్షలో మంచి మార్కులతో 66 ర్యాంకు సాధించి పిల్లచేష్టలు కాదు, మరికొన్నేళ్లలో జడ్జి్జని కాబోతున్నానని చెప్పకనే చెబుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. జోద్‌పూర్‌కు చెందిన రాజేంద్ర గెహ్లాట్ ముద్దుల కూతురే కార్తీక గెహ్లాట్. 31ఏళ్లుగా ప్రధాన న్యాయమూర్తులెందరికో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు రాజేంద్ర. రాజస్థాన్ హైకోర్టులో పనిచేస్తున్న ఎంతోమంది జడ్జీలను, లాయర్లను చూస్తూ పెరిగిన కార్తీక తాను కూడా పెద్దయ్యాక జడ్జి కావాలనుకునేది. ఆరోతరగతిలో ఉండగా నల్లకోటు వేసుకుని న్యాయస్థానంలో పనిచేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. అప్పటి నుంచి ఆదిశగా అడుగులు వేస్తూ... జో«ద్‌పూర్‌లోని సెయింట్ ఆస్టిన్ సీనియర్ సెకండరీ స్కూల్లో పాఠశాల విద్య పూర్తిచేసింది. ఇంటర్మీడియట్ తరువాత జై నారాయణ్ వ్యాస్ యూనివర్సిటీలో ఐదేళ్ల బిబిఏ.ఎల్ఎల్.బి. పూర్తిచేసింది. ఈ ఏడాదే డిగ్రీ పూర్తిచేసినప్పటికీ జడ్జీ అయ్యేందుకు 2019 నుంచి సన్నద్ధమవడం ప్రారంభించింది. ఒక పక్క సెమిస్టర్ పరీక్షల కోసం చదువుతూనే, మరోపక్క పిలిమినరీ, మెయిన్స్‌కు ప్రిపేర్ అయ్యేది. కరోనా సమయంలో ఆఫ్‌లైన్ క్లాసులు అందుబాటులో లేకపోవడంతో, ఆన్లైన్ తరగతులకు హాజరవుతూ సిలబస్ పూర్తిచేసింది. ఇదే సమయంలో అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గోవింద్ మాథూర్, జిల్లా సెషన్స్ జడ్జి మండల్ ప్రసాద్ బోహ్రాల వద్ద లా గైడెన్స్, అడ్వకేట్ ధర్మేంద్ర వద్ద ఏడాదిన్నరపాటు టెక్నికల్ గైడెన్స్, మాజీ ఐఏఎస్ అధికారి, తన మాజీ స్కూలు ప్రిన్సిపాల్ వంటివారందరి సలహాలు సూచనలతో రోజుకి నాలుగు గంటలు కష్టపడి చదివేది. పరీక్ష తేది ప్రకటించిన తరువాత ప్రిపరేషన్‌ను పది నుంచి పన్నెండు గంటలకు పెంచింది. సోషల్ మీడియా వినియోగం ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో అన్నింటికీ దూరంగా ఉండి తన లక్ష్యంపై దృష్టిపెట్టి రాజస్థాన్ జుడీషియల్ సర్వీసెస్ పరీక్షలో 66వ ర్యాంకు సాధించింది. దీంతో తన చిన్ననాటి కల జడ్జీ కావడానికి మొదటి అడుగు వేసింది. నేను న్యాయమూర్తులను కోర్టుకు తీసుకెళ్లడాన్ని అప్పుడప్పుడు కార్తీక చూసేది. అలా చూస్తూ పెరిగిన ఆమె 12 ఏళ్ల వయసులో ఒకరోజు నేను కూడా త్వరలో నల్లకోటు వేసుకుని జడ్జిని అవుతానని చెప్పింది. అప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. కార్తీక మాత్రం అప్పటి నుంచి జడ్జిఅవ్వాలన్న కలను నిజం చేసుకునేందుకు కష్టపడుతూనే ఉంది. వాళ్ల అమ్మకూడా∙తనని అన్ని విధాల సాయపడుతూ అండగా ఉండడంతో ఈ రోజు తన కలను సాకారం చేసుకుంది. ఏళ్లుగా ఎంతోమంది జడ్జీలను వెనుకసీట్లోకూర్చోపెట్టి తిప్పాను. భవిష్యత్‌లో నా కూతురు కూడా వారిలా వెనుకసీట్లో కూర్చోబోతున్నందుకు సంతోషంగా ఉంది. – కార్తీక తండ్రి రాజేంద్ర గెహ్లాట్ పెళ్లికాదని భయపడుతున్నారు