purses
-
వాడేసిన ప్లాస్టిక్‌తో వండర్స్
మనింట్లో చాలా ప్లాస్టిక్ కవర్స్ పోగవుతాయి. వాటిని చెత్తలో పడేస్తాము. అవి ఎప్పటికీ మట్టిలో కలవక అలాగే కాలుష్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. కాని ఈ ప్లాస్టిక్ కవర్లనే రాజిబెన్ దారాలుగా చేసి బ్యాగులు అల్లుతుంది. బుట్టలు చేస్తుంది. పర్సులు చేస్తుంది. డోర్మ్యాట్లు సరేసరి. అందుకే ఆమెకు చాలా గుర్తింపు వచ్చింది. ఆమె వల్ల ఎందరికో ఉపాధి కలుగుతోంది. కొత్త ఆలోచన చేసిన వారే విజేతలు. గుజరాత్ కచ్ ప్రాంతంలోని కోటె అనే చిన్న పల్లెలో ఏమీ చదువుకోని అమ్మాయి – రాజి బెన్ పెరిగి పెద్దదయ్యి లండన్ వెళ్లి అక్కడ పెద్దవాళ్లతో తాను చేసిన కృషిని వివరించింది. ఆమె తన జీవితంలో ఇంత పెద్ద ప్రయాణం చేసి, గుర్తింపు పొందేలా చేసింది ఏమిటో తెలుసా? వృధా ప్లాసిక్. వాడేసిన ప్లాస్టిక్ రోడ్ల మీద, ఇళ్ల డస్ట్బిన్లలో, చెత్త కుప్పల మీద అందరూ ప్లాస్టిక్ కవర్లను, రేపర్లను పారేస్తారు. వాటిని ఏం చేయాలో ఎవరికీ ఏమీ తోచదు. అవి తొందరగా మట్టిలో కలిసిపోవు. కాని రాజిబెన్ వాటిని ఉపయోగంలోకి తెచ్చింది. వాటిని సేకరించి, కట్ చేసి పీలికలుగా మార్చి, కలిపి నేసి అందమైన వస్తువులు తయారు చేసింది. బ్యాగులు, సంచులు, పర్సులు... వాటి మన్నిక కూడా ఎక్కువ. ఎలా చేస్తారు? వాడేసిన ప్లాస్టిక్ క్యారీబ్యాగ్స్ను సేకరించి సర్ఫ్ నీళ్లతో కడుగుతారు. ఆ తర్వాత వాటిలోని మలినాలు పోవడానికి వేడి నీళ్లలో నానబెడతారు. తర్వాత రెండు రోజులు ఎండలో ఆరబెడతారు. ప్లాస్టిక్ మందంగా ఉంటే అర ఇంచ్ వెడల్పు రిబ్బన్లుగా; పలుచగా ఉంటే ముప్పావు ఇంచ్ రిబ్బన్లుగా కట్ చేస్తారు. ఈ ముక్కలను నాణ్యమైన జిగురుతో అంటించి పొడవైన ఉండగా మారుస్తారు. అంటే మగ్గం మీద నేయడానికి దారం బదులు ఈ ప్లాస్టిక్ ఉండనే ఉపయోగిస్తారు. ఈ ప్లాస్టిక్ దారాలతో నేస్తే దళసరి వస్త్రం తయారవుతుంది. దానిని కట్ చేసుకుని రకరకాల వస్తువులుగా చేతి నైపుణ్యంతో తీర్చిదిద్దుతారు. హ్యాండ్ బ్యాగ్‌లు, కూరగాయల బ్యాగ్‌లు, ఫోన్ బాక్సులు, పర్సులు.. ఇవన్నీ చాలా అందంగా ఉంటాయి. మన్నికతో ఉంటాయి. ఎలా వచ్చింది ఐడియా? రాజి బెన్ నేత కుటుంబంలో పుట్టింది. అయితే తండ్రికి నేత మీద విసుగుపుట్టి వ్యవసాయం చేసేవాడు. అదీగాక ఆడపిల్లలు మగ్గం మీద కూచోవడం నిషిద్ధం. కాని రాజి బెన్కి మగ్గం మీద పని చేయాలని 12 ఏళ్ల వయసు నుంచే ఉండేది. అందుకని మేనమామ కొడుకు దగ్గర రహస్యంగా మగ్గం పని నేర్చుకుంది. 