పచ్చనోటు కాదు.. పర్సే!
డబ్బులు జేబులో దాచుకునేందుకు ఒకప్పుడు పర్సు పెట్టుకోవడం అనేది ఒక ఫ్యాషన్. నేటి నగదురహిత ప్రపంచంలో పర్సు ఉపయోగించే వారు తగ్గినప్పటికీ, వాటి గిరాకీ మాత్రం తగ్గలేదు. పాతనోట్లను ఫ్లెక్సీలో ముద్రించి, పర్సుగా రూపొందించి విక్రయిస్తున్నారు. దీంతో పర్సు ఉపయోగించని వారుసైతం పర్సులు కొనుగోలు చేస్తుండడంతో హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
పెద్దనోట్ల నోట్ల రద్దుతో ఇళ్లల్లో మూలమూలలు వెదికి పెద్దనోట్లను బ్యాంకులో వేసుకున్నారు. పాతనోట్లు కొత్తనోట్లతో పోల్చితే రంగుతోపాటు ఆకర్షణీయంగా ఉండడంతో పదికాలాల పాటు పదిల పరుచుకునేందుకు పాతనోట్ల పర్సులను ప్రజలు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. – మల్యాల