చాలామంది తల్లిదండ్రులు తమ కూతుర్లు లా చదువుతామంటే ఇష్టపడరు. లా చదివిన అమ్మాయిలకు పెళ్లిళ్లు కావు అని భయపడతారు. ఇలాంటి అపోహలు పోవాలంటే ప్రతి ఒక్కరికి చట్టం గురించిన ప్రాథమిక అవగాహన ఉండాలి. అప్పుడు తమ హక్కుల గురించి ధైర్యంగా పోరాడగలుగుతారు. నలుగురు సంతానంలో నేను ఒకదాన్ని. ప్రారంభంలో నా నిర్ణయాన్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. తర్వాత కష్టపడి చదవడం చూసి ప్రోత్సహించారు. వారి సహకారంతో ఈ రోజు ఇంతమంచి ర్యాంకును సాధించగలిగాను. నన్ను ప్రేరణగా తీసుకుని నా తోబుట్టువులు సైతం లా చదివేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. నా ప్రిపరేషన్లో ఆన్లైన్ యాప్స్‌తో పాటు, ఏకాగ్రతతో చదవడానికి సంగీతం చాలా బాగా ఉపయోగపడ్డాయి. – కార్తీక -
మీ కోసమే కోర్టులు..
సాక్షి, తలమడుగు(బోథ్): సమస్యలు వస్తే అధికారులను నిలదీయండి.. ప్రజాప్రతినిధులను ప్రశ్నించండి.. లేదంటే కోర్టుకు రండి.. మీ సమస్య పరిష్కారానికి న్యాయం చూపిస్తామని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. అమర్నాథ్గౌడ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కుచులాపూర్ గ్రామంలో ఆదివారం న్యాయ సేవా సదస్సు నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామస్తులు గుస్సాడీ నృత్యాలు, డప్పు వాయిద్యాల మధ్య నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందజేసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ప్రశాంతి స్వాగతం పలికారు. జెడ్పీ పాఠశాల అవరణలో వ్యవసాయ శాఖ, రెవెన్యూ, హార్టికల్చర్, ఎస్సీ, బీసీ కార్పొరేషన్, ఐటీడీఏ, డీఆర్డీఏ, ఉద్యానవనశాఖ, విద్యాశాఖ, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రాంరంభించి మాట్లాడారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి న్యాయ సేవా సదస్సులు ఉపయోగపడుతాయని తెలిపారు. సమస్యలు న్యాయ సదస్సుల్లో తెలియజేయాలని అన్నారు. వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీ పర్యవేక్షించి సమస్యలు పరిష్కరిస్తుందన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన సదస్సులకు ప్రజలు నుంచి స్పందన వస్తుందన్నారు. గ్రామాల్లో చట్టాలపై అవగాహన లేక క్రైమ్‌లకు పాల్పడుతున్నారని అన్నారు. అక్రమ సంబంధం పెట్టుకుని భర్తను హతమర్చి ప్రియునితో ఉందమనుకుంటే జైలుకు వెళ్లారు అనే లాజిక్ మరిచి పోతున్నారని తెలిపారు. క్రైమ్‌లకు పాల్పడేవారిని అలాంటి వాటికి దూరంగా ఉండేలా స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలు, న్యాయ సేవా సంస్థల ఆధ్వర్యంలో కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఇలా క్రైమ్‌లకు పాల్పడకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నాలరు. న్యాయ సాయం కోరే వారికి ఎల్లప్పుడు కోర్టులు అండగా ఉంటాయని అన్నారు. గతంలో రైతులు భారీవర్షాలతో