nicotine
-
నికోటిన్ పౌచ్‌లు తెలుసా!..దీంతో స్మోకింగ్ ఈజీగా మానేయగలరా?
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని ఎన్నో రకాలుగా అవగాహన కల్పించినప్పటికీ చాలామంది ఆ చెడు అలవాట్లకు స్వస్తీ పలకారు. ముఖ్యంగా యువత దీన్ని ఒక ట్రెండ్ లేదా ఫ్యాషన్‌గా భావిస్తోంది. ముక్కుపచ్చలారని చిన్నారులు సైతం స్మోకింగ్ చేస్తున్నారు. పెద్దవాళ్ల కుంటపడకుండా జాగ్రత్తపడతూ వక్రమార్గంలో దీన్ని సేవిస్తున్నారు. అదోక వ్యసనంలా మారి..స్మోకింగ్ చేయకుండా ఉండలేని వారికోసం వచ్చిందే ఈ నికోటిన్ పౌచ్‌లు. ఏంటి పోగాకులో ఉండే నికోటిన్ ఇందులోనూ ఉంది కదా! ఆరోగ్యానికి హానికరమే కగా అనేగా మీ సందేహం. అయితే ఇది ఆరోగ్యానకి మంచిదేనట. ఎలాగంటే.. ఈ నికోటిన్ పౌచ్‌లు స్మోకింగ్ చేసే వాళ్లకి ఓ ప్రత్యామ్నాయం అనే చెప్పాలి. ఇది బాగా స్మోకింగ్కి అలవాటు పడ్డవాళ్లకి, స్మోకింగ్ మానేద్దామనుకునేవాళ్లకి మంచి సహాయకారి. ఇందులో నిర్జలీకరణ నికోటిన్ , స్వీటెనర్లు, సువాసనలతో కూడిన మొక్కల ఫైబర్లు ఉంటాయి. ఇది తింటే నోరు దుర్వాసన రాదు. ఇందులో హానికరమైన నికోటిన్ ఉండదు. పైగా ఈ పౌచ్‌లను నోటిలో పెట్టుకుని నమలడం వల్ల వారికి పొగ పీల్చిన ఫీలింగ్ వస్తుందే తప్ప ఏం కాదు. ఆ తర్వాత రాను రాను వారికి తెలియకుండానే స్మోకింగ్ మానేస్తారు. ఇవి 17వ శతాబ్దం నుంచే ఉన్నాయట. అప్పట్లోనే వాటికి మంచి ప్రజాధరణ ఉండేదట. ఇప్పుడు మళ్లీ వాటిని వివిధ ఫ్లేవర్లలో ఇంకాస్తా ఆరోగ్యప్రదాయినిగా తయారుచేస్తున్నారు. వీటిని ఎక్కడికైనా ఈజీగా తీసుకుపోవచ్చు. అందరిముందు సేవించొచ్చు. కానీ ధుమపానం సేవించినట్లు అవతలివాళ్లకు తెలియదు. ఇక నోరు దుర్వాసన కూడా రాదు. ఇంకోపక్క మీకు స్మోక్చేసిన అనుభూతి మీకు దక్కడమే గాక ఆరోగ్యం కూడా పదిలంగానే ఉంటుంది. ఈ నికోటిన్ పౌచ్‌లో స్వీడన్ విశేష ప్రజాధరణ ఉంది. ధూమాపానం అనే వ్యవసనం నుంచి బయటపడటానికి సులవైన మార్గమే.కానీ ఆయా వ్యక్తుల దృఢంగా నిర్ణయించుకుంటే ఆ చెడు వ్యసనం నుంచి బయటపడగలరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. (చదవండి: కండ్లకలక బారిన పడకుండా ఉండొచ్చా? వర్షాకాలంలోనే ఇవి వస్తాయా?) -
నికోటిన్ ప్యాచ్‌లతో కరోనాకు చెక్!
