
బాబువల్లే 27 మంది బలి
రాజమండ్రి ఘటనలో మృతిచెందిన రాజేశ్వరి కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరామర్శించారు.
నెల్లూరు: రాజమండ్రి ఘటనలో మృతిచెందిన రాజేశ్వరి కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరామర్శించారు. సీఎం చంద్రబాబునాయుడు అలసత్వం వల్లే 27 మంది ప్రాణాలు కోల్పోయారని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క, నెల్లూరు పరమేశ్వరినగర్లో అగ్నిప్రమాద బాధితులకు నెల్లూరు సిటీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆర్థికసాయం అందించారు. ఇక సమ్మెచేస్తున్న మున్సిపల్ కార్మికులకు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి మద్దతు తెలిపారు.