
నేటి ధర్నాను విజయవంతం చేద్దాం
నెల్లూరు (సెంట్రల్): ఎన్నికల హామీలను టీడీపీ ప్రభుత్వం అమలు చేయాలనే డిమాండ్‌పై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల వద్ద బుధవారం నిర్వహించనున్న ధర్నాను ఐక్యంగా విజయవంతం చేద్దామని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక వాటి ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అంటూ ఎన్నికల సమయంలో ఊదరగొట్టి ఇప్పుడు పట్టించుకోకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజల పక్షాన చేస్నున్న ఈ ధర్నాకు పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలిరావాలని ఎంపీ మేకపాటి పిలుపునిచ్చారు.
అధికారులు నిష్పక్షపాతంగావ్యవహరించాలి
ప్రభుత్వాలు ఎప్పుడూ శాశ్వతం కాదని ఎంపీ అన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయన్నారు. అధికారులు మాత్రం ఎవరికీ లొంగకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కొందరు అధికారులు అధికార పార్టీ అండతో పనిచేస్తున్నట్లుగా ఉందన్నారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీకి సంబంధించి కొన్ని కమిటీలను ఎంపీ రాజమోహన్‌రెడ్డి ప్రకటించారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా క్రమశిక్షణా కమిటీ
ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిని సర్వేపల్లికి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని ఆత్మకూరుకు, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను సూళ్లూరుపేటకు, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని నెల్లూరు రూరల్‌కు, ఎమ్మెల్యే పి అనిల్‌కుమార్‌యాదవ్‌ను నెల్లూరుసిటీ క్రమ శిక్షణా కమిటీలో నియమించారు.
జిల్లా అధికార ప్రతినిధులు
మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి (సర్వేపల్లి), పొట్టేళ్ల శిరీష (వెంకటగిరి), బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి (నెల్లూరు రూరల్), వీరి చలపతి (కోవూరు), మల్లు సుధాకర్‌రెడ్డి (ఆత్మకూరు), నల్లపరెడ్డి రాజేంద్రకుమార్‌రెడ్డి (గూడూరు), పండిటి కామరాజు (కావలి), నాశిన నాగులు (గూడూరు), కట్టా సుధాకర్‌రెడ్డి (సూళ్లూరుపేట)లను నియమించారు.
వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల
అధ్యక్షుల నియామకం
కొండా వెంకటేశ్వర్లు, ఎస్సీ విభాగం (ఆత్మకూరు), బండ్ల అనిత, మహిళా విభాగం (ఉదయగిరి), బాపట్ల వెంకటపతి , ఎస్టీ విభాగం (కావలి), సూరూ శ్రీనివాసులురెడ్డి , రైతు విభాగం (కోవూరు), గొల్లపూడి ప్రసన్న శ్రావణ్ కుమార్ , విద్యార్థి విభాగం (నెల్లూరు నగరం), సయ్యద్ హమ్‌జా హుస్సేన్ , మైనార్టీ విభాగం (నెల్లూరు నగరం), మందా బాబ్జి , ట్రేడ్ యూనియన్ (నెల్లూరు రూరల్), దాసరి భాస్కర్‌గౌడ్ , బీసీ విభాగం (సర్వేపల్లి), నెలబల్లి భాస్కర్‌రెడ్డి, సేవాదళ్ విభాగం (గూడూరు), చల్లా మోహన్ , వికలాంగుల విభాగం(గూడూరు), కిళిని అర్ముగం, మత్య్సకారుల విభాగం (సూళ్లూరుపేట), సింగంశెట్టి భాస్కరరావు, చేనేత విభాగం(వెంకటగిరి), చీమల రమేష్‌బాబు, సాంస్కృతిక విభాగం (కోవూరు), ముతుకుండు వెంకటరెడ్డి, ప్రచార విభాగం(ఉదయగిరి).
ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, సర్వేపల్లి, నెల్లూరు సిటీ, రూరల్, గూడూరు, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పి అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పాశం సునీల్‌కుమార్, కిలివేటి సంజీవయ్య, నాయకుడు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.