Pouch
-
నికోటిన్ పౌచ్‌లు తెలుసా!..దీంతో స్మోకింగ్ ఈజీగా మానేయగలరా?
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని ఎన్నో రకాలుగా అవగాహన కల్పించినప్పటికీ చాలామంది ఆ చెడు అలవాట్లకు స్వస్తీ పలకారు. ముఖ్యంగా యువత దీన్ని ఒక ట్రెండ్ లేదా ఫ్యాషన్‌గా భావిస్తోంది. ముక్కుపచ్చలారని చిన్నారులు సైతం స్మోకింగ్ చేస్తున్నారు. పెద్దవాళ్ల కుంటపడకుండా జాగ్రత్తపడతూ వక్రమార్గంలో దీన్ని సేవిస్తున్నారు. అదోక వ్యసనంలా మారి..స్మోకింగ్ చేయకుండా ఉండలేని వారికోసం వచ్చిందే ఈ నికోటిన్ పౌచ్‌లు. ఏంటి పోగాకులో ఉండే నికోటిన్ ఇందులోనూ ఉంది కదా! ఆరోగ్యానికి హానికరమే కగా అనేగా మీ సందేహం. అయితే ఇది ఆరోగ్యానకి మంచిదేనట. ఎలాగంటే.. ఈ నికోటిన్ పౌచ్‌లు స్మోకింగ్ చేసే వాళ్లకి ఓ ప్రత్యామ్నాయం అనే చెప్పాలి. ఇది బాగా స్మోకింగ్కి అలవాటు పడ్డవాళ్లకి, స్మోకింగ్ మానేద్దామనుకునేవాళ్లకి మంచి సహాయకారి. ఇందులో నిర్జలీకరణ నికోటిన్ , స్వీటెనర్లు, సువాసనలతో కూడిన మొక్కల ఫైబర్లు ఉంటాయి. ఇది తింటే నోరు దుర్వాసన రాదు. ఇందులో హానికరమైన నికోటిన్ ఉండదు. పైగా ఈ పౌచ్‌లను నోటిలో పెట్టుకుని నమలడం వల్ల వారికి పొగ పీల్చిన ఫీలింగ్ వస్తుందే తప్ప ఏం కాదు. ఆ తర్వాత రాను రాను వారికి తెలియకుండానే స్మోకింగ్ మానేస్తారు. ఇవి 17వ శతాబ్దం నుంచే ఉన్నాయట. అప్పట్లోనే వాటికి మంచి ప్రజాధరణ ఉండేదట. ఇప్పుడు మళ్లీ వాటిని వివిధ ఫ్లేవర్లలో ఇంకాస్తా ఆరోగ్యప్రదాయినిగా తయారుచేస్తున్నారు. వీటిని ఎక్కడికైనా ఈజీగా తీసుకుపోవచ్చు. అందరిముందు సేవించొచ్చు. కానీ ధుమపానం సేవించినట్లు అవతలివాళ్లకు తెలియదు. ఇక నోరు దుర్వాసన కూడా రాదు. ఇంకోపక్క మీకు స్మోక్చేసిన అనుభూతి మీకు దక్కడమే గాక ఆరోగ్యం కూడా పదిలంగానే ఉంటుంది. ఈ నికోటిన్ పౌచ్‌లో స్వీడన్ విశేష ప్రజాధరణ ఉంది. ధూమాపానం అనే వ్యవసనం నుంచి బయటపడటానికి సులవైన మార్గమే.కానీ ఆయా వ్యక్తుల దృఢంగా నిర్ణయించుకుంటే ఆ చెడు వ్యసనం నుంచి బయటపడగలరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. (చదవండి: కండ్లకలక బారిన పడకుండా ఉండొచ్చా? వర్షాకాలంలోనే ఇవి వస్తాయా?) -
మెడలో పర్సుల హారాలు.. భలే ఉన్నాయ్!