పారిస్: ప్రాణాంతక కరోనా వైరస్ సోకకుండా.. దాని ప్రభావాన్ని తగ్గించే శక్తి నికోటిన్‌కు ఉందట. పొగతాగని వారితో పోలిస్తే సిగరెట్లు తదితర పొగాకు ఉత్పత్తులు సేవించే వారిపై మహమ్మారి తక్కువ ప్రభావం చూపిస్తుందట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే అంటున్నారు ఫ్రాన్స్ పరిశోధకులు. మేజర్ పారిస్ ఆస్పత్రిలో ఈ మేరకు తాము జరిపిన పరిశోధనల్లో పొగాకులోని నికోటిన్ కరోనా సోకకుండా అడ్డుపడుతున్న విషయం వెల్లడైందని అధ్యయనంలో పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ నుంచి ఆమోదం లభిస్తే పేషెంట్లతో పాటు వైద్య సిబ్బందికి కూడా నికోటిన్ ప్యాచులు(నికోటిన్ నింపిన బ్యాండేజ్ వంటి అతుకు) ఉపయోగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. కేవలం స్మోక్ చేసే అలవాటు ఉన్న వారిపై క్లినికల్ ట్రయల్స్ చేసే అవకాశం ఉందని తెలిపారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో పొగతాగమని ప్రజలను ప్రోత్సహించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. స్మోకింగ్ కారణంగా ఊపిరితిత్తులు పాడైపోయి చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపారు. (అందుకే నీటి సరఫరాను నిలిపివేశాం: ఫ్రాన్స్) ఈ విషయం గురించి ఫ్రెంచ్ న్యూరోబయోలజిస్ట్ జీన్ పెర్రె చాంగెక్స్ మాట్లాడుతూ... కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించకుండా నికోటిన్ అడ్డుకునే అవకాశాలు ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందన్నారు. నికోటిన్ సెల్ రెసెప్టార్స్‌ను అంటిపెట్టుకుని ఉండటం వల్ల శరీరంలో వైరస్‌ను ప్రవేశించకుండా అడ్డుకుంటోందని పేర్కొన్నారు. కాగా మార్చిలో ప్రచురించిన చైనీస్ అధ్యయనంలో కూడా పరిశోధకులు ఇదే తరహా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కరోనా సోకిన ప్రతీ వెయ్యి మందిలో పొగతాగేవారు 12.6 శాతం ఉండగా... ధూమపానం చేయని వారు 28 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. (కోవిడ్ చికిత్సకు హెచ్‌సీక్యూ–ఐజీ) ఇక ఫ్రాన్స్ గణాంకాల ప్రకారం పారిస్‌లో కరోనాతో ఆస్పత్రిపాలైన 11 వేల మంది రోగుల్లో 8.5 శాతం మంది స్మోకర్లు కాగా... దేశవ్యాప్తంగా వీరి సంఖ్య 25.4 శాతంగా ఉంది. ఈ గణాంకాలను బట్టి నికోటిన్ తీసుకునే వారిపై కరోనా ప్రభావం తక్కువగా ఉన్నట్లు అంచనా వేసినట్లు తాజా అధ్యయనం పేర్కొంది. ఇదిలా ఉండగా.. పొగతాగడం వల్ల ఫ్రాన్స్‌లో ఏడాదికి సగటున దాదాపు 75 వేల మంది మృత్యువాత పడుతున్నారు. ఇక కరోనాతో ఇప్పటి వరకు ఫ్రాన్స్‌లో దాదాపు 21 వేల మంది మరణించారు. -
ఈ–సిగరెట్లు.. అనారోగ్యం వంద రెట్లు
చాప కింద నీరులా విస్తరిస్తున్న మహమ్మారి కేన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, ఆస్తమా వచ్చే అవకాశం పాఠశాలలు, కాలేజీ యువతే లక్ష్యంగా విక్రయాలు ఒక్కో ఈ–సిగరెట్ ఖరీదు రూ. 3 వేల నుంచి రూ. 30 వేలు 13 రాష్ట్రాల్లో నిషేధం... తెలంగాణలోనూ నిషేధించే అవకాశం చూడడానికి స్టైలిష్‌గా ఉంటుంది... తాగితే మాంచి అనుభూతినిస్తుంది... సాధారణ సిగరెట్ కంటే ఆకర్షిస్తుంది. పైగా వివిధ రకాల పండ్ల సువాసన వెదజల్లుతుంది. అదే ఈ–సిగరెట్. ఇప్పుడు దేశంలోనూ, రాష్ట్రంలోనూ యువతీ యువకులు ముఖ్యంగా టీనేజర్లు దీనికి ఆకర్షితులవుతున్నారు. చివరకు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయం ఉండటంతో టీనేజర్లు ఎగబడుతున్నారు. సాధారణ సిగరెట్టు మాదిరిగా పొగ బయటకు రాదు. కాబట్టి తాగే వారిని గుర్తించడమూ అంత సులువుకాదు. విచిత్రమేంటంటే దశాబ్ద కాలంగా టీనేజీ పిల్లల్లో సిగరెట్లు తాగడం గణనీయంగా తగ్గిపోయింది. కానీ ఇప్పుడు ఈ–సిగరెట్లు వచ్చి వారిని నాశనం చేస్తు న్నాయి. దాని వల్ల వచ్చే ప్రమాదాలు తెలియకపోవడంతో స్టైల్ కోసం తాగుతున్నారు. సాధారణ సిగరెట్లతో ఎంతటి దుష్ప్రభావాలున్నాయో, అంతకుమించి ఈ–సిగరెట్లతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని డెంటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలు పేర్కొన్నాయి. ఈ మేరకు ఒక అధ్యయన పత్రాన్ని అవి తయారు చేశాయి. ఆ వివరాలతో