ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా జడ్జి గౌస్‌బాష ఒక ప్రకటనలో తెలిపారు.
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా జడ్జి గౌస్‌బాష ఒక ప్రకటనలో తెలిపారు. మూడవ అడిషినల్ జడ్జి కోర్టులు కడప, రాజంపేటలో హెడ్‌క్లర్క్ ఒకటి, స్టెనో టైపిస్టు ఒకటి, క్లర్క్ కం టైపిస్టు ఒకటి, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు రాజంపేట, బద్వేలులో హెడ్ క్లర్క్ ఒకటి, స్టెనో టైపిస్టు ఒకటి, క్లర్ కం టైపిస్టు ఒక్క పోస్టు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.
అభ్యర్థులు త మ దరఖాస్తులను కడప జిల్లా కోర్టు వారికి జనవరి 17లోపు పంపించాలని తెలిపారు. జ్యుడిషియల్ సర్వీసులో ఉద్యోగ విరమణ చేసిన వారు, ఇతరులు అర్హులని తెలిపారు. జ్యుడిషియల్ సర్వీసులో ఉద్యోగ విరమణ పొంది 65 ఏళ్లు మించని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతరులు 2013వ సంవత్సరం జులై 1 నాటికి 18 ఏళ్లు పూర్తయి, 34 ఏళ్లలోపు కలిగిన వారు ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామన్నారు. నియామకాలు పూర్తి కాంట్రాక్టు పద్దతిలో ఉంటాయన్నారు.