14 ఏళ్లు వచ్చేసరికి మగ్గం పనిలో ఎక్స్‌పర్ట్‌గా మారింది. అయితే ఆమెకు పుట్టింటిలో కాని మెట్టినింటిలో గాని మగ్గం మీద కూచునే అవకాశమే రాలేదు. ఏడేళ్లు కాపురం చేశాక భర్త హటాత్తుగా మరణించడంతో రాజి బెన్ ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాల్సి వచ్చింది ముగ్గురు పిల్లల కోసం. కచ్‌లో ఒక ఎన్.జి.ఓ ఉంటే అక్కడ మగ్గం పని ఖాళీ ఉందని తెలిస్తే వెళ్లి చేరింది. అందమైన వస్త్రాలు అల్లి వాటిని ఆకర్షణీయమైన వస్తువులుగా తీర్చిదిద్దే స్థానిక కళలో ఆమె ప్రావీణ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. ఎన్.జి.ఓ వారు ఆమె చేసిన ఉత్పత్తులతో ఎగ్జిబిషన్ సేల్ నిర్వహించేవారు. 2012లో జరిగిన ఎగ్జిబిషన్లో ఒక విదేశీ డిజైనర్ ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేసి తయారు చేసిన బ్యాగ్‌ను చూపించి ‘ఇలాంటిది తయారు చేయగలవా?’ అని అడిగాడు. అది ఎలా తయారయ్యిందో అర్థమయ్యాక రాజి బెన్‌కు నాలుగు రోజులు కూడా పట్టలేదు అలాంటి బ్యాగులు తయారు చేయడానికి. ఆ డిజైనర్ వాటిని చూసి సంతృప్తిగా కొనుక్కుని వెళ్లాడు. మరికొన్ని బ్యాగులు జనం క్షణాల్లో ఎగరేసుకుపోయారు. అప్పటి నుంచి వేస్ట్ ప్లాస్టిక్ నుంచి రాజి బెన్ హస్తకళా ఉత్పత్తులను తయారు చేస్తోంది. స్వచ్ఛ్ సుజల్ శక్తి సమ్మాన్ రాజి బెన్ ఖ్యాతి ఎంత దూరం వెళ్లిందంటే అమృత మహోత్సవం సందర్భంగా ‘స్వచ్ఛ్ సుజల్ శక్తి సమ్మాన్’ పురస్కారం ఆమెకు ప్రకటించారు. అలాగే యూరప్ దేశాల నుంచి ఆమె ఉత్పత్తులకు ఆర్డర్లు వస్తున్నాయి. ‘ప్లాస్టిక్ పీడ విరగడ అవ్వాలంటే దానిని ఎన్ని విధాలుగా రీసైకిల్ చేయవచ్చో అన్ని విధాలుగా చేయాలి. రాజి బెన్ కొత్త తరాన్ని తనతో కలుపుకుంటే ఆమె ఉత్పత్తులు చాలా దూరం వెళ్లడమే కాక పర్యావరణానికి మేలు కూడా జరుగుతుంది’ అని విదేశీ ఎంట్రప్రెన్యూర్లు అంటున్నారు. రాజి బెన్ ప్రస్తుతం 90 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. 2018 నుంచి సొంత సంస్థ పెట్టుకోవడంతో దాని టర్నోవర్ ఇప్పుడు సంవత్సరానికి 10 లక్షలు దాటిపోయింది. ఆమె గెలుపు గాథ మరింత విస్తరించాలని కావాలని కోరుకుందాం. -
మెడలో పర్సుల హారాలు.. భలే ఉన్నాయ్!