కూడిన నివేదికను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖకు అందజేశాయి. ప్రపంచంలో ఈ–సిగరెట్లను 36 దేశాలు నిషేధించాయి. మన దేశంలో పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి, జార్ఖండ్ రాష్ట్రాలు నిషేధిం చాయి. తెలంగాణలోనూ నిషేధించాలని వైద్య, ఆరోగ్యశాఖకు ఈ సంస్థలు ఇటీవల విన్నవించాయి. – సాక్షి, హైదరాబాద్ ఎలా పని చేస్తుంది? ఈ–సిగరెట్టు బ్యాటరీతో పనిచేస్తుంది. నికోటిన్‌తో ఉండే ద్రవ పదార్థాన్ని మండించడం ద్వారా ఇది పనిచేస్తుంది. ఉదాహరణకు దోమలను పారదోలేందుకు కొన్ని రకాల లిక్విడ్ మందును మనం ఎలా విద్యు త్తో వాడతామో అలాగే ఇది కూడా పనిచేస్తుంది. అందులో ద్రావణం మండి ఆవిరి కలుగ జేస్తుంది. తద్వారా అది ఒకరకమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ–సిగరెట్లకు అనేక పేర్లున్నాయి. ఈ–సిగ్స్, ఈ–హుక్కాస్, వేప్ పెన్స్, ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్స్ అని కూడా అంటారు. చూడడానికి ఇవి పెన్నుల మాదిరిగా కూడా ఉంటాయి. ఈ–సిగరెట్ల ఖరీదు ఏకంగా రూ. 3 వేల నుంచి రూ. 30 వేల వరకు మన దేశంలో విక్రయిస్తున్నారు. అయితే పెన్ను రీఫిల్ మార్చినట్లుగా అనేక సార్లు దీన్ని మార్చుకోవచ్చు. ఒకసారి రూ. 30 వేలు పెట్టి కొంటే, దాంట్లో ద్రవ పదార్థం అయిపోయినప్పుడల్లా రూ. 700 నుంచి రూ. వెయ్యి వరకు పెట్టి రీఫిల్ చేసుకోవచ్చు. అలా వంద నుంచి రెండొందలసార్ల వరకు మార్చుకునే వెసులు బాటుంది. ఇండియాలో దీనికి ఎంత మంది బానిసలయ్యారన్న దానిపై ఇంకా స్పష్టమైన డేటా లేదు. కానీ అమెరికాలో మూడు శాతం మంది పెద్దవాళ్లు ఈ–సిగరెట్లు తాగుతున్నారు. 15% మంది దాన్ని కొత్తగా ప్రయత్నించారని అధ్యయనాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లోనూ టీనేజర్లు దీని బారిన పడినట్లు ఆ సంస్థలు చెబుతున్నాయి. కేన్సర్‌కు దారితీస్తుంది... సాధారణ సిగరెట్లలో పొగాకును మండిస్తారు. దానిద్వారా కార్బన్ మోనాౖMð్సడ్ తదితర రసాయనాలు మన ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతాయి. ఈ–సిగరెట్ల ద్వారా అత్యంత ప్రమాదకరమైన బెంజిన్, ఇథైలిన్ ఆౖMð్సడ్, ఎక్రిలమైడ్ వంటి రసాయనాలు వెలువడతాయి. వాటిని పీల్చుతారు. అంతేగాక టాక్సిక్ మెటల్స్ను కూడా పీల్చుతారు. ఈ–సిగరెట్లలో ఉండే కాయిల్స్ ద్వారా ఇవి ఉత్పత్తి అవుతాయి. వీటిని పీల్చడం ద్వారా కేన్సర్, నాడీ మండల వ్యవస్థ ధ్వంసం కావడం తదితర దుష్పరిణామాలు తలెత్తుతాయి. అలాగే ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తాయి. హైబీపీ తలెత్తడం, ఒక్కోసారి కోమాలోకి వెళ్లి చనిపోవడం జరుగుతుంది. తక్కువ డోస్ ఈ–సిగరెట్లు తాగితే వాంతులు, కడుపునొప్పి తదితరాలు సంభవిస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు.. ఈ–సిగరెట్లలో నికోటిన్ అనే పదార్థం ఉంటుంది. మెదడుపై అది ప్రభావం చూపుతుంది. గర్భిణీలు తాగితే మరింత ప్రమాదం. సాధారణ సిగరెట్లను మానేయడానికి ఈ–సిగరెట్లు ఉపయోగపడతాయన్న ప్రచారాన్ని కంపెనీలు ప్రచారం చేస్తున్నాయి. కానీ ఎక్కడా అలా జరగకపోగా, మరింతగా బానిసలవుతున్నారు. ఈ–సిగరెట్లలో ఉండే బ్యాటరీలు ఒక్కోసారి పేలి పిల్లలు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ–సిగరెట్లు తయారు చేసే ప్రధాన బ్రాండ్లు అన్నీ కూడా పొగాకు కంపెనీలే కావడం గమనార్హం. టీనేజీ పిల్లలను ఈ–సిగరెట్లు ఆకర్షించడానికి ప్రధాన కారణం... వివిధ రకాల ప్లేవర్లలో (రుచులు లేదా సువాసన) అందుబాటులో ఉండటం, ఉన్నతమైన టెక్నాలజీతో తయారు కావడం, పైగా దీనివల్ల సాధారణ సిగరెట్ల కంటే ప్రమాదం తక్కువన్న ప్రచారం ఉండటం. రాష్ట్రంలోనూ నిషేధించాలి ఈ–సిగరెట్లను నిషేధించాలని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు ఇటీవల విన్నవించాం. దేశంలో వివిధ రాష్ట్రాలు నిషేధించాయని, తెలంగాణ లోనూ వీటిని నిషేధించేలా నిర్ణయం తీసుకోవాలని కోరాం. పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. – నాగ శిరీష, వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి -
పొగ మాన్పించేందుకు కొత్త ఎంజైమ్!
