పొగాకు నియంత్రణ చట్టం అమలుకు చర్యలు
Published Fri, Jul 22 2016 12:54 AM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
శ్రీకాకుళం పాతబస్టాండ్: పొగాకు నియంత్రణ చట్టం అమలుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జేసీ–2 పి.రజనీకాంతారావు ఆదేశించారు. తన చాంబర్‌లో జిల్లాస్థాయి పొగాకు నియంత్రణ కార్యక్రమం అమలు కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. పొగాకు నియంత్రణ చట్టం 2003 ప్రకారం సిగరెట్లు, సిగార్‌లు, బీడీలు, గుట్కా, పాన్ మసాలా, ఖైనీలను ఆస్పత్రులు, విద్యా సంస్థలు, గ్రంథాలయాలు, ఆడిటోరియం, స్టేడియం, రైల్వేస్టేషన్లు, బస్‌స్టాప్ వంటి ప్రాంతాల్లో అమ్మకం, సేవించడం నిషేధమన్నారు. పొగాకు ఉత్పత్తులపై ప్రచారం చేస్తే శిక్షార్హులని పేర్కొన్నారు. పాఠశాల, కళాశాల విద్యార్థులతో ర్యాలీ, మానవహారం నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మెండ ప్రవీణ్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రత్నకుమారి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ధవళ భాస్కరరావు, డీఐఓ డాక్టర్ ఎ.హేమంత్, దంతవైద్యులు డాక్టర్ వినోద్, డిప్యూటీ డీఈఓ ప్రభాకరరావు, ఆర్‌వీఎం పీఓ పాల్గొన్నారు.
Advertisement