
నేడు నెల్లూరుకు వైఎస్ జగన్
► పార్టీలో చేరనున్న ఆనం వర్గీయులు
► బహిరంగసభ, పార్టీ కార్యాలయం ప్రారంభం
► ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యేలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు నెల్లూరుకు రానున్నట్లు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు ఆనం విజయకుమార్‌రెడ్డి ఇటీవల జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయ న అనుచరులు, సన్నిహితులు బుధవారం కస్తూరిదేవి గార్డెన్స్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాట్లను మంగళవారం ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం విజయకుమార్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పార్టీ అధ్యక్షు డు జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగుంట కు చేరుకుంటారన్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన ఉదయం 10గంటలకు నెల్లూరులోని కస్తూరిదేవి గార్డెన్స్‌కు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటుచేసిన సభలో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా విజయకుమార్‌రెడ్డి, ఆయన అనుచరులు జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు వెల్లడించా రు.
ఆ తర్వాత మాగంటలేవుట్‌లో నూతనంగా నిర్మించి పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు వివరించారు. అనంతరం పినాకిని అతిథిగృహానికి చేరుకుంటా రు. అక్కడ పార్టీ శ్రేణులతో సమావేశమవుతారన్నారు. సమావేశం అనంతరం తిరిగి రేణిగుంటకు చేరుకుని హైదరాబాద్‌కు పయనమవుతారని వారు వెల్లడించారు. ఈ సందర్భంగా జగన్ పర్యటనను విజయవంతం చేయాలని శ్రేణులకు వారు పిలుపునిచ్చారు.