పొగతాగడం మానేయాలనుకుంటున్న వారికి ఓ శుభవార్త. ఏటా 50 నుంచి 60 లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంటున్న ఈ అలవాటును మాన్పించేందుకు స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఓ వినూత్న ఆవిష్కరణ చేశారు. పొగతాగిన వెంటనే రక్తంలోకి చేరే నికోటిన్‌ను అక్కడికక్కడే నాశనం చేయగల ఎంజైమ్‌ను వీరు అభివృద్ధి చేశారు. పొగాకు పొలం నేలలో ఉండే సూడోమోనాస్ పుటిడా అనే బ్యాక్టీరియా స్రవించే ఎంజైమ్ నిక్–ఏ2ను మూడేళ్ల క్రితమే స్క్రిప్స్ ఇన్స్టిట్యూట్ గుర్తించింది. అప్పటి నుంచి దీన్ని కృత్రిమంగా తయారు చేయడంతో పాటు.. నికోటిన్‌ను నాశనం చేయగల దాని శక్తిని మరింత వృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా వీరు అభివృద్ధి చేసిన నిక్–ఏ2–జే1 ఎంజైమ్‌ను ఎలుకలపై ప్రయోగించి చూసినప్పుడు అది చాలా సమర్థంగా రక్తంలోని నికోటిన్ మోతాదులను తగ్గించినట్లు తెలిసింది. మెదడును చేరేలోపు రక్తంలోని నికోటిన్ నాశనమవుతోంది కాబట్టి పొగ తాగడం ఒక వ్యసనంగా మారదని అంచనా. ఇప్పటివరకూ ఈ ప్రయోగాలు ఎలుకలకు మాత్రమే పరిమితం. భవిష్యత్తులో మానవుల్లోనూ ఇదే రకమైన ఫలితాలను రాబట్టగలిగితే ఈ ఎంజైమ్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఏర్పడుతుంది. -
ఇంట్లో సిగరెట్ కాలిస్తే కష్టమే!
వాషింగ్టన్ : తల్లిదండ్రులు ఇంట్లో పొగతాగడం వల్ల పిల్లల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. పాసివ్ స్మోకింగ్ వల్ల చిన్నారుల చేతులుపై, లాలాజలంలో కేన్సర్ కారక నికోటిన్ అవశేషాలు చేరుతున్నాయని వారు పేర్కొన్నారు. సిన్సినాటీ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెడికల్ కేర్ సెంటర్లో 700 మంది చిన్నారుల సమాచారాన్ని శాస్త్రవేత్తలు సేకరించారు. వీరిలో ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడుతున్న 25 మంది చిన్నారుల డేటాను విశ్లేషించారు. ఈ చిన్నారులందరి సగటు వయస్సు అయిదు సంవత్సరాలు. వీరిని పరిశీలించిన శాస్త్రవేత్తలు వీరి శరీరంపైనా, లాలాజలంలో కేన్సర్ కారక నికోటిన్ ఉందని కనుగొన్నారు. ఈ చిన్నారుల తల్లిదండ్రులందరూ పొగతాగేవారేనని వారు తెలిపారు. -
ధూమపానం ఎందుకు మానలేరంటే..
వాషింగ్టన్: ఈ రోజు నుంచి ధూమపానం మానేయాల్సిందే అంటూ చాలా మంది ఏటా కొత్త సంవత్సరం రోజు తీర్మానించుకోవడం.. రెండు మూడురోజులు కూడా ఉండలేక మళ్లీ మొదలుపెట్టేయడం మనం చూస్తుంటాం. అయితే.. పొగాకులో ఉండే నికోటిన్ పదార్థం శరీరంలో కణస్థాయి యంత్రాంగాన్ని అణచివేస్తూ ప్రభావం చూపడం వల్లే వ్యసనాన్ని మానుకోవడం కష్టం అవుతోందని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కణాల్లో సాధారణంగా ఎసిటైల్కోలిన్ అనే నాడీరసాయనాన్ని గ్రహించేందుకు ఎసిటైల్కోలిన్ రిసెప్టార్స్(ఏసీహెచ్ఆర్-గ్రాహకాలు) ఉంటాయి. ఇవి నికోటిన్ రసాయనానికి కూడా స్పందిస్తాయి కాబట్టి.. వీటిని నికోటిన్ ఎసిటైల్కోలిన్ రిసెప్టార్స్ (ఎన్ఏసీహెచ్ఆర్ఎస్)గా పిలుస్తారు. అయితే శరీరంలోకి చేరే నికోటిన్.. కణాల కణ ద్రవ్యంలో ఎన్ఏసీహెచ్ఆర్లు గుమిగూడేలా చేస్తుందని, దాంతోపాటు అవి కణ ఉపరితలానికి ఎక్కువగా చేరి నికోటిన్‌ను ఎక్కువగా స్వీకరించేలా కూడా చేస్తుందని ఈ మేరకు ఎలుకలపై జరిపిన పరిశోధనలో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎన్ఏసీహెచ్ఆర్లపై నికోటిన్ చూపే ఈ ప్రభావాన్ని అడ్డుకుంటే గనక.. ధూమపాన వ్యసనానికి పూర్తిగా చికిత్స చేయవచ్చని, మెదడు సంబంధితమైన పార్కిన్సన్స్ (అవయవాల వణుకు) వ్యాధి నివారణకూ వీలు కానుందని పరిశోధకులు భావిస్తున్నారు. -
నికోటిన్ దుష్ర్పభావాల పొగాకు..!