డబ్బు పెట్టుకునే చిన్ని పర్సులు అతివల చేతుల్లో అందంగా ఇమిడిపోవడం చూస్తుంటాం. కళా హృదయం గలవారు మగువలు వాడుకునే ఈ పర్సులను ఆభరణాలుగా మార్చగలరు అనిపిస్తుంది ఈ డిజైన్స్ చూస్తుంటే. పర్సుకు హ్యాండిల్ ప్లేస్‌లో పొడవాటి బీడ్స్ లేదా ఇతర లోహాలతో డిజైన్ చేసి ఉంటే.. అది ఇక్కడ చూపినట్టుగా హారంగా అమర్చవచ్చు. ఫ్యాబ్రిక్ జువెల్రీలో భాగంగా పర్సుల తయారీ కూడా హ్యాండ్మేడ్లో ఒక కళాత్మకవస్తువుగా మారిపోయింది. రంగు క్లాత్‌లతో చేసిన మోడల్ పర్సులకు కొన్ని అద్దాలు, కొన్ని పూసలు, ఇంకొన్ని గవ్వలు, కాసులు జత చేరిస్తే ఇలా అందంతో ఆకట్టుకుంటున్నాయి. మరికొన్నింటికి చక్కని పెయింట్, ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తే .. పర్సుల ఆభరణాలను ఇలా కళాత్మకంగా మెరిపించవచ్చు. (క్లిక్: స్టయిలిష్ లుక్‌తో టైమ్‌కి టైమొచ్చింది) పాత డెనిమ్ ప్యాంట్ల జేబులతోనూ బొహేవియన్ స్టైల్లో పర్సు హారాలను తయారుచేసుకోవచ్చు. సృజనాత్మకతకు అడ్డే లేదని నిరూపిస్తున్న ఈ ఆభరణాలు నవతరాన్ని అమితంగా ఆకర్షిస్తున్నాయి. హ్యాండ్లూమ్ చీరలు, డ్రెస్సులకు కూడా కొత్త అందాలను మోసుకువస్తున్నాయి. ఇక నుంచి డబ్బుల కోసమే కాదు పర్సు హారం మెడకు నిండుదనాన్ని తీసుకువస్తుందని కూడా ఎంపిక చేసుకోవచ్చు అన్నమాట. (చదవండి: జంతు చర్మాలు ఒలిచి అలంకారం.. ఇదిగో సమాధానం!) -
మనిషి నోరులా కనిపిస్తున్న పర్సు
-
కొట్టేసిన పర్సులు @ పోస్ట్‌బాక్స్
చెన్నై: జేబు దొంగలు కొత్త పద్ధతి కనుగొన్నారు. కొట్టేసిన పర్సులను తెలివిగా వదిలించుకుంటున్నారు. ఐడీ కార్డులున్న పర్సులను వదిలించుకునేందుకు పోస్టు బాక్సులను స్వర్గధామంగా వాడుకుంటున్నారని చెన్నైలోని పోస్టల్ డిపార్ట్మెంట్ చెబుతోంది. గత ఆరు నెలలుగా ఇలాంటివి చాలా కేసులు తమ దృష్టికి వచ్చాయని తెలిపింది. పర్సుల నుంచి డబ్బులు తీసుకున్నాక వాటిని పోస్టు బాక్సుల్లో వేస్తున్నారని, అందులో ఐడీ కార్డులను మాత్రం ముట్టుకోకుండా అలాగే ఉంచేస్తున్నారని చెన్నై పోస్టల్ అధికారి ఒకరు తెలిపారు. గత ఆరు నెలల్లో చెన్నై సిటీ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 70 కేసులు తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. పర్సుల్లో ఆధార్, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సుల వంటివి ఉంటున్నట్లు తమ సిబ్బంది గుర్తించిందని చెప్పారు. అందులో ఉన్న ఐడీ కార్డులు సరైన అడ్రస్‌కు చేరుకునేలా తమ సిబ్బంది చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, అలా చేయడం వల్ల తమకేం ఆదాయం రాదని, అయినా ఇదో సేవలాగా తాము ఈ పనిచేస్తున్నామని వివరించారు. ఐడీ కార్డుల్లో ఫోన్ నంబర్ తదితర వివరాలుంటే వారిని సంప్రదించి సంబంధిత పోస్టాఫీసుల్లో తీసుకోవాలని సూచిస్తున్నారు. -
పాత నోట్ల డిజైన్లతో కొత్త పర్సులు
మాచర్ల : రద్దు చేసిన పాత నోట్ల నమూనాలో పర్సులు తయారు చేస్తున్నారు. అంబేద్కర్ సెంటర్, రైల్వేష్టేషన్ రోడ్, బస్టాండ్ సెంటర్, రింగ్‌రోడ్డు ప్రాంతాల్లో కేవలం రూ. 20 కే డిజైన్ పర్సులు అమ్ముతున్నారు. -
కొత్త నోట్ల పర్సుల సంచలనం...?
ముంబై: పెద్ద నోట్ల రద్దుతో దేశంలో కరెన్సీ సంక్షోభం ఒకవైపు కొనసాగుతుండగానే చైనా అప్పుడే రంగంలోకి దిగిపోయింది. ఆగండాగండి.. చైనా రంగంలోకి దిగిపోయింది..అంటే నకిలీ కరెన్సీతోనో.. నగదు మార్పిడికోసమో కాదు. కొత్త కరెన్సీ నోట్లకోసం ఆశగా ఎదురు చూస్తున్న భారతీయుల మనసు దోచుకునేందుకు చైనా తన మార్కెటింగ్ టెక్నిక్ ను మరోసారి బాగా వాడేసింది. దేశంలో చైనా వస్తువులను నిషేధించాలన్న వాదనలు కొనసాగుతుండగానే .. మన కొత్త రూ.500 రూ.2000 నోట్ల డిజైన్ తో పర్సులు మార్కెట్లలో దర్శనమివ్వడం ఆసక్తికరంగా మారింది. చవక వస్తువులతో దేశీయ వినియోగదారులను, మార్కెట్ ను కొల్లగొడుతున్న చైనా దేశీయ కొత్త కరెన్సీని పోలిన మహిళల వాలెట్స్ ను వినూత్నంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిందన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక్క పక్క దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో నగదు కొరతతో ప్రజలు అష్ట కష్టాలుపడుతోంటే.. రూ.2000, రూ.500 నోట్లను పోలిన డిజైన్ తో వాలెట్స్ ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాదు మనం దేశం నోట్ల ముద్రణకు ఇబ్బందులు పడుతోంటే.. చైనా మాత్రం అపుడే పర్సులను రెడీ చేసిందన్న కమెంట్లు వెల్లువెత్తాయి. కాగా రూ.500 రూ.1000 నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై పలురంగాల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతుండగా... ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో పెద్దనోట్ల రద్దుపై శీతాకాల పార్లమెంట్ సమావేశాలు అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. -
పర్సులు వదిలి సెల్ఫోన్ల వైపు!
* పంథా మార్చిన పిక్‌పాకెటింగ్ గ్యాంగ్స్ * నగరంలో ప్రతి నెలా వందల ఫోన్లు చోరీ * కేసు నమోదు కోసమూ బాధితుల అష్టకష్టాలు * హైకోర్టు తీర్పుతో ఊరట లభిస్తుందనే ఆశలు సాక్షి, సిటీబ్యూరో: నగరంలో జేబుదొంగల (పిక్ పాకెటర్స్) పంథా మారింది... ఒకప్పుడు పర్సులను మాత్రమే టార్గెట్ చేసిన వీళ్లు ప్రస్తుతం సెల్ఫోన్లపై పడ్డారు... నెలనెలా వందల సంఖ్యలో సెల్‌ఫోన్ బాధితులు ఉంటున్నారు. రికవరీ మాట పక్కన బెడితే... కేసుల నమోదుకే బాధితులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. అయితే, ‘కేసు నమోదు తప్పనిసరి’ అంటూ రాష్ట్ర హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలతో బాధితుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్లాస్టిక్ కరెన్సీ ఎఫెక్ట్‌తో... జంట కమిషనరేట్ల పరిధిలోని పిక్ పాకెటింగ్ గ్యాంగ్స్ రద్దీ ప్రాంతాలు, బస్సులు, రైళ్లలో పంజా విసురుతున్నాయి. ఒకప్పుడు ఓ పర్సును చోరీ చేస్తే కనీసం రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ‘గిట్టుబాటు’ అయ్యేది. అయితే ఇటీవల కాలంలో క్రెడిట్/డెబిట్ కార్డుల వంటి ప్లాస్టిక్ కరెన్సీ వినియోగం పెరిగిపోవడం, పర్సుల్లో డబ్బుకు బదులు ‘కార్డు’లే ఉంటుండటంతో జేబు దొంగలు పర్సుల జోలికి వెళ్లకుండా... సెల్ఫోన్లపై పడ్డారు. చోరీలకు పాత పంథాలనే అనుసరిస్తూ సెల్ఫోన్లు మాయం చేస్తున్నారు. ఫోనంటే వేల రూపాయలే... నగరంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సెల్‌ఫోన్ వినియోగం, వాటి విలువ గణనీయంగా పెరిగిపోయింది. కొన్నేళ్ల క్రితం వరకు ధనికులు మాత్రమే ఖరీదైన సెల్ఫోన్లు వినియోగించేవారు. అయితే ఇటీవల అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం, ఇతర కారణాల నేపథ్యంలో సామాన్యులతో పోటు విద్యార్థులు సైతం కనిష్టంగా రూ.20 వేల ఖరీదైన సెల్‌ఫోన్‌ను చేత్తోపట్టుకు తిరుగుతున్నారు. ఈ కారణంగానే ఓ సెల్‌ఫోన్ చోరీకి