పంటలు పూర్తిగా నష్టపోవడం జరిగిందని అన్నారు. కరుణాకర్‌రెడ్డి హైకోర్టుకు రావడం జరిగిందని, దీంతో ఎంతో మంది రైతులకు నేడు నష్టపరిహారం రూ.12 కోట్ల 13 లక్షల84 వేలు అందించడం జరిగిందన్నారు. ప్రజలకు ఉచితంగా న్యాయ సేవాలను అందించడానికి జిల్లా స్థాయిలో జిల్లా కార్యదర్శి అందుబాటులో ఉండడం జరుగుతుందన్నారు. రాష్ఠ్ర స్థాయిలో కార్యదర్శి న్యాయ సేవా సదన్ సిటీ సివిల్ కోర్టు భవనంలో అందుబాటులో ఉంటుం దన్నారు. ఆస్తుల పంపిణీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను లబ్ధిదారులకు చెక్కులను రాష్ట్ర హైకోర్టు జడ్జి అందించారు. అలాగే ప్రభుత్వం నుంచి మంజూరైన వికాలంగులకు సైకిల్, కొత్తగా మంజురై పింఛన్లు రైతులకు కొత్త పట్టాపాసు పుస్తకాలు, స్పీంక్లర్లను, డ్రిప్‌ల అందించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజురై రుణాలను అందజేశారు. రైతులకు ఎడ్ల బండి, అటోలను, ట్రాలీని, వాహనాలను, కిరాణాలకు రుణాలను అందించారు. శాఖల వారీగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ప్రశాంతి, జిల్లా ప్రధాన న్యాయ మూర్తి ప్రియదర్శిని, న్యాయసేవా సంస్థ కార్యదర్శి ఉదయ్‌భాస్కర్, జీవన్, బార్ అసోసియోషన్ అధ్యక్షుడు టి.మోహన్‌సింగ్, జేసీ సంధ్యారాణి, ఎస్పీ విష్ణువారియర్, ట్రేని కలెక్టర్ అభిలాష అభినవ్, గోపి, డీఆర్డీ పీడీ రాజేశ్వర్, ఆర్డీవో సూర్యనారాయణ, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, డీఈవో రవీందర్‌రెడ్డి, తహసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్, జెడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డి, ఎంపీపీ లక్ష్మిరాజేశ్వర్, ఎంపీడీవో సునీత, ఎంఈవో కౌసల్య, గ్రామ సర్పంచ్ ప్రభు పాల్గొన్నారు. -
ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తులు
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా జడ్జి గౌస్‌బాష ఒక ప్రకటనలో తెలిపారు. మూడవ అడిషినల్ జడ్జి కోర్టులు కడప, రాజంపేటలో హెడ్‌క్లర్క్ ఒకటి, స్టెనో టైపిస్టు ఒకటి, క్లర్క్ కం టైపిస్టు ఒకటి, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు రాజంపేట, బద్వేలులో హెడ్ క్లర్క్ ఒకటి, స్టెనో టైపిస్టు ఒకటి, క్లర్ కం టైపిస్టు ఒక్క పోస్టు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులు త మ దరఖాస్తులను కడప జిల్లా కోర్టు వారికి జనవరి 17లోపు పంపించాలని తెలిపారు. జ్యుడిషియల్ సర్వీసులో ఉద్యోగ విరమణ చేసిన వారు, ఇతరులు అర్హులని తెలిపారు. జ్యుడిషియల్ సర్వీసులో ఉద్యోగ విరమణ పొంది 65 ఏళ్లు మించని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతరులు 2013వ సంవత్సరం జులై 1 నాటికి 18 ఏళ్లు పూర్తయి, 34 ఏళ్లలోపు కలిగిన వారు ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామన్నారు. నియామకాలు పూర్తి కాంట్రాక్టు పద్దతిలో ఉంటాయన్నారు.