అగ్నికి ఆజ్యం తోడైతే మంట మరింత పెరుగుతుంది. మరి ఆ అగ్నికి విషం తోడైతే? అది స్టైలిష్ సిగరెట్‌గా మారుతుంది. దాంతో జీవితం ఫూలిష్‌గా కాలిపోతుంది. ఇంత ఫ్యాషనబుల్‌గా జీవితాలను తగలబెట్టుకోడానికి మనం ఏటా రూ. 24 లక్షల కోట్లు తగలేస్తున్నాం. స్టైలే డెవిలై కబళిస్తుంటే... ప్రతి పది సెకన్లకు ఒకరం చొప్పున నికరంగా పొగాకుకు బలవుతున్నాం. పొగాకు గురించి చాలాసార్లు చాలామంది చెప్పారు, చదివారు, విన్నారు. అయితే వాటితో పాటు కొన్ని అంతగా వినని వాటినీ ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. సిగరెట్ నుంచి రక్షించుకోవడం ఎంతగా అవసరమో చెప్పడానికే ఈ కథనం. జీవితం పొగచూరిపోవడానికి ఈజీ మార్గం... పొగాకు. ఆ విషాన్ని పెట్టెలో దాచి మరీ జాగ్రత్తగా జేబులో పెట్టుకుని తిరుగుతుంటాం. ఆ విషాన్ని అగ్గితో రగిలించి స్వీకరిస్తాం. అగ్నికి ఆజ్యం తోడయ్యే బదులు ఇక్కడ మనం అగ్నికి గరళం తోడయ్యేలా చేస్తాం. అగ్గిపుల్లతో మంట పెచ్చరిల్లుతుంది. అది సిగరెట్‌కు తాకగానే జీవితం కునారిల్లుతుంది. దాన్ని ఎందుకు వదలాలో తెలుసుకోడానికి తోడ్పడే కొన్ని ప్రధాన విషయాలివి... మీకో విషయం తెలుసా? ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకూ ఆయుధాలను అమ్ముతూ మనుగడ సాగిస్తున్న అమెరికా మరో విషయంలోనూ ముందంజలో ఉంది. ఈ వాణిజ్యం ద్వారా అది దేశాల మధ్య చిచ్చు పెడుతుంటే... ఈ బిజినెస్ ద్వారా అది దేహాలకు ముప్పు తెస్తోంది. అదే సిగరెట్ బిజినెస్. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే ప్రఖ్యాత సిగరెట్ బ్రాండ్లలో 70 శాతం అమ్మకాలు అమెరికన్ బ్రాండ్స్ అయిన మార్ల్బోరో, కూల్, క్యామెల్ సిగరెట్స్వే. ఇలా ఆయుధాల బాటలోనూ, సిగరెట్ల చేటు లోనూ అమెరికా తన అగ్రాధిపత్యాన్నీ, అగ్రరాజ్యాధి-పైత్యాన్నీ చాటుకుంటూనే ఉండటం విశేషం. సిగరెట్లో ఆర్సినిక్, ఫార్మాల్డిహైడ్, లెడ్, హైడ్రోజన్ సైనైడ్, నైట్రోజెన్ ఆక్సిడ్, కార్బన్ మోనాక్సైడ్, అమోనియా లాంటి 43 రకాల తెలిసిన కార్సినోజెన్లు (క్యాన్సర్ కారకాలు) ఉన్నాయి. ఇక పేరు తెలియని హానికర రసాయనాలు దాదాపు 4000 రకాలు ఉన్నాయి. వీటి ఫలితంగా ఊపిరితిత్తులు, స్వరపేటిక, ప్రోస్టేట్, మూత్రాశయం, మూత్రపిండాలు, జీర్ణకోశం వంటి అన్ని అవయవాలూ క్యాన్సర్‌కు గురికావచ్చు. బ్రాంకైటిస్, సీవోపీడీ వంటి జబ్బులూ రావచ్చు. ఆ తర్వాత వారికి సెకండరీ ఇన్ఫెక్షన్గా నిమోనియా వస్తే మృత్యువుకు గెస్ట్ అయినట్లే. ప్రతి 10 సెకండ్లకు ఒకసారి ప్రపంచంలోని ఏదోమూల ఎవరో ఒకరు పొగాకు వల్లనే చనిపోతున్నారు. గుండెకు సంబంధించిన రుగ్మతలతో చనిపోయేవారిలో కనీసం 35% మంది నేరుగా స్మోకింగ్ వల్ల ప్రభావితమై మృతిచెందేవారే. మీరు సిగరెట్ పొగను పీల్చిన 10 సెకండ్లలో అందులోని నికోటిన్ మెదడును చేరుతుంది. సిగరెట్ తాగేవారి ప్రతి అవయవంలోనూ నికోటిన్ ఉంటుంది... అంటే ఒకవేళ తల్లికి పొగతాగే అలవాటుంటే ఆమె చనుబాలలో కూడా చేరుతుంది. మీకు తెలియని విషయం ఒకటి ఉంది. సిగరెట్లో 20 శాతం చక్కెర ఉంటుంది. చాలామంది డయాబెటిక్ రోగులకు ఈ విషయం తెలియదు. అలాగే చక్కెరను కాల్చి పీల్చితే కలిగే దుష్పరిణామాల గురించి ఇంకా ప్రపంచానికి పూర్తిగా తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే... అది నేరుగా చక్కెరను తీసుకోవడం కంటే చాలా ప్రమాదమని. చాలామంది ‘లైట్’ సిగరెట్స్ తాగితే అందులో రసాయనాల ఘాటు, జరగాల్సిన కీడు చాలా లైట్‌గా ఉంటాయని నమ్ముతారు. సిగరెట్‌ను లైట్‌గా చేయడానికి పొగాకును కార్బన్‌డయాక్సైడ్‌తో కలిసి సూపర్ హీట్ వద్ద మండించాలి. అప్పుడది మామూలు పొగాకు పొడికి బదులుగా పఫ్డ్ మెటీరియల్‌గా మారిపోతుంది. (పఫ్డ్ మెటీరియల్‌ను వివరించాలంటే... ఉదాహరణకు నీళ్లకూ, నురగ కూ ఉన్న తేడాతోనూ, బియ్యానికీ, మరమరాల కూ ఉన్న తేడాతోనూ పోల్చుకోవచ్చు). అప్పుడు అలా మారిన దాన్ని కాగితపు గొట్టంలోకి ఎక్కిస్తారన్నమాట. లైట్ అంటే దాని తాలూకు ప్రభావం లైట్‌గా ఉంటుందన్నది మన అపోహ మాత్రమే. నిజానికి దాన్ని మరింత విషపూరితమైన కార్బన్‌డయాక్సైడ్‌తో మరింత అత్యధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చి మరింత విషపూరితం చేస్తున్నామన్న సత్యాన్ని మరిచిపోతున్నాం. లైట్ సిగరెట్ లో పొగాకు ఫ్లేక్స్ మధ్య ఖాళీ ఎక్కువగా ఉండటం వల్ల పొగ మరింత ఘాటుగా, నేరుగా, బలంగా ఊపిరితిత్తులకు తాకుతుంది. మీరు ఈ కింది మాట వింటే... ఆహా సిగరెట్ చేసే మేలెంతో కదా అని ‘పొగాకులో కాలేస్తారు’. ఆ తర్వాత కాలు కాలినట్లు కాస్త ఆలస్యం గా గ్రహిస్తారు. అదేమిటం టే... పొగ తాగేవారిలో వ్యాధినిరోధక వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టమ్) చాలా చురుగ్గా పనిచేస్తుంది. అప్పుడే అబ్బా, ఆహా... అనుకోకండి. ఇక్కడే ఉంది ట్విస్టు. ఎంత త్వరగా పనిచేస్తుందో, అంత త్వరగా బలహీనపడిపోతుంది. సిగరెట్ తాగడం మొదలుపెట్టాక... లోపలికి పీల్చుకునేవి విష పదార్థాలు కావడంతో వాటితో పోరాడటానికి వ్యాధినిరోధక వ్యవస్థ ఉపక్రమిస్తుంది. అయితే అదేపనిగా సిగరెట్ తర్వాత సిగరెట్ తాగుతుండటం వల్ల అది బలహీనపడుతుంది. అందుకే సిగరెట్ తాగేవారిలో ఇమ్యూనిటీ వేగంగా ప్రతిచర్య జరిపి వేగంగా బలహీనపడి అంతేవేగంగా నిర్వీర్యమైపోతుంది. అదే పొగతాగనివారిలో ఇమ్యూనిటీ కాస్తంత ఆలస్యంగా మేలుకున్నా... బలంగా, ప్రభావపూర్వకంగా పనిచేస్తుంది. సిగరెట్ తాగడం వల్ల జీర్ణక్రియ జరగాల్సిన దానికంటే ఆలస్యంగా జరుగుతుంది. అంటే జీర్ణమయ్యే ఆహారం ఉండాల్సిన వ్యవధికంటే ఎక్కువసేపు పేగుల్లో ఉంటుంది. దీనివల్ల కుళ్లాల్సిన దానికంటే ఎక్కువగా కుళ్లుతుంది. ఫలితంగా జీర్ణమైన ఆహారం రక్తంలోనికి ఇంకేటప్పుడు... అందులోకి వెళ్లాల్సిన దానికంటే అధికమోతాదులో విషాలు ప్రవేశిస్తుంటాయి. విషపూరితమైన రక్తకణాలు మెదడుకు చేరడంతో అది పనిచేయాల్సిన దానికంటే ఆలస్యంగా పనిచేస్తూ క్రమంగా తన పనితీరును మందకొడిగా మార్చేసుకుంటుంది. గర్భవతులకు ఒకసారి ఎక్స్-రే తీయించాల్సి వస్తేనే డాక్టర్లు వద్దని నిరాకరిస్తుంటారు. అయితే ఒక ప్యాకెట్ సిగరెట్స్ తాగితే... అది దాదాపు 2000 ఛాతీ ఎక్స్-రేలు తీయించుకున్న దాని దుష్ర్పభావంతో సమానం. పొగాకు మొక్కలో హార్మలా అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. అది భ్రాంతులను కలగజేసే రసాయనం. అయితే మనం సిగరెట్ తాగేప్పుడు అలా భ్రాంతులు కలగకపోవడానికి కారణం... సిగరెట్ తయారీలో పొగాకు ను ప్రాసెస్ చేసే సమయంలో హార్మలాను తొలగించడమే. కానీ ఎంతో కొంత స్వల్ప మోతాదుల్లో అది మెదడుకు చేరుతుండటం వల్ల హార్మలాతో కలిగే హార్మ్ అంతా ఇంతా కాదు. అలా కాల్చగా కాల్చగా కొన్నేళ్ల తర్వాత సిగరెట్ దుష్ర్పభావం మన శరీరంపై పడుతుందని మీకు ఇప్పటివరకూ ఒక నమ్మకం ఉంటే ఉండవచ్చు. కానీ ఇప్పుడు సరికొత్త పరిశోధనల వల్ల తెలుస్తున్న సత్యం ఏమిటంటే... సిగరెట్ తాగిన 15 నుంచి 30 నిమిషాల లోపు అందులో ఉండే పాలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (పీయేహెచ్) ప్రభావం శరీరంలోని కణాలన్నింటి పైనా పడుతుంది. అందువల్ల డీఎన్ఏ స్వరూపం మారుతుంది. డీఎన్ఏ స్వరూపం మారడం అంటేనే క్యాన్సర్ అన్నమాట. ఈ పని మొట్టమొదటి సిగరెట్‌తోనూ జరగవచ్చు. అయితే ఇన్ని సిగరెట్లు కాల్చాక కూడా ఇంకా మీపై పీఏహెచ్ల ప్రభావం పడలేదంటే అది మీ అదృష్టమే. పడేలోపే ఆ అలవాటును మానుకోండి. ఇన్ని కారణాలతో తక్షణం నిర్వీర్యం చేసి... క్రమంగా శరీరంలోని అన్ని అవయవాలనూ శక్తిహీనం చేసేసి, ఆ తర్వాత మెల్లగా ప్రాణాలను తీసేసే సిగరెట్‌ను వదులుకోండి. అది ప్రాణాల ను మెలివేయకముందే... దాన్ని వెలివేయండి. అలవాటు మానేశానంటూ గర్వంగా మీసం మెలివేయండి. -నిర్వహణ: యాసీన్ ఇవీ టాపింగ్స్: ఆహారపదార్థాలకు మరింత రుచిని ఆపాదించడానికి రుచికరమైన వాటిని వాటి పైన పూస్తారు. ఈ ప్రక్రియనే వంటల్లో టాపింగ్ అంటారు. అలాగే పొగాకును టాపింగ్ చేయడానికి... లవంగ నూనె, ఆప్రికాట్ స్టోన్, నిమ్మనూనె, లావెండర్‌నూనె, డిల్సీడ్ నూనె, కోకా, క్యారట్ నూనె, బీట్ జ్యూస్, ఓక్, రమ్, వెనీలా, వెనిగార్‌లను పైపూత పదార్థాలుగా ఉపయోగిస్తారు. ఇది తెలిశాక కూడా మీరు సిగరెట్ తాగగలరా...? సిగరెట్‌కు ఫ్లేవర్ (రుచి, వాసన) ఆపాదించడానికి దానికి ‘యూరియా’ ను జతచేస్తారు. యూరియాతో ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా పొగాకులోని ముతకదనం తగ్గి, ఘాటు మరింతగా పెరగాలన్నది ఈ ప్రక్రియ ఉద్దేశం. మీకు తెలుసా? మన శరీరానికి విషపూరితం అంటూ మూత్రం ద్వారా మన కిడ్నీలు బయటకు పంపేది ఈ యూరియా అనే వ్యర్థాన్నే. అంటే మన మూత్రంలో ఉండే పదార్థాన్నే సిగరెట్‌కు రుచి తేవడానికి ఉపయోగించి మళ్లీ శరీరంలోకి పంపిస్తున్నారన్నమాట. మార్ల్బోరో కోసం పనిచేస్తే... జీవితమే