గురైందంటే దాని విలువు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ ఉంటోంది. వ్యక్తిగతంగా... వ్యవస్థీకృతంగా... హైదరాబాద్, సైబరాబాద్‌ల్లో పిక్‌పాకెటింగ్ గ్యాంగ్స్ ఎన్నో ఉన్నాయి. పేరు మోసిప పిక్ పాకెటర్లలోనూ ఎవరికి వారు వ్యక్తిగతంగా నేరాలు చేసే వారితో పాటు కొందరితో ముఠా కట్టి వ్యవస్థీకృతంగా నేరాలు చేయించే లీడర్లూ ఉన్నారు. వీరు చోరీ చేసిన సెల్ఫోన్లలో అత్యధికం స్థానికంగానే చేతులు మారుతుండగా... కొన్ని రాష్ట్రం దాటేస్తున్నట్లూ పోలీసులు గుర్తించారు. చోరీ అయిన సెల్ఫోన్లను గుర్తించి, రికవరీ చేసి బాధితులకు ఇవ్వడం అత్యంత అరుదైన విషయంగా మారిపోయింది. సెల్‌ఫోన్ చోరీ బాధితులకు ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవడమూ పెద్ద ప్రహసనమే. పెండింగ్ భయంతోనే అధికం... ఓ బాధితుడు పోలీసులకు ఆశ్రయించి ఎలాంటి ఫిర్యాదు చేసినా దాన్ని జీడీ ఎంట్రీ చేసి... తప్పనిసరిగా సీఆర్పీసీ (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్)లోని 154వ సెక్షన్ ప్రకారం ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ చేయాలి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం దీనికి న్యాయపరమైన సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం పోలీసులు మాత్రం దీన్ని పూర్తిగా అమలు చేయట్లేదు. ముఖ్యంగా జేబు దొంగతనాలు, స్నాచింగ్స్, సెల్‌ఫోన్ చోరీలు, వాహనాల దొంగతనాలకు సంబంధించిన కేసులు త్వరగా పరిష్కారం కావని, పెండింగ్ పెరుగుతుందనే ఉద్దేశంతో వీటిని చాలా వరకు ఎఫ్ఐఆర్ చేయట్లేదు. కేవలం జనరల్ డైరీ (జీడీ) ఎంట్రీతో సరిపెడుతున్నారు. బాధితులకు ఎంతో నష్టం... ఈ జీడీ ఎంట్రీ విధానాల వల్ల బాధితులు ఎంతో నష్టపోతున్నారు. ఇటీవల కాలంలో ఖరీదైన సెల్ఫోన్లకు కచ్చితంగా ఇన్సూరెన్స్ ఉంటోంది. దీన్ని క్లైమ్ చేసుకోవడానికి ఆయా సంస్థలు ఎఫ్ఐఆర్ కాపీ అడుగుతున్నాయి. పోలీసులు ఇస్తున్న లాస్ట్ రిపోర్ట్ లేదా నాన్-ట్రేస్డ్ సర్టిఫికెట్లు డూప్లికేట్ సిమ్‌కార్డులు తీసుకోవడానికి పూర్తి స్థాయిలో ఉపకరిస్తున్నాయి. అయితే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు వీటి ఆధారంగా క్లైమ్స్ అంగీకరించకపోవడం బాధితులకు నష్టాన్ని మిగులుస్తోంది. వాహనచోరీలు వంటి నేరాల్లోనూ బాధితులకు ఇదే ఇబ్బంది ఎదురవుతోంది. ఇకపై ఎఫ్ఐఆర్లు కచ్చితమయ్యేనా? పోలీసులు తమ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం లేదంటూ వి.మహేంద్ర, మరికొందరు హైకోర్టులో పిటిషన్ ఇటీవల దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సంజయ్‌కుమార్ ప్రత్యేక సందర్భాల్లో మినహా కచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ తీర్పునిచ్చారు. దీంతో బాధితులకు ‘కేసు కష్టాలు’ తీరినట్లేనని నిపుణులు చెప్తున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఓ ఫిర్యాదు అందిన తరవాత దాన్ని నమోదు చేయడానికి, చేయకపోవడానికి కారణాలను సైతం స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) స్పష్టం చే యాల్సి ఉంటుంది. బాధితులకు ఎంతో ఊరట కలిగించే ఈ అంశాలతో కూడిన సర్క్యులర్‌ను డీజీపీలు త్వరలో విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు. -
లంబాడీ స్టైల్ ఎంబ్రాయిడరీ వర్క్‌షాప్
బంజారా ఎంబ్రాయిడరీతో చేసే చేతి సంచులు, పర్సులు, రకరకాల గృహాలంకారాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కలర్‌ఫుల్ ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలనుకునే వారి కోసం వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ఎప్పుడు: మే 30, 31 ఎక్కడ: సికింద్రబాద్ అవర్ సేక్రెడ్ స్పేస్