మాట్లాడుతున్న హైకోర్టు జడ్జి టి.అమర్‌నాథ్‌గౌడ్
సాక్షి, తలమడుగు(బోథ్): సమస్యలు వస్తే అధికారులను నిలదీయండి.. ప్రజాప్రతినిధులను ప్రశ్నించండి.. లేదంటే కోర్టుకు రండి.. మీ సమస్య పరిష్కారానికి న్యాయం చూపిస్తామని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. అమర్‌నాథ్‌గౌడ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కుచులాపూర్ గ్రామంలో ఆదివారం న్యాయ సేవా సదస్సు నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామస్తులు గుస్సాడీ నృత్యాలు, డప్పు వాయిద్యాల మధ్య నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందజేసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ప్రశాంతి స్వాగతం పలికారు. జెడ్పీ పాఠశాల అవరణలో వ్యవసాయ శాఖ, రెవెన్యూ, హార్టికల్చర్, ఎస్సీ, బీసీ కార్పొరేషన్, ఐటీడీఏ, డీఆర్‌డీఏ, ఉద్యానవనశాఖ, విద్యాశాఖ, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రాంరంభించి మాట్లాడారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి న్యాయ సేవా సదస్సులు ఉపయోగపడుతాయని తెలిపారు. సమస్యలు న్యాయ సదస్సుల్లో తెలియజేయాలని అన్నారు. వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరానికి కృషి చేస్తామని తెలిపారు.
ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీ పర్యవేక్షించి సమస్యలు పరిష్కరిస్తుందన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన సదస్సులకు ప్రజలు నుంచి స్పందన వస్తుందన్నారు. గ్రామాల్లో చట్టాలపై అవగాహన లేక క్రైమ్‌లకు పాల్పడుతున్నారని అన్నారు. అక్రమ సంబంధం పెట్టుకుని భర్తను హతమర్చి ప్రియునితో ఉందమనుకుంటే జైలుకు వెళ్లారు అనే లాజిక్ మరిచి పోతున్నారని తెలిపారు. క్రైమ్‌లకు పాల్పడేవారిని అలాంటి వాటికి దూరంగా ఉండేలా స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలు, న్యాయ సేవా సంస్థల ఆధ్వర్యంలో కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఇలా క్రైమ్‌లకు పాల్పడకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నాలరు. న్యాయ సాయం కోరే వారికి ఎల్లప్పుడు కోర్టులు అండగా ఉంటాయని అన్నారు. గతంలో రైతులు భారీవర్షాలతో పంటలు పూర్తిగా నష్టపోవడం జరిగిందని అన్నారు. కరుణాకర్‌రెడ్డి హైకోర్టుకు రావడం జరిగిందని, దీంతో ఎంతో మంది రైతులకు నేడు నష్టపరిహారం రూ.12 కోట్ల 13 లక్షల84 వేలు అందించడం జరిగిందన్నారు. ప్రజలకు ఉచితంగా న్యాయ సేవాలను అందించడానికి జిల్లా స్థాయిలో జిల్లా కార్యదర్శి అందుబాటులో ఉండడం జరుగుతుందన్నారు. రాష్ఠ్ర స్థాయిలో కార్యదర్శి న్యాయ సేవా సదన్ సిటీ సివిల్ కోర్టు భవనంలో అందుబాటులో ఉంటుం దన్నారు.
ఆస్తుల పంపిణీ
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను లబ్ధిదారులకు చెక్కులను రాష్ట్ర హైకోర్టు జడ్జి అందించారు. అలాగే ప్రభుత్వం నుంచి మంజూరైన వికాలంగులకు సైకిల్, కొత్తగా మంజురై పింఛన్లు రైతులకు కొత్త పట్టాపాసు పుస్తకాలు, స్పీంక్లర్లను, డ్రిప్‌ల అందించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజురై రుణాలను అందజేశారు. రైతులకు ఎడ్ల బండి, అటోలను, ట్రాలీని, వాహనాలను, కిరాణాలకు రుణాలను అందించారు. శాఖల వారీగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ప్రశాంతి, జిల్లా ప్రధాన న్యాయ మూర్తి ప్రియదర్శిని, న్యాయసేవా సంస్థ కార్యదర్శి ఉదయ్‌భాస్కర్, జీవన్, బార్ అసోసియోషన్ అధ్యక్షుడు టి.మోహన్‌సింగ్, జేసీ సంధ్యారాణి, ఎస్పీ విష్ణువారియర్, ట్రేని కలెక్టర్ అభిలాష అభినవ్, గోపి, డీఆర్‌డీ పీడీ రాజేశ్వర్, ఆర్‌డీవో సూర్యనారాయణ, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, డీఈవో రవీందర్‌రెడ్డి, తహసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్, జెడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డి, ఎంపీపీ లక్ష్మిరాజేశ్వర్, ఎంపీడీవో సునీత, ఎంఈవో కౌసల్య, గ్రామ సర్పంచ్ ప్రభు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment