ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని ఎన్నో రకాలుగా అవగాహన కల్పించినప్పటికీ చాలామంది ఆ చెడు అలవాట్లకు స్వస్తీ పలకారు. ముఖ్యంగా యువత దీన్ని ఒక ట్రెండ్ లేదా ఫ్యాషన్‌గా భావిస్తోంది. ముక్కుపచ్చలారని చిన్నారులు సైతం స్మోకింగ్ చేస్తున్నారు. పెద్దవాళ్ల కుంటపడకుండా జాగ్రత్తపడతూ వక్రమార్గంలో దీన్ని సేవిస్తున్నారు. అదోక వ్యసనంలా మారి..స్మోకింగ్ చేయకుండా ఉండలేని వారికోసం వచ్చిందే ఈ నికోటిన్ పౌచ్‌లు. ఏంటి పోగాకులో ఉండే నికోటిన్ ఇందులోనూ ఉంది కదా! ఆరోగ్యానికి హానికరమే కగా అనేగా మీ సందేహం. అయితే ఇది ఆరోగ్యానకి మంచిదేనట. ఎలాగంటే..
ఈ నికోటిన్ పౌచ్‌లు స్మోకింగ్ చేసే వాళ్లకి ఓ ప్రత్యామ్నాయం అనే చెప్పాలి. ఇది బాగా స్మోకింగ్‌కి అలవాటు పడ్డవాళ్లకి, స్మోకింగ్ మానేద్దామనుకునేవాళ్లకి మంచి సహాయకారి. ఇందులో నిర్జలీకరణ నికోటిన్ , స్వీటెనర్లు, సువాసనలతో కూడిన మొక్కల ఫైబర్లు ఉంటాయి. ఇది తింటే నోరు దుర్వాసన రాదు. ఇందులో హానికరమైన నికోటిన్ ఉండదు. పైగా ఈ పౌచ్‌లను నోటిలో పెట్టుకుని నమలడం వల్ల వారికి పొగ పీల్చిన ఫీలింగ్ వస్తుందే తప్ప ఏం కాదు.
ఆ తర్వాత రాను రాను వారికి తెలియకుండానే స్మోకింగ్ మానేస్తారు. ఇవి 17వ శతాబ్దం నుంచే ఉన్నాయట. అప్పట్లోనే వాటికి మంచి ప్రజాధరణ ఉండేదట. ఇప్పుడు మళ్లీ వాటిని వివిధ ఫ్లేవర్‌లలో ఇంకాస్తా ఆరోగ్యప్రదాయినిగా తయారుచేస్తున్నారు. వీటిని ఎక్కడికైనా ఈజీగా తీసుకుపోవచ్చు. అందరిముందు సేవించొచ్చు. కానీ ధుమపానం సేవించినట్లు అవతలివాళ్లకు తెలియదు. ఇక నోరు దుర్వాసన కూడా రాదు.
ఇంకోపక్క మీకు స్మోక్‌చేసిన అనుభూతి మీకు దక్కడమే గాక ఆరోగ్యం కూడా పదిలంగానే ఉంటుంది. ఈ నికోటిన్ పౌచ్‌లో స్వీడన్ విశేష ప్రజాధరణ ఉంది. ధూమాపానం అనే వ్యవసనం నుంచి బయటపడటానికి సులవైన మార్గమే.కానీ ఆయా వ్యక్తుల దృఢంగా నిర్ణయించుకుంటే ఆ చెడు వ్యసనం నుంచి బయటపడగలరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
(చదవండి: కండ్లకలక బారిన పడకుండా ఉండొచ్చా? వర్షాకాలంలోనే ఇవి వస‍్తాయా?)
Comments
Please login to add a commentAdd a comment