డబ్బు పెట్టుకునే చిన్ని పర్సులు అతివల చేతుల్లో అందంగా ఇమిడిపోవడం చూస్తుంటాం. కళా హృదయం గలవారు మగువలు వాడుకునే ఈ పర్సులను ఆభరణాలుగా మార్చగలరు అనిపిస్తుంది ఈ డిజైన్స్ చూస్తుంటే. పర్సుకు హ్యాండిల్ ప్లేస్‌లో పొడవాటి బీడ్స్ లేదా ఇతర లోహాలతో డిజైన్ చేసి ఉంటే.. అది ఇక్కడ చూపినట్టుగా హారంగా అమర్చవచ్చు. ఫ్యాబ్రిక్ జువెల్రీలో భాగంగా పర్సుల తయారీ కూడా హ్యాండ్మేడ్లో ఒక కళాత్మకవస్తువుగా మారిపోయింది. రంగు క్లాత్‌లతో చేసిన మోడల్ పర్సులకు కొన్ని అద్దాలు, కొన్ని పూసలు, ఇంకొన్ని గవ్వలు, కాసులు జత చేరిస్తే ఇలా అందంతో ఆకట్టుకుంటున్నాయి. మరికొన్నింటికి చక్కని పెయింట్, ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తే .. పర్సుల ఆభరణాలను ఇలా కళాత్మకంగా మెరిపించవచ్చు. (క్లిక్: స్టయిలిష్ లుక్‌తో టైమ్‌కి టైమొచ్చింది) పాత డెనిమ్ ప్యాంట్ల జేబులతోనూ బొహేవియన్ స్టైల్లో పర్సు హారాలను తయారుచేసుకోవచ్చు. సృజనాత్మకతకు అడ్డే లేదని నిరూపిస్తున్న ఈ ఆభరణాలు నవతరాన్ని అమితంగా ఆకర్షిస్తున్నాయి. హ్యాండ్లూమ్ చీరలు, డ్రెస్సులకు కూడా కొత్త అందాలను మోసుకువస్తున్నాయి. ఇక నుంచి డబ్బుల కోసమే కాదు పర్సు హారం మెడకు నిండుదనాన్ని తీసుకువస్తుందని కూడా ఎంపిక చేసుకోవచ్చు అన్నమాట. (చదవండి: జంతు చర్మాలు ఒలిచి అలంకారం.. ఇదిగో సమాధానం!) -
హలో.. పౌచ్ అదుర్స్
పార్వతీపురం : వినూత్నంగా ఆలోచించగలిగితే.. సృజనాత్మకత ప్రదర్శించగలిగితే.. ఉపాధి పొందడానికి కాదేదీ అనర్హం. డిగ్రీలు చేత పట్టుకొని ఉద్యోగాలు రాక ఖాళీగా రోడ్లమీద తిరిగేవారు కొందరైతే.. కష్టపడేతత్వం ఉంటే చాలు బతికేయడం చాలా సులువని నిరూపించేవారు మరికొందరు. సెల్‌ఫోన్ పౌచ్‌లను అందంగా కావలసిన బొమ్మలతో తీర్చిదిద్దుతూ ఉపాధి పొందుతున్న యువకులు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పొట్ట చింపితే అక్షరం రాని ఈ యువకులు సెల్‌ఫోన్ పౌచ్‌లను అందంగా తయారు చేస్తూ నెలకు రూ.30 వేల వరకు సంపాదిస్తున్నారు. సెల్‌ఫోన్ వినియోగదారుల ఆసక్తి మేరకు విజయవాడ, ముంబయ్ ప్రాంతాల నుంచి వివిధ రకాల స్టిక్కర్లను తెప్పించి వాటిని సెల్‌ఫోన్ పౌచ్‌లకు అందంగా అతికిస్తున్నారు. సినీ హీరోలు, హీరోయిన్లు, జాతీయ నేతలు, స్వాతంత్య్ర సమరయోధులు, స్వాతంత్య్ర జెండాలు వంటి అనేక మోడళ్ల స్టిక్కర్లను పౌచ్‌లకు నిమిషాల వ్యవధిలో అతికించి అందంగా తీర్చిదిద్దుతున్నారు. చక్కని ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరఘట్టానికి చెందిన