బోర్లా! వేన్ మెక్ క్లారెన్, డేవిడ్ మెక్ క్లీన్... వీళ్లిద్దరూ సదరు కంపెనీ యాడ్ కోసం పనిచేసే రోజుల్లో ఒక్కొక్కరినీ విడివిడిగా ‘మార్ల్బోరో మ్యాన్’ అంటూ ఆదరంగా పిలిచేవారు. ఎందుకంటే కౌబాయ్ గెటప్‌లో, రగ్డ్గా, రఫ్‌గా దేన్నైనా తట్టుకోగల ధీరులుగా, వీరులుగా ఆ కంపెనీ యాడ్స్‌లో వాళ్లను చూపించేవారు. యాడ్స్ తయారీలో భాగంగా వారు రోజూ సిగరెట్లు తాగాల్సి వచ్చేది. విచిత్రం ఏమిటంటే... ఆ ఇద్దరూ తమ కాంట్రాక్ట్ ముగిశాక... పదేళ్లలోపే ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చనిపోయారు. ఇంకో విషయం ఏమిటంటే... డేవిడ్ మెక్‌క్లీన్ చావుకు సిగరెట్ల కంపెనీయే కారణమంటూ కుటుంబసభ్యులు కేసు కూడా పెట్టారు. మృత్యువును వడపోసి మరీ తెచ్చే ‘ఫిల్టర్’... పొగతాగడం వల్ల వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్యసమస్యలేమీ రావంటూ కొందరు చమత్కారంగా చెప్పేమాట అక్షరాలా వాస్తవం. కాకపోతే కాస్త నెగెటివ్‌గా. ఎందుకంటే వారు వృద్ధాప్యం వచ్చేవరకు ఉండరు కదా..! ఇక స్మోకింగ్ అనే దురలవాటు వల్ల వ్యక్తులు ఎంత త్వరగా చనిపోతున్నారన్నది సైంటిస్టులు గణాంకాలతో లెక్కగట్టారు. సగటున చూస్తే స్మోకర్లు 14 ఏళ్ల ముందుగానే చనిపోతున్నారు. అంటే పొగతాగడం మొదలుపెట్టారంటే మీ జీవితంలో 14 ఏళ్లను త్యాగం చేస్తున్నారన్నమాట. దీనికి తోడు గుండెజబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, అనేక కిడ్నీ, లివర్, మెదడు సంబంధమైన జబ్బులు బోనస్. బోరిస్ ఐవాజ్ అనే హంగేరియన్ సైంటిస్ట్ 1925లో కార్క్‌తో తొలిసారి సిగరెట్ ఫిల్టర్‌ను తయారుచేసి, ఆ తర్వాత క్రేప్ పేపర్‌తో ఫిల్టర్‌ను రూపొందించి, పేటెంట్ పొందాడు. నిజానికి మామూలు సిగరెట్ లో ప్రమాదకరమైన ముతకపదార్థాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్తే... ఫిల్టర్ ఉన్న సిగరెట్ ద్వారా అవి మరింత వడపోతకు గురై మరింత ప్రమాదకరమైనవిగా రూపొంది మరీ ప్రాణం తీస్తాయి. విషాన్ని మరింత మేలురకమైనదిగా రూపొందించుకోడానికి పొందిన పేటెంట్ అది అని గ్రహించండి. ఇక కెంట్ అనే ఒక పాపులర్ బ్రాండ్ సిగరెట్ ఫిల్టర్ కోసం మరింత నాణ్యమైన కార్సినోజెన్ (క్యాన్సర్‌ను తెచ్చే రసాయనం) ‘క్రోసిడోలైట్ ఆస్బెస్టాస్’ను ఉపయోగించేవారు. మనం మన జీవితాల ను చాలా నాణ్యంగా తగలబెట్టుకుంటున్నామని గ్రహించి 1950లో ఆ ఫిల్టర్‌ను వాడటం మానేశారు సదరు తయారీదారులు. ప్రతికూల ప్లాసెబో ఎఫెక్ట్: మనం ఏదైనా మందు తీసుకున్న తర్వాత ఉపశమనం పొందితే, నిజానికి అది మందు కారణంగా కాకపోయినా దాన్ని మందుకే ఆపాదిస్తాం. దాన్నే ప్లాసెబో ఎఫెక్ట్ అంటారు. అలాగే సిగరెట్ తర్వాత మనం కుదుటపడినట్లుగా, రిలాక్స్‌గా ఫీలవ్వడం, చురుగ్గా మారడం... ఇవన్నీ సిగరెట్ తాలూకు ప్రతికూల ప్లాసెబో ప్రభావాలే. డాక్టర్ సునంద కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్