కుత్బుల్లాపూర్ : పాన్‌షాప్‌లో కిల్లీ కట్టే సమయంలో వివాదం తలెత్తడంతో ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై బాహాబాహీకి దిగారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్, చింతల్ గణేశ్ నగర్ బస్టాప్ సమీపంలో శనివారం సాయంత్రం జరిగింది. మొదట ఇద్దరితో ప్రారంభమై.. ఆపై తొమ్మిది మంది..ఇలా ఒకరికొకరు తోడవుతూ నానా హంగామా సృష్టించారు.
సినీఫక్కీలో జరిగిన ఈ సంఘటనను అక్కడున్న వారంతా చూసి విస్తుపోయారు. కొందరు వ్యక్తులు 20 నిమిషాలపాటు వీరంగం సృష్టించారు. గణేష్ నగర్లో బస్సు దిగిన ప్రయాణికులు ఈ గొడవను చూసి భయంతో పరుగులు తీశారు. స్థానికులు 100కు ఫోన్ చేయడంతో జీడిమెట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
కిల్లీ దగ్గర వచ్చింది లొల్లి
Published Sat, Feb 14 2015 10:54 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM
Advertisement
Advertisement