షేక్ అబ్దుల్ పౌచ్‌ల తయారీతో ఉపాధి పొందుతూ పదిమందికి స్ఫూర్తినిస్తున్నాడు. వినియోగదారుల ఆసక్తే మా ఉపాధి సెల్‌ఫోన్ వినియోగదారుల ఆసక్తే మాకు ఉపాధి చూపిస్తోంది. ప్రస్తుతం ప్రతి వ్యక్తి సెల్‌ఫోన్ వినియోగిస్తున్నారు కాబట్టి దానికి రక్షణగా ఉండే పౌచ్‌ను అందంగా తీర్చిదిద్దే పనిని నేర్చుకొని ఉపాధి పొందుతున్నాను. యువత కూడా ఎన్నో రకాల డిజైన్లను పౌచ్‌లపై వేయించుకుంటోంది. రోజూ రూ.1000 నుంచి రూ.2 వేల వరకు ఆదాయం లభిస్తుంది. – షేక్ అబ్దుల్లా, వీరఘట్టం -
నిజాయితీ చాటుకున్న కండక్టర్
మణికొండ: ఆర్టీసీ బస్సులో దొరికిన పర్సును తిరిగి పోగొట్టుకున్న వ్యక్తిని పిలిచి అందజేసి ఓ బస్ కండక్టర్ తన నిజాయితీని చాటుకున్నాడు. మణికొండ గ్రామ పంచాయతీ పరిధిలోని పంచవటి కాలనీలో నివసిస్తున్న మురళీమోహన్ శనివారం సొంత పనిపై నగరానికి వెళ్లివచ్చారు. కాగా అతను ప్రయాణించిన ఆర్టీసీ బస్సులో తన పర్సును పోగొట్టుకున్నాడు. లింగంపల్లి నుంచి ఉప్పల్‌కు సర్వీస్ అందించే 113 బస్‌లో కండక్టర్‌గా పని చేస్తున్న మధుకు పర్సు దొరికింది. దీంతో పర్సు ఎవరిదో.. వారికి అందజేయాలనే ఉద్దేశ్యంతో అందులోని వివరాల ప్రకారం అతనికి ఫోన్ చేసి పర్సు తన వద్ద ఉందని, వచ్చి తీసుకోవాలని సూచించారు. మురళీమోహన్‌తో పాటు కండక్టర్ మధు కూడా మణికొండలోనే నివసిస్తుండడంతో సర్పంచ్ నరేందర్‌రెడ్డి సమక్షంలో మధు ఆయనకు పర్సును అప్పగించారు. అందులో రూ. 8వేల నగదుతో పాటు ఏటీఎం కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, క్రెడిట్‌కార్డులు తదితర విలువైన కార్డులు ఉన్నాయని, నిజాయితీగా తన పర్సు తనకు అందించిన కండక్టర్ మధుకు మురళీమోహన్ కృతజ్ఞతలు తెలిపారు. -
పచ్చనోటు కాదు.. పర్సే!
డబ్బులు జేబులో దాచుకునేందుకు ఒకప్పుడు పర్సు పెట్టుకోవడం అనేది ఒక ఫ్యాషన్. నేటి నగదురహిత ప్రపంచంలో పర్సు ఉపయోగించే వారు తగ్గినప్పటికీ, వాటి గిరాకీ మాత్రం తగ్గలేదు. పాతనోట్లను ఫ్లెక్సీలో ముద్రించి, పర్సుగా రూపొందించి విక్రయిస్తున్నారు. దీంతో పర్సు ఉపయోగించని వారుసైతం పర్సులు కొనుగోలు చేస్తుండడంతో హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. పెద్దనోట్ల నోట్ల రద్దుతో ఇళ్లల్లో మూలమూలలు వెదికి పెద్దనోట్లను బ్యాంకులో వేసుకున్నారు. పాతనోట్లు కొత్తనోట్లతో పోల్చితే రంగుతోపాటు ఆకర్షణీయంగా ఉండడంతో పదికాలాల పాటు పదిల పరుచుకునేందుకు పాతనోట్ల పర్సులను ప్రజలు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. – మల్యాల