
డబ్బు పెట్టుకునే చిన్ని పర్సులు అతివల చేతుల్లో అందంగా ఇమిడిపోవడం చూస్తుంటాం. కళా హృదయం గలవారు మగువలు వాడుకునే ఈ పర్సులను ఆభరణాలుగా మార్చగలరు అనిపిస్తుంది ఈ డిజైన్స్ చూస్తుంటే. పర్సుకు హ్యాండిల్ ప్లేస్‌లో పొడవాటి బీడ్స్ లేదా ఇతర లోహాలతో డిజైన్ చేసి ఉంటే.. అది ఇక్కడ చూపినట్టుగా హారంగా అమర్చవచ్చు.
ఫ్యాబ్రిక్ జువెల్రీలో భాగంగా పర్సుల తయారీ కూడా హ్యాండ్‌మేడ్‌లో ఒక కళాత్మకవస్తువుగా మారిపోయింది. రంగు క్లాత్‌లతో చేసిన మోడల్ పర్సులకు కొన్ని అద్దాలు, కొన్ని పూసలు, ఇంకొన్ని గవ్వలు, కాసులు జత చేరిస్తే ఇలా అందంతో ఆకట్టుకుంటున్నాయి. మరికొన్నింటికి చక్కని పెయింట్, ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తే .. పర్సుల ఆభరణాలను ఇలా కళాత్మకంగా మెరిపించవచ్చు. (క్లిక్: స్టయిలిష్ లుక్‌తో టైమ్‌కి టైమొచ్చింది)
పాత డెనిమ్ ప్యాంట్ల జేబులతోనూ బొహేవియన్ స్టైల్‌లో పర్సు హారాలను తయారుచేసుకోవచ్చు. సృజనాత్మకతకు అడ్డే లేదని నిరూపిస్తున్న ఈ ఆభరణాలు నవతరాన్ని అమితంగా ఆకర్షిస్తున్నాయి. హ్యాండ్లూమ్ చీరలు, డ్రెస్సులకు కూడా కొత్త అందాలను మోసుకువస్తున్నాయి. ఇక నుంచి డబ్బుల కోసమే కాదు పర్సు హారం మెడకు నిండుదనాన్ని తీసుకువస్తుందని కూడా ఎంపిక చేసుకోవచ్చు అన్నమాట. (చదవండి: జంతు చర్మాలు ఒలిచి అలంకారం.. ఇదిగో సమాధానం!)
Comments
Please login to add a commentAdd a comment